Indian Wells ATP Masters Tennis Tournament
-
Indian Wells: జొకోవిచ్ శుభారంభం
ఐదేళ్ల తర్వాత ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బరిలోకి దిగిన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన జొకోవిచ్ 6–2, 5–7, 6–3తో ప్రపంచ 69వ ర్యాంకర్ అలెగ్జాండర్ వుకిచ్ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. ‘మాస్టర్స్ సిరీస్’ ఈవెంట్స్‌లో జొకోవిచ్‌కిది 400వ విజయం కావడం విశేషం. కేవలం రాఫెల్ నాదల్ (స్పెయిన్) మాత్రమే మాస్టర్స్ టోర్నీల్లో 400కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. -
‘నంబర్‌వన్’ అల్కరాజ్.. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సొంతం
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న స్పెయిన్ యువ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–3, 6–2తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందాడు. అల్కరాజ్కు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్ మెద్వెదెవ్కు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. మయామి ఓపెన్‌లోనూ టైటిల్ సాధిస్తేనే... ఇండియన్ వెల్స్ టోర్నీకి ముందు రెండో ర్యాంక్‌లో ఉన్న అల్కరాజ్ తాజా విజయంతో 7,420 పాయింట్లతో మరోసారి నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్ జొకోవిచ్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. కోవిడ్ టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో జొకోవిచ్ ఈ టోరీ్నకి దూరం కావాల్సి వచ్చింది. 7,160 పాయింట్లతో జొకోవిచ్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. సోమవారం మొదలైన మయామి ఓపెన్ టోర్నీలోనూ అల్కరాజ్ విజేతగా నిలిస్తేనే నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటాడు. లేదంటే ఏప్రిల్ 3న విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ మళ్లీ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు. మరోవైపు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ 18 ఏళ్ల తర్వాత తొలిసారి టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. రిబాకినా తొలిసారి... ఇండియన్ వెల్స్ ఓపెన్ మహిళల టోరీ్నలో కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలీనా రిబాకినా తొలిసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో రిబాకినా 7–6 (13/11), 6–4తో రెండో ర్యాంకర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సబలెంకా (బెలారస్)పై గెలిచింది. తాజా ప్రదర్శనతో రిబాకినా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. విజేత రిబాకినాకు 12,62,220 డాలర్ల (రూ. 10 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీ, రన్నరప్ సబలెంకాకు 6,62,360 డాలర్ల (రూ. 5 కోట్ల 46 లక్షలు) ప్రైజ్‌మనీ లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ జంట
Indian Wells Masters 2021: ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 6–3తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్–అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) జోడీపై గెలిచింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి ద్వయం సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. చదవండి: KKR vs DC, IPL 2021: కోల్‌కతా ‘సిక్సర్’తో... -
స్విస్ దిగ్గజానికి సెర్బియా స్టార్ షాక్
వాషింగ్టన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ షాక్ ఇచ్చాడు. ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ తుదిపోరులో ఫెడరర్‌ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ కైవశం చేసుకున్నాడు. 3-6, 6-3, 7-6 (7-3)తో ఫెడరర్‌పై గెలిచాడు. మూడోసారి ఈ టైటిల్ అందుకున్నాడు. 2008, 2011లో జొకోవిచ్ ఈ టైటిల్ దక్కించుకున్నాడు. మొదటి సెట్లో తాను బాగానే ఆడినప్పటికీ తర్వాత జొకోవిచ్ పుంజుకోవడంతో తలవంచాల్సి వచ్చిందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఫెడరర్ పేర్కొన్నాడు. బేస్ లైన్ వద్ద జొకోవిచ్ బాగా ఆడాడని అన్నాడు. తాను చేసిన తప్పులను అనుకూలంగా మలచుకుని విజయం సాధించాడని విశ్లేషించాడు. ఫెడరర్ నాలుగుసార్లు(2004, 2005, 2006, 2012) ఈ టైటిల్ గెల్చుకున్నాడు.