రోజర్ ఫెడరర్ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్కు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ షాక్ ఇచ్చాడు. ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ తుదిపోరులో ఫెడరర్ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ కైవశం చేసుకున్నాడు. 3-6, 6-3, 7-6 (7-3)తో ఫెడరర్పై గెలిచాడు. మూడోసారి ఈ టైటిల్ అందుకున్నాడు. 2008, 2011లో జొకోవిచ్ ఈ టైటిల్ దక్కించుకున్నాడు.
మొదటి సెట్లో తాను బాగానే ఆడినప్పటికీ తర్వాత జొకోవిచ్ పుంజుకోవడంతో తలవంచాల్సి వచ్చిందని మ్యాచ్ ముగిసిన తర్వాత ఫెడరర్ పేర్కొన్నాడు. బేస్ లైన్ వద్ద జొకోవిచ్ బాగా ఆడాడని అన్నాడు. తాను చేసిన తప్పులను అనుకూలంగా మలచుకుని విజయం సాధించాడని విశ్లేషించాడు. ఫెడరర్ నాలుగుసార్లు(2004, 2005, 2006, 2012) ఈ టైటిల్ గెల్చుకున్నాడు.