కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోరీ్నలో అడుగు పెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించాడు. వరుస సెట్‌లలో గెలిచి టైటిల్ వేటను ఆరంభించాడు. 2018 నుంచి ఈ టోరీ్నలో ఓటమి ఎరుగని ఏడుసార్లు చాంపియన్ ఎనిమిదోసారి విజేతగా అవతరించాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టోరీ్నలు ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ జొకోవిచ్ ఖాతాలోకే వెళ్లాయి.
వింబుల్డన్‌లోనూ జొకోవిచ్ అజేయంగా నిలిస్తే అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించేందుకు జొకోవిచ్‌కు రెండోసారి అవకాశం లభిస్తుంది. 2021లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోరీ్నలను గెలిచి చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. 1969లో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) తర్వాత పురుషుల టెన్నిస్‌లో మరో ప్లేయర్ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను సాధించలేకపోయాడు.
లండన్: కాస్త పోటీ ఎదురైనా... కీలకదశలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిన సెర్బియా టెన్నిస్ మేటి నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 7–6 (7/4)తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 13 ఏస్‌లు సంధించాడు. తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
45 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ నెట్ వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ 18వ సారి వింబుల్డన్ టోరీ్నలో ఆడుతుండగా... కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ టోరీ్నలో బరిలోకి దిగిన కాచిన్ పది ఏస్‌లు సంధించి, 29 అనవసర తప్పిదాలు చేశాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 5–7, 6–4, 6–3తో లారెంట్ లోకిలి (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 7–5, 6–4తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై, 14వ సీడ్ ముజెట్టి (ఇటలీ) 6–3, 6–1, 7–5తో వారిలాస్ (కెనడా)పై, 17వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–1, 6–4, 6–4తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
స్వియాటెక్ బోణీ
మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో స్వియాటెక్ 6–1, 6–3తో లిన్ జు (చైనా)ను ఓడించగా... పెగూలా 6–2, 6–7 (8/10), 6–3తో లారెన్ డేవిస్ (అమెరికా)పై, గార్సియా 6–4, 6–3తో కేటీ వోలినెట్స్ (అమెరికా)పై, అజరెంకా 6–4, 5–7, 6–4తో యు యువాన్ (చైనా)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment