Wimbledon Grand Slam tournament
-
'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు'
టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు ఉంటే అందులో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడి నిర్వాహకులు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు. తాజాగా సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రారంభమైంది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు జరిగే కోర్టుల వద్ద క్వైట్ రూమ్స్ (Quite Rooms) ఏర్పాటు చేయడం ఆనవాయితీ. సాధారణంగా ఈ క్వైట్ రూమ్స్‌ను ఆటగాళ్లు, ఇతర వ్యక్తులు ప్రార్థనలు, మెడిటేషన్స్ కోసం మాత్రమే ఉపయోగించాలనే రూల్ ఉంది. కానీ గతేడాది జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సమయంలో ఈ క్వైట్ రూమ్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు రిపోర్టులు వచ్చాయి. కొంతమంది ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనగా.. మరికొంతమంది తమ పార్ట్‌నర్స్‌తో ఏకాంతంగా గడిపినట్లు సమాచారం. ముఖ్యంగా కోర్టు 12కు ఆనుకొని ఉన్న క్వైట్ రూమ్‌లో ఇలాంటివి వెలుగు చూసినట్లు తెలిసింది. అందుకే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ నిర్వాహకులు ఈసారి టోర్నీ ప్రారంభానికి ముందే ఆటగాళ్లకు, ఇతరులకు ముందే వార్నింగ్ ఇచ్చారు. క్వైట్ రూమ్‌లు కేవలం మెడిటేషన్స్, ప్రార్థనల కోసం మాత్రమే ఉపయోగించాలని.. తమ పర్సనల్ పనులు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్(ALETC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ ఇదే విషయమై స్పందించారు. ''క్వైట్ రూమ్ అనేది చాలా ముఖ్యం. కేవలం అక్కడ మనసు ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థనలు మాత్రమే చేయాలి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదు. ప్రార్థనల కోసం అయితే పర్లేదు. అలాగే తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు కూడా ఇక్కడ సౌకర్యాలు(BreastFeeding Centres) ఉంటాయి. కాబట్టే దీన్ని సరైన మార్గంలో వినియోగించుకోవాలి.''అంటూ పేర్కొంది. చదవండి: కోల్‌కతాలో పర్యటిస్తున్న అర్జెంటీనా స్టార్ గోల్ కీపర్.. నోరూరించే వంటకాలు రెడీ 'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా' -
Wimbledon 2023: వేట మొదలు...
కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ లక్ష్యంగా వింబుల్డన్ టోరీ్నలో అడుగు పెట్టిన సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తొలి అడ్డంకిని అలవోకగా అధిగమించాడు. వరుస సెట్లలో గెలిచి టైటిల్ వేటను ఆరంభించాడు. 2018 నుంచి ఈ టోరీ్నలో ఓటమి ఎరుగని ఏడుసార్లు చాంపియన్ ఎనిమిదోసారి విజేతగా అవతరించాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన రెండు గ్రాండ్‌స్లామ్ టోరీ్నలు ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ జొకోవిచ్ ఖాతాలోకే వెళ్లాయి. వింబుల్డన్‌లోనూ జొకోవిచ్ అజేయంగా నిలిస్తే అరుదైన ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించేందుకు జొకోవిచ్‌కు రెండోసారి అవకాశం లభిస్తుంది. 2021లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోరీ్నలను గెలిచి చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. 1969లో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) తర్వాత పురుషుల టెన్నిస్‌లో మరో ప్లేయర్ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను సాధించలేకపోయాడు. లండన్: కాస్త పోటీ ఎదురైనా... కీలకదశలో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిన సెర్బియా టెన్నిస్ మేటి నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 7–6 (7/4)తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా)పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 13 ఏస్‌లు సంధించాడు. తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 45 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ నెట్ వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. జొకోవిచ్ 18వ సారి వింబుల్డన్ టోరీ్నలో ఆడుతుండగా... కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోరీ్నలో బరిలోకి దిగిన కాచిన్ పది ఏస్‌లు సంధించి, 29 అనవసర తప్పిదాలు చేశాడు. పురుషుల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 5–7, 6–4, 6–3తో లారెంట్ లోకిలి (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–3, 7–5, 6–4తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై, 14వ సీడ్ ముజెట్టి (ఇటలీ) 6–3, 6–1, 7–5తో వారిలాస్ (కెనడా)పై, 17వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్) 6–1, 6–4, 6–4తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. స్వియాటెక్ బోణీ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా), ఐదో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో స్వియాటెక్ 6–1, 6–3తో లిన్ జు (చైనా)ను ఓడించగా... పెగూలా 6–2, 6–7 (8/10), 6–3తో లారెన్ డేవిస్ (అమెరికా)పై, గార్సియా 6–4, 6–3తో కేటీ వోలినెట్స్ (అమెరికా)పై, అజరెంకా 6–4, 5–7, 6–4తో యు యువాన్ (చైనా)పై విజయం సాధించారు. -
Wimbledon 2022: నాదల్ అదరహో
లండన్: ఈ ఏడాది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాదల్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 36 ఏళ్ల నాదల్ 4 గంటల 21 నిమిషాల్లో 3–6, 7–5, 3–6, 7–5, 7–6 (10/4)తో ‘సూపర్ టైబ్రేక్’లో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై అద్భుత విజయం సాధించాడు. మ్యాచ్ రెండో సెట్లో నాదల్కు పొత్తి కడుపులో నొప్పి రావడంతో మెడికల్ టైమ్అవుట్ తీసుకొని చికిత్స చేయించుకొని ఆటను కొనసాగించాడు. ఆ తర్వాత మొండి పట్టుదలతో ఆడిన నాదల్ చివరకు విజయతీరం చేరాడు. మ్యాచ్ మొత్తంలో ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిరియోస్తో నాదల్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిరియోస్ 6–4, 6–3, 7–6 (7/5)తో క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై గెలిచి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. హలెప్ జోరు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 2019 చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–2, 6–4తో అనిసిమోవా (అమెరికా)పై... రిబాకినా (కజకిస్తాన్) 4–6, 6–2, 6–3తో తొమ్లాజనోవిచ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి సెమీస్ చేరారు. మరో క్వార్టర్ ఫైనల్లో ఆన్స్ జబర్ (ట్యూనిషియా) 3–6, 6–1, 6–1తో మేరీ బుజ్ కోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి అరబ్ ప్లేయర్‌గా నిలిచింది. -
Wimbledon 2022: 35వ ప్రయత్నంలో క్వార్టర్స్‌కు
లండన్: 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి తాత్యానా మరియా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 34 ఏళ్ల తాత్యానా మరియా 5–7, 7–5, 7–5తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 12వ సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై సంచలన విజయం సాధించింది. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మరియా తొలి సెట్‌ను కోల్పోయి రెండో సెట్లో 4–5 స్కోరు వద్ద తన సర్వీస్‌లో రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది ఏస్‌లు సంధించిన మరియా తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. ఒస్టాపెంకో ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. 2007 నుంచి ఇప్పటిదాకా 34 గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో పోటీపడిన మరియా మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జూల్ నిమియర్ (జర్మనీ) 6–2, 6–4తో హీతెర్ వాట్సన్ (బ్రిటన్)పై, మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై గెలుపొంది తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. నాదల్ పదోసారి... పురుషుల సింగిల్స్‌లో రెండుసార్లు చాంపియన్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ పదోసారి వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–2, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచాడు. ఐదో సీడ్ అల్కరాజ్ ఓటమి మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 1–6, 4–6, 7–6 (10/8), 3–6తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 6–4, 7–5, 6–4తో టామీ పాల్ (అమెరికా)పై గెలుపొందాడు. -
వింబుల్డన్‌కు బీమా ధీమా
లండన్: మహమ్మారి దెబ్బకు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రద్దయ్యింది. ఇందులో విశేషమేమీ లేదు ఎందుకంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్సే ఈ ఏడాది జరగడం లేదు. దాంతో పోల్చితే వింబుల్డన్ ఓ టెన్నిస్ టోర్నీ మాత్రమే! టోక్యో ఈవెంట్ రద్దు కాకపోయినా వాయిదా వల్లే జపాన్ కోట్ల నష్టం చవిచూడనుంది. కానీ వింబుల్డన్ రద్దయినా పైసా నష్టం లేదు. కోట్ల రూపాయలు రానున్నాయి. చిత్రంగా ఉన్నా... ఇది నిజంగా నిజమే! ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ముందుచూపు వారి కొంప మునగకుండా చేసింది. కొన్నేళ్లుగా టోర్నీకి బీమా చేయించింది. అయితే కరోనా కొత్త వైరస్ దీంతో బీమా చెల్లింపులు జరగవనుకుంటే పొరపాటే! ఎందుకంటే నిర్వాహకులు దూరదృష్టితో ఆలోచించారు. ఏదో బీమా చేశాంలే అని ‘మమ’ అనిపించలేదు. పాలసీలో ఎండవానలు–ప్రకృతి వైపరీత్యాలు, బంద్‌లు ఇలా అన్నింటిని ఒప్పందంలో చేర్చారు. అలాగే వైరస్, మహమ్మారిల వల్ల కూడా ఆట రద్దయినా బీమా వర్తించాల్సిందేనన్న ‘క్లాజ్’ను చేర్చారు. ఇప్పుడు ఈ క్లాజే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు శ్రీరామరక్ష అయ్యింది. కోవిడ్–19 మహమ్మారి వల్ల రద్దయిన టోర్నీకి సదరు బీమా సంస్థ డబ్బులు చెల్లించాల్సిందే. దీంతో అక్షరాల రూ.1064 కోట్ల (141 మిలియన్ డాలర్లు) బీమా మొత్తం ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు రానున్నాయి. దీనిపై క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ రిచర్డ్ లూయిస్ మాట్లాడుతూ ‘మేం ముందుజాగ్రత్తగా తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసే మాకు అండగా నిలిచింది. ఇన్సూరెన్స్ సంస్థ, మధ్యవర్తులు ఇలా చాలా మంది ఈ వ్యవహారంలో కలిసి పనిచేశారు. అందుకే పూర్తిస్థాయి బీమా (ఫుల్ ఇన్సురెన్స్) సాధ్యమైంది. అయితే పాలసీ సొమ్ము అందేందుకు సమయం పడుతుంది. పేపర్ వర్క్ పూర్తవ్వాలి’ అని అన్నారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం 2002లో సార్స్ వైరస్ వెలుగు చూసింది. దీంతో 2003నుంచి బీమా పరిధిలోకి వైరస్, ప్రపంచాన్ని వణికించే మహమ్మారిలను కూడా చేర్చారు. గత 17 ఏళ్లుగా ఏడాదికి 2 మిలియన్ డాలర్ల చొప్పున 2019 వరకు నిర్వాహకులు ఇన్సూరెన్స్ కోసం మొత్తం 34 మిలియన్ డాలర్లు చెల్లించారు. -
జయహో జొకోవిచ్
సమఉజ్జీల పోరంటే ఇది. అసలు సిసలు ఫైనల్ అంటే కచ్చితంగా ఇదే! అలసటే ఉత్సాహం తెచ్చుకున్న సమరంలో దిగ్గజం ఫెడరర్ పోరాడి ఓడగా... డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్ ఫైనల్ వేదిక ఐదు సెట్ల దాకా ఆడించింది. ప్రేక్షకుల్ని 4 గంటల 57 నిమిషాలపాటు కూర్చోబెట్టింది. ఆఖరి దాకా నువ్వానేనా అన్నట్లు టైటిల్ కోసం ఈ పోరాట యోధులిద్దరూ యుద్ధమే చేశారు. తుదకు కీలకదశలో సంయమనంతో ఆడిన జొకోవిచ్ పైచేయి సాధించాడు. తన కెరీర్లో ఐదోసారి వింబుల్డన్ టైటిల్‌ను, 16వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లండన్: టాప్ సీడ్ల మధ్య జరిగిన ఆఖరి సమరంలో అంతిమ విజయం జొకోవిచ్‌కు దక్కింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/5), 1–6, 7–6 (7/4), 4–6, 13–12 (7/3)తో రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. ఐదు సెట్ల పోరాటంలో మూడు సెట్లను టైబ్రేక్లే తేల్చాయి. ఏస్‌ల రారాజు ఫెడరర్ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జొకోవిచ్ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు. స్విస్ స్టార్ 61 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 94 విన్నర్లు కొట్టిన ఫెడరర్, ఆరుసార్లు డబుల్ ఫాల్ట్ చేశాడు. జొకోవిచ్ 54 విన్నర్లు కొట్టాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఐదో టైటిల్ గెలిచిన జొకోవిచ్ ఓవరాల్‌గా 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఓపెన్ శకం మొదలయ్యాక టాప్ సీడ్, రెండో సీడ్ వింబుల్డన్ ఫైనల్లో తలపడటం ఇది 14వసారి. 2015లోనూ ఈ ఇద్దరు టైటిల్ కోసం పోటీపడగా ఫెడెక్స్‌పై జొకోవిచే గెలిచాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)... రన్నరప్ ఫెడరర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభం నుంచే హోరాహోరీ... ఇద్దరి ఆట ఆరంభం నుంచే వేటగా మారింది. అందుకే ఒక్క సెట్ మినహా మిగతా అన్ని సెట్లు నువ్వానేనా అన్నట్లే సాగాయి. ముందుగా 58 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో ఎవరి సర్వీస్‌ను వారు నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ ఒక గేమ్ గెలిస్తే... మరో గేమ్ ఫెడరర్ నెగ్గాడు. ఇలా 12 గేమ్‌ల దాకా సాగిన తొలి సెట్లో ఇద్దరూ ఆరేసి పాయింట్లు సంపాదించారు. దీంతో ఫలితం తేల్చేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియన్ అంత చురుగ్గా ఫెడరర్ షాట్లకు పదును పెట్టలేకపోయాడు. దీంతో ఫెడెక్స్ తొలి సెట్‌ను కోల్పోయాడు. రెండో సెట్ మినహా... తుది పోరులో ఈ రెండో సెట్ మినహా అన్నీ సెట్లు యుద్ధాన్ని తలపించాయి. ఈ సెట్లో ఫెడెక్స్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్ హాండ్ షాట్లతో చెలరేగాడు. ప్రత్యర్థి కంటే రెట్టింపు వేగంతో కదం తొక్కడంతో జొకో ఆటలేవీ సాగలేదు. దీంతో ఫెడరర్ జోరుకు తిరుగేలేకుండా పోయింది. ఆరంభం నుంచి చకచకా పాయింట్లు సాధిస్తుండటంతో వరుస గేముల్లో రోజర్ గెలుస్తూ వచ్చాడు. రెండు బ్రేక్ పాయింట్లతో పాటు తన సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో కేవలం 15 నిమిషాల్లోనే ఫెడరర్ 4–0తో ఆధిపత్యం చాటాడు. అదేపనిగా అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ స్టార్ ఒక్క గేమ్ అయిన గెలకుండానే సెట్ కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. చివరకు ఐదో గేమ్‌లో సెర్బియన్ స్టార్‌కు గేమ్ గెలిచే పట్టుచిక్కింది. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 1–4తో స్విస్ స్టార్ జోరుకు ఎదురు నిలిచాడు. వెంటనే తేరుకున్న ఫెడరర్ మరో బ్రేక్ పాయింట్‌తో పాటు సర్వీస్ నిలబెట్టుకొని సెట్‌ను 6–1తో గెలిచాడు. టైబ్రేక్‌లో జొకో జోరు... మూడో సెట్ కూడా తొలి సెట్‌నే తలపించింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరు శక్తికి మించే శ్రమించారు. 52 నిమిషాల పాటు జరిగిన ఈ సెట్లో ఫెడరర్ తన ప్రత్యర్థిపై 4 ఏస్‌లతో విరుచుకుపడినప్పటికీ 12 అనవసర తప్పిదాలు ఫలితంపై ప్రభావం చూపాయి. ఈ సెట్ కూడా 6–6దాకా సాగడంతో టైబ్రేక్ తప్పలేదు. ఇందులో సెర్బియన్ స్టార్ వయసుపైబడిన ఫెడెక్స్‌పై సహజంగా తన దూకుడు కనబరచడంతో సెట్ దక్కించుకున్నాడు. నాలుగో సెట్లో మళ్లీ ఫెడరర్ జోరు పెంచాడు. ఇందులో సుదీర్ఘ ర్యాలీలు జరిగిన ప్రతీసారి ఫెడరర్ విన్నర్లు సంధించి సెట్‌ను గెలుపొందాడు. నిర్ణాయక ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 8–7తో ఆధిక్యంలో ఉన్నపుడు తన సర్వీస్‌లో ఫెడరర్ 40–15తో రెండు మ్యాచ్ పాయింట్లు సంపాదించాడు. అయితే జొకోవిచ్ తేరుకొని ఈ గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 8–8తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచాడు. ఆ తర్వాత ఆఖరి సెట్ కటాఫ్ స్కోరు 12–12 దాకా జరిగింది. ఇక్కడ టైబ్రేక్ నిర్వహిస్తే మళ్లీ జొకోవిచే పైచేయి సాధించడంతో టైటిల్ వశమైంది. ఈ సీజన్లో సెర్బియన్ స్టార్కిది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లో వెనుదిరిగాడు. -
జొకోవిచ్ X ఫెడరర్
లండన్: ఈ సీజన్లో తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 4–6, 6–3, 6–2తో 23వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో జొకోవిచ్ తలపడతాడు. 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/3), 1–6, 6–3, 6–4తో మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై గెలిచాడు. వరుసగా 21వ ఏడాది వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న 37 ఏళ్ల ఫెడరర్ 12వసారి ఫైనల్‌కు చేరాడు. 8 సార్లు టైటిల్ నెగ్గిన అతను మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాడు. ఈ ఏడాది బాటిస్టా అగుట్తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన జొకోవిచ్ మూడోసారి మాత్రం విజయాన్ని రుచి చూశాడు. 27వ ప్రయత్నంలో కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన అగుట్ ఆ అడ్డంకిని మాత్రం దాటలేకపోయాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పోరులో జొకోవిచ్‌కు రెండో సెట్ మినహా అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. మ్యాచ్ మొత్తంలో తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 53 సార్లు దూసుకొచ్చిన అతను 42 సార్లు పాయింట్లు సాధించడం విశేషం.అగుట్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ రెండో సెట్లో ఒకసారి తన సర్వీస్‌ను కోల్పోయాడు. 42 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు అగుట్ కేవలం ఐదు ఏస్‌లు సంధించి రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. అగుట్పై విజయంతో జొకోవిచ్ తన కెరీర్లో 25వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరాడు. 15 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన అతను 9సార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. వింబుల్డన్ ట్రోఫీని నాలుగుసార్లు (2011, 2014, 2015, 2018) సొంతం చేసుకున్న జొకోవిచ్ ఒకసారి (2013లో) రన్నరప్‌గా నిలిచాడు. -
బార్టీ ఆట ముగిసింది
లండన్: ఎర్ర మట్టి కోర్టులపై చెలరేగి ఫ్రెంచ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) పచ్చిక కోర్టులపై మాత్రం తడబడింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ హోదాలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగిన యాష్లే బార్టీ ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. యాష్లే బార్టీతోపాటు మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్స్ దాటకుండానే ఇంటిముఖం పట్టారు. 15 ఏళ్ల అమెరికా రైజింగ్ స్టార్ కోరి గాఫ్ సంచలన ప్రదర్శనకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) అడ్డుకట్ట వేసింది. హలెప్తోపాటు ఎనిమిదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఏడుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గతేడాది వింబుల్డన్‌లో మూడో రౌండ్లో ఓడిన బార్టీ ఈ ఏడాది ఒక అడుగు ముందుకేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 23 ఏళ్ల బార్టీ 6–3, 2–6, 3–6తో అన్‌సీడెడ్ అలీసన్ రిస్కీ (అమెరికా) చేతిలో కంగుతింది. తొలి సెట్లో ప్రభావం చూపించిన ఈ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ తర్వాత రెండు సెట్లలోనూ నిరాశపరిచింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–3, 6–3తో కోరి గాఫ్‌పై అలవోక విజయం సాధించింది. అమెరికా టెన్నిస్ దిగ్గజం, 11వ సీడ్ సెరెనా 6–2, 6–2తో వరుస సెట్లలో కార్లా స్వారెజ్ నవారో (స్పెయిన్)పై, స్వితోలినా 6–4, 6–2తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై గెలుపొందారు. మూడో సీడ్ ప్లిస్కోవా 6–4, 5–7, 11–13తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో... ఆరో సీడ్ క్విటోవా 6–4, 2–6, 4–6తో 19వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో కంగుతింది. సీడెడ్ ఆటగాళ్ల జోరు... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు మాజీ చాంపియన్స్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 6–3, 6–2, 6–3తో ఉగో హంబర్ట్ (ఫ్రాన్స్)పై, మూడో సీడ్ నాదల్ 6–2, 6–2, 6–2తో జొవో సొసా (పోర్చుగల్)పై, రెండో సీడ్ ఫెడరర్ 6–1, 6–2, 6–2తో బెరెటిని (ఇటలీ)పై సునాయాస విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో 21వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 7–6 (11/9), 2–6, 6–3, 6–4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై, 23వ సీడ్ బాటిస్ట అగుట్ (స్పెయిన్) 6–3, 7–5, 6–2తో బెనొయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్) జంట 5–7, 7–6 (8/6), 6–7 (3/7), 3–6తో టాప్ సీడ్ కుబోట్ (పోలాండ్)–మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఆ సర్వీస్‌తో బిత్తరపోయిన నాదల్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ రఫెల్ నాదల్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. అన్‌సీడెడ్ ఆస్ట్రేలియా ఆటగాడు నికీ కిరియోస్తో రెండో రౌండ్లో తలపడిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 6–3, 3–6, 7–6 (7/5),7–6(7/3)తో చెమటోడ్చి నెగ్గాడు. అయితే నాదల్ మూడో రౌండ్లోకి ప్రవేశించే క్రమంలో తీవ్రంగా శ్రమించాడు. తొలి సెట్‌ను సునాయసంగా గెలిచినా, రెండో సెట్‌ను కోల్పోయాడు. ఇక మూడో, నాలుగో సెట్లను టై బ్రేక్‌లో విజయం సాధించి ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నాడు. అయితే నాదల్‌ను ఓడించినంత పని చేసిన కిరియోస్ చేసిన ఒక అండర్ ఆర్మ్ సర్వీస్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. టెన్నిస్‌లో అరుదుగా చేసే అండర్ ఆర్మ్ సర్వీస్‌ను నాదల్‌పై ప్రయోగించాడు కిరియోస్. దీనికి నాదల్‌తో పాటు అభిమానులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అండర్ ఆర్మ్ సర్వీస్ అనేది టెన్నిస్ ఆటలో భాగమైనప్పటికీ ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఆ సర్వీస్ నాదల్కు పరీక్షగా నిలిచింది. ఇది ఊహించని సర్వీస్ కాబట్టి నాదల్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. అయితే ఇది గేమ్‌లో భాగమైనందున నాదల్ చిరునవ్వుతో స్వాగతించక తప్పలేదు. సాధారణంగా టెన్నిస్‌లో తల పైభాగం నుంచి సర్వీస్లే ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాగా, భుజాన్ని పైకి ఎత్తకుండా నేలబారుగా సర్వీస్ చేసిన కియోరిస్ ప్రత్యేకగా ఆకర్షణగా నిలవడమే కాకుండా హాట్ టాపిక్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్త్తోంది. -
సరిగా ఆడనందుకు భారీ జరిమానా
లండన్ : వివాదాస్పద ఆస్ట్రేలియా ఆటగాడు బెర్నార్డ్ టామిక్ మరో సారి వింబుల్డన్ నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో అతను తన సామర్థ్యానికి తగినట్లుగా ఆడలేదని రిఫరీ భారీ జరిమానా విధించారు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టామిక్ 2–6, 1–6, 4–6 స్కోరుతో ఓటమిపాలయ్యాడు. టామిక్‌కు తొలి రౌండ్ ఆడినందుకు వచ్చే ప్రైజ్‌మనీ మొత్తం 45 వేల పౌండ్లను (సుమారు రూ. 39 లక్షలు) జరిమానాగా చెల్లించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ఆదేశించింది. ‘సోంగాతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో టామిక్ ఆట ప్రొఫెషనల్ ప్రమాణాల స్థాయిలో లేదని రిఫరీ అభిప్రాయ పడ్డారు. అందుకే ఈ శిక్ష విధిస్తున్నాం’ అని నిర్వాహకులు ప్రకటించారు. అయితే తాను ఆడగలిగినంత అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చానని, అయినా ఓడిపోయానని టామిక్ వివరణ ఇచ్చాడు. టామిక్‌కు ఇలాంటిది కొత్త కాదు. రెండేళ్ల క్రితం వింబుల్డన్‌లోనే జ్వెరేవ్తో జరిగిన మ్యాచ్‌లో ‘ఆడటం బోరింగ్ అనిపిస్తోంది’ అంటూ గాయమైనట్లు నాటకం ఆడి ఓడాడు. దీనికిగానూ అతనిపై జరిమానా పడింది. 2011లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ చేరిన సమయంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–20లో ఉన్న టామిక్ ప్రస్తుతం 96వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. -
నంబర్‌వన్ జోరు
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత వరల్డ్ నెం.1 యాష్లే బార్టీ హవా కొనసాగుతోంది. గురువారం 55 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో బార్టీ 6–1, 6–3తో వాన్వ్యుట్వాన్క్(బెల్జియం)పై గెలుపొంది మూడో రౌండ్ చేరింది. మ్యాచ్‌లో బార్టీ ఐదు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. మరోవైపు మాజీ చాంపియన్, అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ 2–6, 6–2, 6–4తో జువాన్ (స్లొవేనియా)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–0, 6–2తో యాంగ్ (చైనా)పై, 6వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో క్రిస్టీనా మ్లడినోవిచ్ (ఫ్రాన్స్)పై, జొహానా కొంటా (బ్రిటన్) 6–3, 6–4తో కేథరినా సినికోవాపై గెలుపొందారు. అమెరికా టీనేజ్ సంచలనం కోరీ గాఫ్ 6–3, 6–3తో 2017 సెమీఫైనలిస్ట్ రిబరికోవా (స్లొవేకియా)పై నెగ్గి మూడో రౌండ్ చేరుకుంది. జొకో జోరు.. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) తన జోరు కొనసాగిస్తున్నాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో అతడు 6–3, 6–2, 6–2తో కుడ్లా (అమెరికా)పై గెలిచి మూడో రౌండ్ చేరుకున్నాడు. జొకోతో పాటు రెండో సీడ్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సైతం తన సొగసైన గ్రాస్ కోర్టు ఆటతో ప్రేక్షకులకు కనువిందు చేస్తు్తన్నాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ 6–1, 7–6 (7/3), 6–2తో జే క్లార్క్ (బ్రిటన్)పై గెలిచి తదుపరి రౌండ్లో అడుగుపెట్టాడు. మ్యాచ్‌లో ఫెడరర్ 46 విన్నర్లు, 10 ఏస్‌లు సంధించాడు. 8వ సీడ్ కీ నిషికోరి (జపాన్) 6–4, 6–4, 6–0తో కెమరాన్ నొర్రీపై గెలిచి మూడో రౌండ్లో ప్రవేశించాడు. పోర్చుగల్‌కు చెందిన జొనో సౌసా 6–4, 6–4, 6–4 తేడాతో వరుస సెట్లలో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు నికీ కిరియోస్తో మ్యాచ్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 6–3, 3–6, 7–6 (7/5),7–6(7/3)తో చెమటోడ్చి నెగ్గాడు. తొలి సెట్‌ను సునాయాసంగా గెల్చుకున్న నాదల్‌ను రెండో సెట్లో కిరియోస్ ప్రతిఘటించాడు. అయితే మూడో, నాలుగో సెట్లను టై బ్రేక్‌లో వశం చేసుకున్న నాదల్ జయభేరి మోగించాడు. బోపన్న జోడీకి చుక్కెదురు.. వింబుల్డన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత డబుల్స్ ప్లేయర్ రోహన్ బోపన్న–పాబ్లో క్యువాస్(ఉరుగ్వే) జోడీకి మొదటి రౌండ్లోనే చుక్కెదురైంది. వీస్లీ కూలోఫ్ (నెదర్లాండ్)–మార్కస్ డేనియల్(న్యూజిలాండ్)లతో జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం 4–6, 4–6, 6–4, 6–7(7/9) తేడాతో ఓటమి పాలైంది. మొదటి రెండు సెట్లను ప్రత్యర్థులకు సులువుగా సమర్పించుకున్న బోపన్న జంట మూడో సెట్‌ను గెలిచింది. అయితే నాలుగో సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన ఈ జోడీ... మ్యాచ్‌ను సైతం చేజార్చుకుంది. -
ప్రజ్నేశ్ ప్రత్యర్థి రావ్‌నిచ్
లండన్: భారత టెన్నిస్ నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్, 2016 రన్నరప్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో ప్రజ్నేశ్ ఆడతాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో తొలిసారి ఆడిన ప్రజ్నేశ్ మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు. డబుల్స్ విభాగంలో భారత్ నుంచి దివిజ్ శరణ్, రోహన్ బోపన్న, లియాండర్ పేస్, జీవన్ నెడుంజెళియన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు. ఒకే పార్శ్వంలో ఫెడరర్, నాదల్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ నాదల్ (స్పెయిన్) ఒకే పార్శ్వంలో ఉన్నారు. ఫలితంగా అంతా సజావుగా సాగితే వీరిద్దరు సెమీఫైనల్లోనే తలపడతారు. మరో పార్శ్వంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) ఉన్నాడు. తొలి రౌండ్లో లాయిడ్ (దక్షిణాఫ్రికా)తో ఫెడరర్; సుగిటా (జపాన్)తో నాదల్; కోల్‌ష్రైబర్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతారు. -
ఫెడరర్ జోరు కొనసాగేనా?
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)తో నేడు జరిగే తొలి రౌండ్లో ఆడనున్న ఫెడరర్‌కు సెమీఫైనల్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం కనిపించడం లేదు. గాయం కారణంగా మాజీ చాంపియన్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే వైదొలగడం... ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో పార్శ్వంలో ఉండటం ఫెడరర్‌కు కలిసొచ్చే అంశం. పురుషుల సింగిల్స్‌లో భారత్ తరఫున యూకీ బాంబ్రీ... డబుల్స్‌లో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్, విష్ణువర్ధన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్, పురవ్ రాజా బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా)తోపాటు డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్), వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) టైటిల్ రేసులో ఉన్నారు. సా.గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
మెయిన్ ‘డ్రా’కు విష్ణు–బాలాజీ జంట
లండన్: కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆడేందుకు హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్, చెన్నైకు చెందిన శ్రీరామ్ బాలాజీ సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన డబుల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో విష్ణు–బాలాజీ జోడీ 6–3, 6–4తో టాప్ సీడ్ డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)–ఇగోర్ జెలెనె (స్లొవేనియా) జంటపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జీవన్ నెడున్‌చెజియాన్ (భారత్)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీ 7–6 (7/5), 6–3తో ఎడ్వర్డ్ కోరి–లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్) జంటను ఓడించి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనాకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో అంకిత 2–6, 7–5, 4–6తో వితాలియా దియాత్‌చెంకో (రష్యా) చేతిలో పోరాడి ఓడింది. వింబుల్డన్ ప్రధాన టోర్నమెంట్ జూలై 2న ప్రారంభమవుతుంది. -
సుమీత్ సంచలనం
వింబుల్డన్ బాలుర డబుల్స్ టైటిల్ సొంతం లండన్ : ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఢిల్లీ కుర్రాడు సుమీత్ నాగల్ జూనియర్ బాలుర డబుల్స్ విభాగంలో టైటిల్ గెలిచాడు. ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో సుమీత్-నామ్ హోవాంగ్ లీ(వియత్నాం) ద్వయం 7-6 (7/4), 6-4తో రీలీ ఒపెల్కా (అమెరికా)-అకీరా సాంటిలాన్ (జపాన్) జోడీపై గెలిచింది. ఈ విజయంతో జూనియర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఆరో భారతీయ క్రీడాకారుడిగా సుమీత్ గుర్తింపు పొందాడు. గతంలో రామనాథన్ కృష్ణన్ (1954లో వింబుల్డన్), రమేశ్ కృష్ణన్ (1979లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్), లియాండర్ పేస్ (1990లో వింబుల్డన్, 1991లో యూఎస్ ఓపెన్), యూకీ బాంబ్రీ (2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్), సానియా మీర్జా (2003లో వింబుల్డన్ డబుల్స్) ఈ ఘనత సాధించారు. -
మళ్లీ ఆ ఇద్దరే...
-
మళ్లీ ఆ ఇద్దరే...
♦ వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్, ఫెడరర్ ♦ సెమీస్‌లో గాస్కే, ముర్రేలపై గెలుపు లండన్ : ఈ సీజన్లో అద్వితీయ ఫామ్‌లో ఉన్న రోజర్ ఫెడరర్, నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ తమ జోరు కొనసాగిస్తున్నారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/2), 6-4, 6-4తో 21వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)పై గెలుపొందగా... రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7-5, 7-5, 6-4తో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను ఓడించాడు. ఆదివారం సాయంత్రం ఫైనల్ జరుగుతుంది. గతేడాది కూడా జొకోవిచ్, ఫెడరర్‌ల మధ్యనే ఫైనల్ జరిగింది. నిరుడు జొకోవిచ్ విజేతగా నిలిచాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్ 20-19తో ఆధిక్యంలో ఉన్నాడు. ‘హ్యాట్రిక్’ ఫైనల్ గతంలో గాస్కేతో ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయిన జొకోవిచ్‌కు ఈసారి కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. మంచి ఫిట్నెస్తో ఉన్న ఈ సెర్బియా స్టార్ దూకుడు ముందు గాస్కే ఎదురునిలువలేకపోయాడు. సింగిల్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ షాట్లతో గాస్కే అలరించినా కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకున్నాడు. తొలి సెట్ ఆరంభంలో జొకోవిచ్ 2-0తో ముందంజ వేసినా, గాస్కే పుంజుకొని స్కోరును 4-4తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో గాస్కే ఏకాగ్రత కోల్పోయి సెట్‌ను కోల్పోయాడు. తర్వాతి రెండు సెట్లలోనూ జొకోవిచ్ తన దూకుడు కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 12 ఏస్‌లు సంధించి ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. వింబుల్డన్‌లో జొకోవిచ్ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా మూడో ఏడాది కాగా ఓవరాల్‌గా నాలుగోసారి. 2013లో నాదల్ చేతిలో ఓడిన అతను, గతేడాది ఫెడరర్‌పై గెలిచాడు. 26వసారి గ్రాండ్‌స్లామ్ తుదిపోరుకు... మాజీ చాంపియన్ ఆండీ ముర్రేతో జరిగిన మరో సెమీఫైనల్లో ఫెడరర్ కళ్లు చెదిరే ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తన కెరీర్లో 26వసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఫెడరర్ పదునైన సర్వీస్‌లకు, గురి తప్పని రిటర్న్‌లకు, బ్యాక్‌హాండ్ షాట్లకు ముర్రే వద్ద సమాధానం లేకపోయింది. మొత్తం 20 ఏస్‌లు సంధించిన ఈ స్విస్ స్టార్ కేవలం ఒకే డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సెట్లోని 12వ గేమ్‌లో, రెండో సెట్లోని 12వ గేమ్‌లో, మూడో సెట్లోని పదో గేమ్‌లో ముర్రే సర్వీస్‌లను ఫెడరర్ బ్రేక్ చేసి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటికే 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్ ఖాతాలో మరో టైటిల్ చేరుతుందో లేదో ఆదివారం తేలుతుంది.