ALETC చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్
టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు ఉంటే అందులో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడి నిర్వాహకులు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు. తాజాగా సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రారంభమైంది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు జరిగే కోర్టుల వద్ద క్వైట్ రూమ్స్ (Quite Rooms) ఏర్పాటు చేయడం ఆనవాయితీ.
సాధారణంగా ఈ క్వైట్ రూమ్స్‌ను ఆటగాళ్లు, ఇతర వ్యక్తులు ప్రార్థనలు, మెడిటేషన్స్ కోసం మాత్రమే ఉపయోగించాలనే రూల్ ఉంది. కానీ గతేడాది జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సమయంలో ఈ క్వైట్ రూమ్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు రిపోర్టులు వచ్చాయి. కొంతమంది ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనగా.. మరికొంతమంది తమ పార్ట్‌నర్స్‌తో ఏకాంతంగా గడిపినట్లు సమాచారం. ముఖ్యంగా కోర్టు 12కు ఆనుకొని ఉన్న క్వైట్ రూమ్‌లో ఇలాంటివి వెలుగు చూసినట్లు తెలిసింది.
అందుకే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ నిర్వాహకులు ఈసారి టోర్నీ ప్రారంభానికి ముందే ఆటగాళ్లకు, ఇతరులకు ముందే వార్నింగ్ ఇచ్చారు. క్వైట్ రూమ్‌లు కేవలం మెడిటేషన్స్, ప్రార్థనల కోసం మాత్రమే ఉపయోగించాలని.. తమ పర్సనల్ పనులు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్(ALETC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ ఇదే విషయమై స్పందించారు.
''క్వైట్ రూమ్ అనేది చాలా ముఖ్యం. కేవలం అక్కడ మనసు ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థనలు మాత్రమే చేయాలి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదు. ప్రార్థనల కోసం అయితే పర్లేదు. అలాగే తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు కూడా ఇక్కడ సౌకర్యాలు(BreastFeeding Centres) ఉంటాయి. కాబట్టే దీన్ని సరైన మార్గంలో వినియోగించుకోవాలి.''అంటూ పేర్కొంది.
చదవండి: కోల్‌కతాలో పర్యటిస్తున్న అర్జెంటీనా స్టార్ గోల్ కీపర్.. నోరూరించే వంటకాలు రెడీ
Comments
Please login to add a commentAdd a comment