Illegal relationships
-
'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు'
టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు ఉంటే అందులో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడి నిర్వాహకులు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు. తాజాగా సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రారంభమైంది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు జరిగే కోర్టుల వద్ద క్వైట్ రూమ్స్ (Quite Rooms) ఏర్పాటు చేయడం ఆనవాయితీ. సాధారణంగా ఈ క్వైట్ రూమ్స్‌ను ఆటగాళ్లు, ఇతర వ్యక్తులు ప్రార్థనలు, మెడిటేషన్స్ కోసం మాత్రమే ఉపయోగించాలనే రూల్ ఉంది. కానీ గతేడాది జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సమయంలో ఈ క్వైట్ రూమ్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు రిపోర్టులు వచ్చాయి. కొంతమంది ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనగా.. మరికొంతమంది తమ పార్ట్‌నర్స్‌తో ఏకాంతంగా గడిపినట్లు సమాచారం. ముఖ్యంగా కోర్టు 12కు ఆనుకొని ఉన్న క్వైట్ రూమ్‌లో ఇలాంటివి వెలుగు చూసినట్లు తెలిసింది. అందుకే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ నిర్వాహకులు ఈసారి టోర్నీ ప్రారంభానికి ముందే ఆటగాళ్లకు, ఇతరులకు ముందే వార్నింగ్ ఇచ్చారు. క్వైట్ రూమ్‌లు కేవలం మెడిటేషన్స్, ప్రార్థనల కోసం మాత్రమే ఉపయోగించాలని.. తమ పర్సనల్ పనులు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్(ALETC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ ఇదే విషయమై స్పందించారు. ''క్వైట్ రూమ్ అనేది చాలా ముఖ్యం. కేవలం అక్కడ మనసు ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థనలు మాత్రమే చేయాలి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదు. ప్రార్థనల కోసం అయితే పర్లేదు. అలాగే తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు కూడా ఇక్కడ సౌకర్యాలు(BreastFeeding Centres) ఉంటాయి. కాబట్టే దీన్ని సరైన మార్గంలో వినియోగించుకోవాలి.''అంటూ పేర్కొంది. చదవండి: కోల్‌కతాలో పర్యటిస్తున్న అర్జెంటీనా స్టార్ గోల్ కీపర్.. నోరూరించే వంటకాలు రెడీ 'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా' -
హత్యలకు దారి తీసిన వివాహేతర సంబంధాలు
సాక్షి, దుగ్గిరాల(గుంటూరు) : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన శనివారం దుగ్గిరాలలో చోటుచేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రంలోని చేన్నకేశవనగర్కు చెందిన చనుమోలు వెంకట పద్మావతికి (35) కొద్ది సంవత్సరాల కిందట విజయవాడకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కుమారుడు పుట్టిన తరువాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయారు. ఈ క్రమంలో స్వగ్రామం దుగ్గిరాల చేరుకుని బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంది. ఈ నేపథ్యంలో పెనుమూలి గ్రామానికి చెందిన భీమవరపు సుబ్బారెడ్డితో పరిచయం ఏర్పడింది. గత ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఏడాది నుంచి సుబ్బారెడ్డి పద్మావతిని వేధిస్తుండటంతో వివాహేతర సంబంధానికి నిరాకరించింది. దీంతో సుబ్బారెడ్డి పద్మావతిని అక్రమ సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో చెన్నకేశవనగర్‌లో పద్మావతి నివాసం ఉంటున్న ఇంటిపైకి వెళ్లాడు. ఇద్దరి మధ్య మాటలు పెరిగి ఒక్కసారిగా సుబ్బారెడ్డి తన వెంట తెచ్చుకున్న సల్ఫస్ మాత్రలు (పసుపు బిళ్లలు) పద్మావతి నోట్లో బలవంతంగా వేశాడు. పెద్దగా శబ్ధం వినిపించడంతో గదిలో నిద్రపోతున్న పద్మావతి కుమారుడు హేమంత్ బయటకు వచ్చాడు. గుమ్మంలో పడిపోయిన తల్లిని చూసి పెద్దగా కేకలు వేశాడు. అక్కడే ఉన్న సుబ్బారెడ్డి ‘మీ అమ్మ నోట్లో సల్ఫస్ మాత్రలు వేసి చంపాను.. నిన్ను కూడా చంపేస్తానని’ హేమంత్‌ను బెదిరించాడు. దేహశుద్ధి చేసిన స్థానికులు... అనంతరం తన చేతిలో ఉన్న సల్ఫస్ మాత్రలు సుబ్బారెడ్డి మింగినట్లు హేమంత్ పోలీసులకు తెలిపాడు. సమీపంలోని బంధువులు అక్కడకు చేరుకుని సుబ్బారెడ్డిని చితకబాదడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడకు చేరుకుని పద్మావతిని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అపస్మారక స్థితికి చేరుకున్న సుబ్బారెడ్డిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడ నుంచి తాడేపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సీఐ ఆశోక్ కుమార్, ఎస్ఐ అనిల్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పద్మావతి మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాల వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు హేమంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేకల కాపరి దారుణహత్య బొల్లాపల్లి: మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన మేకల కాపరి అంకె ఏడుకొండలు (35) దారుణహత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తల మొండెం వేర్వేరు ప్రదేశాల్లో ఉండటంతో రాయి, కొడవలితో హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గ్రామానికి చెందిన అంకె ఏడుకొండలు, పాలపర్తి నాగయ్య మేకల కాపరులు. ఇద్దరూ కలిసి రోజూ మేకలను తోలుకొని సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి కాసేవారు. ఈ క్రమంలో నాగయ్య ఏడుకొండల భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని సమాచారం. దీంతో కొన్ని రోజుల నుంచి కొండలు, నాగయ్య మధ్య వివాదం నడుస్తోంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ఎలాగైనా ఏడుకొండలను హతమార్చాలని నాగయ్య భావించాడు. ఈ నేపథ్యంలోనే ఏడుకొండలను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించాడు. శుక్రవారం మేకలు కాసేందుకు వెళ్లిన ఏడుకొండలను నాగయ్య దారుణంగా హత్య చేసి తల, మొండెం వేరు చేశాడు. మృతుడి సోదరుడు ముసలయ్య ఫిర్యాదు మేరకు నిందితుడు నాగయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హత్య జరిగిందిలా... గ్రామానికి సమీపంలోని కొండ ప్రాంతానికి ఏడుకొండలు శుక్రవారం మేకలను తోలుకొని వెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి తిరిగి వచ్చినా ఏడుకొండలు మాత్రం రాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సమీపంలోని అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. సాగర్ కుడికాలువకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో ఏడు కొండలు మృతదేహం కంటపడింది. సమాచారం మేరకు వినుకొండ రూరల్ సీఐ ఎం.సుబ్బారావు, బండ్లమోటు ఎస్సై వి.వెంకట్రావు సిబ్బందితో ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. మృతుడి మొండెం, తల వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటం గుర్తించారు. శుక్రవారం రాత్రి సమయంలో నాగయ్య అటవీప్రాంతం నుంచి రావడాన్ని కొందరు గ్రామస్తులు గమనించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతుడికి భార్య రమణ, కుమారుడు ఉన్నారు. అనుమానాస్పదం కాదు..మధుది ముమ్మాటికీ హత్యే ! పిడుగురాళ్ల: పట్టణంలోని శ్రీనివాసకాలనీకి చెందిన మీసాల మధు (21) అనుమానాస్పదంగా మృతి చెందలేదని, ముమ్మాటికీ హత్యేనని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై శనివారం ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుడైన మైనింగ్ మాఫియా ప్రధాన నిందితుడు అంజిబాబు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కుమార్తెతో మధు వివాహతేర సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే అంజిబాబు మ«ధుని హత్య చేయించాడని బంధువులు ఆరోపించారు. హత్య చేసి కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధు హత్య కేసులో ముగ్గురు కంటే ఎక్కువ మందే ఉన్నారని ఆరోపించారు. పోలీసులు విచారించి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సీఐ ఎ. సురేంద్రబాబు మాట్లాడుతూ కేసు విచారిస్తున్నామని తెలిపారు. నిందితులు ఎంతటివారైనా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ హామీతో మధు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై సీఐ సురేంద్రబాబును వివరణ కోరగా మధు మృతి పట్ల అనుమానాలున్నాయని, ఆ కోణంలో విచారిస్తామన్నారు. ప్రియురాలితో కలిసి భార్యపై హత్యాయత్నం విజయపురిసౌత్ : ప్రియురాలితో కలిసి భార్యను హతమార్చేందుకు భర్త విఫలయత్నం చేసిన ఘటన విజయపురిసౌత్‌లో కలకలం రేపింది. ఎస్ఐ కె.పాల్‌రవీందర్ కథనం మేరకు.. మాచర్ల పట్టణంలోని 8వ వార్డు సెరీన్కాలనీకి చెందిన బత్తుల కళ్యాణ్ అదే వార్డులోని ఉప్పుతోళ్ళ రమాదేవితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. కళ్యాణ్ భార్య అరుణ వారికి అడ్డంకిగా ఉందని భావించాడు. ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలు రమాదేవి తమ్ముడు స్నేహితుడైన ఆటోడ్రైవర్ శేషా సందీప్‌ను గుంటూరు నుంచి పిలిపించింది. కళ్యాణ్ విజయపురిసౌత్‌లోని సాగర్మాత దేవాలయంలో నిద్ర చేయాలని భార్య అరుణను సందీప్ ఆటోలో తీసుకుని వచ్చారు. రాత్రి బహిర్భూమికి వెళ్లాలి తోడురా అంటూ కళ్యాణ్ భార్యను పిలిచి దేవాలయ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకువచ్చాడు. హత్యాయత్నానికి గురైన అరుణ అదే సమయంలో అక్కడికి ప్రియురాలు రమాదేవి సందీప్ ఆటోలో అక్కడికి చేరుకుంది. ముగ్గురు కలిసి అరుణను బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని కాలువ కట్టపైనున్న పశువేముల బ్రిడ్జిపై నుంచి కుడికాలువలోకి తోసి పరారయ్యారు. అరుణకు స్వల్పంగా ఈత రావటంతో కాలువ గోడ పక్కగా నీటిలో ఈత కొట్టుకుంటూ అక్కడ సమీపంలోని కుడికాలువ ర్యాంప్ ద్వారా ఒడ్డుకు చేరుకుంది. కాలువ సమీంపలో ఉన్న పశువేముల గ్రామానికి Ðð వెళ్లి అక్కడి గ్రామస్తులను లేపి విషయం చెప్పింది. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భర్త పరారీలో ఉండగా ప్రియురాలు రమాదేవి, ఆటోడ్రైవర్ సందీప్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
మహిళలను శిక్షించొద్దు.. సెక్షన్ 497పై క్లారిటీ
సాక్షి, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధాల్లో పురుషుడితో సమానంగా స్త్రీని కూడా శిక్షించాలన్న వాదనను కేంద్రం వ్యతిరేకించింది. ఇలాంటి వ్యవహారాల్లో పురుషుడిని ఖైదు చేసే భారతీయ శిక్షా స్మృతి - సెక్షన్ 497ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పురుషుడిని మాత్రమే దోషిగా గుర్తిస్తున్న ఈ సెక్షన్‌ను తొలగించాలని కేరళకు చెందిన జోసెఫ్ షైన్ గతేడాది డిసెంబర్లో అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 497ను తొలగిస్తే దేశంలో కల్లోలం జరుగుతుందని అభిప్రాయపడింది. వివాహం అనే పవిత్ర బంధానికి అర్థం లేకుండా పోతుందని పేర్కొంది. సెక్షన్‌ను కొనసాగించడం ద్వారానైనా హద్దులు మరచి ప్రవర్తించే కొంతమందినైనా అడ్డుకోవచ్చని తెలిపింది. ఆందోళన కలిగిస్తున్న సంఘటనలు వివాహేతర సంబంధాలు దేశవ్యాప్తంగా ఎన్నో కాపురాలను నిట్టనిలువునా కూల్చుతున్నాయి. అక్రమ సంబంధాలతో కుటుంబ వ్యవస్థ కుప్పకూలుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తను భార్యలు హతమార్చారు. వీటితో కలత చెందిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకూమారి పురుషులకు ఓ కమిషన్ ఉండాలని వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఏం కోరారు? సెక్షన్ 497 పురుషులతో పోల్చుతూ మహిళలపై వివక్షతను చూపుతోందని పిటిషనర్ తన వాదన వినిపించారు. ‘ఒక రిలేషన్షిప్లో కేవలం పురుషుడు మాత్రమే ఆకర్షిస్తాడా?. ఓ మహిళ వేరే పురుషుడితో వివాహేతర సంబంధం నెరపడానికి అనర్హురాలా?. వేరొకరి భార్యతో సంబంధం కలిగివున్న పురుషుడికి మాత్రమే జైలు శిక్ష ఎలా వేస్తారు?(మహిళకు కూడా శిక్ష విధించాలని కోరుతూ). భర్త అంగీకారంతో భార్య వేరొకరితో సంబంధం కలిగివుంటే అతన్ని శిక్షించకుండా వదిలేయాలా?.’ వంటి ప్రశ్నలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. డిసెంబర్లో వీటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల నేతృత్వంలోని బెంచ్ ఇందుకు ప్రతిగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఒక మహిళను పురుషుడితో సమానంగా సెక్షన్ 497 చూడటం లేదని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నట్లు బెంచ్ పేర్కొంది. మహిళను పురుషుడి కంటే తక్కువగా చూడటం సమాజానికి అలవాటైందని వ్యాఖ్యానించింది. అయితే, చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రానికి సెక్షన్ 497 కాన్సెప్ట్ ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పింది. భర్త అంగీకారం ఉంటే భార్య వేరొకరితో సంబంధం కలిగివుండొచ్చనే భావన మహిళ ఉనికిని ప్రశ్నించే విధంగా ఉందని అభిప్రాయపడింది. సెక్షన్ 497 ఏం చెబుతోంది? వేరొకరి భార్యతో వివాహేతర సంబంధం కలిగివుండటాన్ని ఐపీసీ సెక్షన్ 497 నేరంగా పరిగణిస్తోంది. ఇందులో మహిళ ప్రోద్భలం ఉన్నా, కేవలం పురుషుడికి మాత్రమే శిక్ష విధించాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా వివాహేతర సంబంధం కలిగివున్న మహిళ అన్ని సందర్భాల్లో కేవలం బాధితురాలిగా మాత్రమే పరిగణించబడుతోంది. సంబంధం కలిగివున్న పురుషుడికి గరిష్టంగా ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. -
తెలుగుగంగ కాలువపై వ్యక్తి దారుణ హత్య
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిల్లకూరు: వేట కత్తులతో ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన మండలంలోని కడివేడు రెవెన్యూ పరిధి అటవీ ప్రాంతంలో ఉన్న తెలుగుగంగ ఐదో బ్రాంచ్ కాలువపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గూడూరు రూరల్ సీఐ అక్కేశ్వరరావు కథనం మేరకు.. ఓజిలి మండలం భువనగిరిపాళెంకు చెందిన మల్లి శ్రీనివాసరావు అలియాస్ సన్యాసి (42) కొంతకాలంగా కోట మండలం విద్యానగర్ ప్రాంతంలోని ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటున్నాడు. ఇతను ఓజిలి మండలం రాజుపాళెం గ్రామంలోని జాతీయ రహదారిపై పంక్చర్ షాపు నిర్వహిస్తున్నాడు. రోజూలానే మోటారుబైక్పై విద్యానగర్ నుంచి రాజుపాళెంకు దగ్గరగా ఉంటుందని సమీపంలోని తెలుగుగుంగ కాలువపై నుంచి వెళుతున్నాడు. అటవీ ప్రాంతంలో నిర్మాణుష్యంగా ఉన్న ప్రాంతంలో నుంచి అకస్మాత్తుగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. వేట కత్తులతో శరీరంపై ఎక్కడపడితే అక్కడ నరికి వేయడంతో శ్రీనివాసరావు రక్తపు మడుగులో కొట్టుకుని మృతిచెందాడు. అటుగా వెళుతున్న ఓ యువకుడు రక్తపుమడుగులో వ్యక్తి ఉన్నాడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం వివరాలు సేకరించింది. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట చిల్లకూరు, గూడూరు రూరల్ ఎస్సైలు కె.శ్రీనివాసరావు, బాబీ, సిబ్బంది ఉన్నారు. కాపు కాసి.. శ్రీనివాసరావు రోజూ ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరి తెలుగు గంగకాలువ వద్దకు ఎంత సమయానికి వస్తాడు? తదితర విషయాలను దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎవరూ లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని మద్యం తెచ్చుకుని సేవించి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో నాలుగు డిస్పోసబుల్ గ్లాసులు ఉండటంతో నలుగురు వ్యక్తులు హత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఏం కారణం? శ్రీనివాసరావు భువనగిరిపాళెంలో నివాసం ఉన్న సమయంలో తన మొదటి భార్యను హతమార్చి అక్కడి నుంచి నివాసాన్ని విద్యానగర్ ప్రాంతా నికి మార్చి ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల భూ వివాదం నేపథ్యంలో తన వదిన చెవి నరికివేసినట్లు ఓజిలి పోలీసు స్టేషన్లో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు ఈ రెండింటిలో ఏదైనా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఛీ.. అన్న భార్యతోనే శారీరక సంబంధం...
వైట్‌ఫీల్డ్: డబ్బు ఇతరత్రా ప్రలోభాలతో మానవత్వానికే మచ్చ తెస్తున్నారు కొందరు. అర్థంపర్థం లేని అక్రమ సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తన అన్న మరణించడంతో అతని భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి... డబ్బు విషయంలో గొడవ పడి ఆమెను గొంతు కోసి చంపాడు. మంగళవారం ఈ సంఘటన రాజగోపాలనగర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. గణపతినగరంలో నటరాజ అనే వ్యక్తి వెల్డింగ్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. అతని అన్న కొంతకాలం కింద చనిపోవడంతో వదిన సరోజమ్మతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. సరోజమ్మ అతని వద్ద అప్పుడప్పుడు కొంత డబ్బు తీసుకుంది. ఆమె సమీపంలోని గార్మెంట్స్‌లో పనిచేసేది. ఆ డబ్బును తిరిగి ఇవ్వమని నటరాజ పలుమార్లు సరోజమ్మను ఒత్తిడి చేయసాగాడు. గత నెల 30వ తేదీన సరోజమ్మ, నటరాజకు డబ్బు విషయమై వివాదం చెలరేగింది. ఆగ్రహంతో నటరాజ కత్తితీసుకుని సరోజమ్మ గొంతు కోసి చంపాడు. నిందితుడు నటరాజను అదుపులోకి తీసుకున్న రాజగోపాలనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త బాగోతాన్ని బయటపెట్టిన భార్య..
సాక్షి, విశాఖపట్నం: కట్టుకున్న భర్త ఏం చేసినా మౌనంగానే భరించింది. అయితే తన కళ్లముందే ప్రియురాలితో తిరుగుతున్న భర్త ఆగడాలను ఇంక భరించలేకపోయింది. అంతే, ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను.. గదిలో ఉండగా తాళంపెట్టి, భర్త చేసే నీచమైన పనిని అందరి కళ్లకు చూపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కవారు ఆమెకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం, గాజువాకలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌కు 2014లో దుర్గతో వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు ఆరిలోవలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ పాప పుట్టి చనిపోయింది. అయితే కొద్దికాలంగా భర్త ప్రసాద్ ప్రవర్తనలో మార్పులు గమనించింది దుర్గ. ఇంటికి సరిగా రాకపోవడం, ప్రతి విషయానికి చిరాకు పడటం చేసేవాడు. దీంతో ప్రసాద్‌పై భార్య అనుమానం వచ్చింది. తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని గ్రహించింది. అంతేకాదు పురుషోత్తపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ప్రియురాలితో ఆరునెలలుగా కాపురం సాగిస్తున్నాడన్న విషయం తెలుసుకుంది. ఈ క్రమంలోనే వారి ఇంటికి వెళ్లిన దుర్గ... ఇద్దరూ ఇంట్లో ఉండగా తలుపులకు తాళం వేసింది. భర్త చేసే నీచమైన పనిని అందరి కళ్లకు చూపించింది. భర్త తనను మోసం చేశాడని, న్యాయం కావాలని ఇంటిముందు దుర్గ ఆందోళన చేపట్టింది. -
భర్త బాగోతాన్ని బయటపెట్టిన భార్య..
-
మేమేం పాపం చేశాం..
► నాన్నను చంపేశారు.. ► అమ్మను అరెస్ట్ చేశారు. ► బిక్కుబిక్కుమంటున్న చిన్నారులు రామభద్రపురం: ఏం జరుగుతుందో ఆ చిన్నారులకు తెలియడం లేదు.. ఇంటికి పోలీసులెందుకు వస్తున్నారో.. తల్లిని ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాక బిత్తర చూపులు చూస్తున్నారు. నాన్న కనిపించడు.. అమ్మ పోలీస్‌స్టేషన్ ఉంది.. ఈ పరిస్థితుల్లో చిన్నారుల బేల చూపులు బంధువులు, స్థానికులను కలిచివేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... బాడంగి మండలం కోటిపల్లికి చెందిన కొయ్యాన ధనుంజయను (29)ను అతని భార్య రామలక్ష్మి, ఆమె ప్రియుడు బోగాది గణపతి హత్య చేసిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గణపతి కూడా కొద్ది రోజుల కిందట ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఉన్న ఒక్క నిందితురాలు రామలక్ష్మిని విచారణ నిమిత్తం సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లారు. అమ్మ వెంటే.. ధనుంజయ, రామలక్ష్మి దంపతులకు హరి (7), ఉమ (3) పిల్లలున్నారు. ధనుంజయ హత్యకు గురికావడం.. తల్లిని పోలీసులు తీసుకెళ్లడంతో చిన్నారులు అనాథలుగా మారారు. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటికి వస్తుండడంతో హరి భయపడతాడని భావించిన బంధువులు అతడ్ని తాత గారింటికి పంపించి వేశారు. కుమార్తె ఉమ మాత్రం తల్లితోనే ఉంది. తల్లిని పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్తున్న సమయంలో కూడా ఏమీ తెలియని చిన్నారి ఆమె వెంటే స్టేష్టన్ కు వెళ్లింది. ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి అక్కడే ఆడుకోవడం చూసి స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. కొంపముంచుతున్న అక్రమ సంబంధాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న అక్రమ సంబంధాల వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయని పలువురు తెలిపారు. తల్లి చేతిలో తండ్రి బలయ్యాడు.. తల్లి పోలీసుల అదుపులో ఉంది.. ఇటువంటి సమయంలో పిల్లలను ఎలా ఊరడించాలో తెలియక బంధువులు తల్లడిల్లుతున్నారు