
సాక్షి, విశాఖపట్నం: కట్టుకున్న భర్త ఏం చేసినా మౌనంగానే భరించింది. అయితే తన కళ్లముందే ప్రియురాలితో తిరుగుతున్న భర్త ఆగడాలను ఇంక భరించలేకపోయింది. అంతే, ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను.. గదిలో ఉండగా తాళంపెట్టి, భర్త చేసే నీచమైన పనిని అందరి కళ్లకు చూపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కవారు ఆమెకు అండగా నిలిచారు.
వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం, గాజువాకలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌కు 2014లో దుర్గతో వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు ఆరిలోవలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ పాప పుట్టి చనిపోయింది. అయితే కొద్దికాలంగా భర్త ప్రసాద్ ప్రవర్తనలో మార్పులు గమనించింది దుర్గ. ఇంటికి సరిగా రాకపోవడం, ప్రతి విషయానికి చిరాకు పడటం చేసేవాడు. దీంతో ప్రసాద్‌పై భార్య అనుమానం వచ్చింది.
తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని గ్రహించింది. అంతేకాదు పురుషోత్తపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ప్రియురాలితో ఆరునెలలుగా కాపురం సాగిస్తున్నాడన్న విషయం తెలుసుకుంది. ఈ క్రమంలోనే వారి ఇంటికి వెళ్లిన దుర్గ... ఇద్దరూ ఇంట్లో ఉండగా తలుపులకు తాళం వేసింది. భర్త చేసే నీచమైన పనిని అందరి కళ్లకు చూపించింది. భర్త తనను మోసం చేశాడని, న్యాయం కావాలని ఇంటిముందు దుర్గ ఆందోళన చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment