
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో నయా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల రూపాయలను ఏకంగా ఓ పోలీసే కాజేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖ నావెల్ డాక్ యార్డ్‌లో ఉద్యోగాలు పేరుతో కంచరపాలెం పీఎస్ కానిస్టేబుల్ రమణమూర్తి, డాక్‌యార్డు ఉద్యోగి మోహన్‌బాబుతో కలిసి భారీ మోసానికి పాల్పడ్డాడు.ఒక్కొక్క నిరుద్యోగి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. రమణమూర్తి,మోహన్‌బాబులపై బాధితులు ఫిర్యాదు చేశారు.సుమారు 20 మందికి ఉద్యోగాల ఆశచూపి రూ.80 లక్షల దాకా వసూలు చేసినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment