Dockyard
-
విశాఖలో డాక్‌యార్డు ఉద్యోగాల పేరిట భారీ మోసం
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో నయా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల వద్ద నుంచి లక్షల రూపాయలను ఏకంగా ఓ పోలీసే కాజేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.విశాఖ నావెల్ డాక్ యార్డ్‌లో ఉద్యోగాలు పేరుతో కంచరపాలెం పీఎస్ కానిస్టేబుల్ రమణమూర్తి, డాక్‌యార్డు ఉద్యోగి మోహన్‌బాబుతో కలిసి భారీ మోసానికి పాల్పడ్డాడు.ఒక్కొక్క నిరుద్యోగి వద్ద నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. రమణమూర్తి,మోహన్‌బాబులపై బాధితులు ఫిర్యాదు చేశారు.సుమారు 20 మందికి ఉద్యోగాల ఆశచూపి రూ.80 లక్షల దాకా వసూలు చేసినట్లు చెబుతున్నారు. -
సబ్‌మెరైన్ పేలినా.. సెకన్లలో అదుపులోకి..
2013 ఆగస్ట్ 13.. నౌకాదళ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని ఘోర దుర్ఘటన సంభవించింది. ముంబై కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో అర్ధరాత్రి వరస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 18 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న సబ్‌మెరైన్ సముద్రంలో సగం వరకు మునిగిపోయింది. దుర్ఘటన జరిగిన సమయంలో సబ్‌మెరైన్‌లో టార్పెడోలు, క్షిపణులు సహా పూర్తిస్థాయిలో ఆయుధాలు ఉన్నాయి. సబ్‌మెరైన్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న పేలుడు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయి. యుద్ధ నౌకలో గానీ.. సబ్‌మెరైన్‌లో గానీ.. చిన్నపాటి ప్రమాదం సంభవిస్తే.. అది భారీ విపత్తుగా మారుతుంది. అగ్నిమాపక వ్యవస్థ ఉన్నప్పటికీ.. క్షణాల్లో వ్యాపించే ప్రమాదాన్ని మాత్రం నియంత్రించలేకపోతుంది. సింధు రక్షక్‌లో ప్రమాదం తర్వాత.. ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన భారత నౌకాదళం.. రష్యా, అమెరికా వంటి దేశాల వ్యవస్థను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడా పరిస్థితిని అధిగమించి..అగ్రరాజ్యాల సరసన నిలిచేలా అత్యాధునిక మ్యాగజైన్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్(ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్)ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అత్యంత కీలకమైన నౌకా దళాల్లో అగ్రభాగాన ఉన్న దేశాల సరసన ఉన్న భారత్‌లో రోజు రోజుకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికనుగుణంగా వ్యవస్థలోనూ అత్యాధునిక మార్పులు తీసుకొచ్చేందుకు రక్షణ వ్యవస్థ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రక్షణ సేవల రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న క్రౌన్ గ్రూప్(డిఫెన్స్ ఇంజినీరింగ్ డివిజన్) ఇప్పుడు ఎంఎఫ్ఎఫ్ఎస్ను భారత నౌకాదళంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. మ్యాగజైన్ ఇక సురక్షితం ప్రతి యుద్ధ నౌక, సబ్‌మెరైన్‌లో మ్యాగజైన్ అనే కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో పేలుడు పదార్థాలు, యుద్ధ సామగ్రిని సురక్షితంగా నిల్వ చేస్తారు. ఈ కంపార్ట్మెంట్ను అత్యంత సురక్షితంగా డిజైన్ చేస్తారు. ఆయా యుద్ధ సామగ్రికి అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, రేడియేషన్‌లో మార్పులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా.. మొత్తం యుద్ధనౌకతో పాటు పొరపాటున డాక్లో యాంకరేజ్ అయి ఉంటే.. పక్కన ఉన్న నౌకలు కూడా ప్రమాదం బారిన పడతాయి. అందుకే వీటిలో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే అగ్నిమాపక వ్యవస్థలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో క్రౌన్ గ్రూప్ ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటుకు రక్షణ వ్యవస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటైతే.. సింధు రక్షక్ సబ్‌మెరైన్‌లో మాదిరిగా పేలుడు సంభవిస్తే.. సెకన్ల వ్యవధిలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలరు. విశాఖలో షిప్ బిల్డింగ్‌కు సన్నాహాలు డిఫెన్స్ సర్వీస్ సెక్టార్లో ప్రధాన పాత్రధారిగా ఉన్న క్రౌన్ గ్రూప్ విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా షిప్ బిల్డింగ్ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే నగరంలో వర్క్‌షాప్ కార్యకలాపాలు ప్రారంభించిన క్రౌన్ సంస్థ.. తూర్పు నౌకాదళ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, రీఫిట్, ఆపరేషనల్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. విశాఖ తీరంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే హిందూస్థాన్ షిప్‌యార్డు విశాఖలో ఉంది. ఇప్పుడు మరో షిప్‌యార్డు వస్తే.. యుద్ధ నౌకల తయారీలో విశాఖ నగరం కీలకంగా మారనుంది. యుద్ధ నౌకలు.. సబ్‌మెరైన్‌లో... ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్స్(ఓఈఎం) సహకారంతో నౌకాదళంలోని యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటుకు అవసరమైన సామర్థ్యాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత నౌకాదళంలో మొత్తం 150 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లుండగా.. రానున్న ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య 180 వరకు చేరుకోనుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా 30 వరకూ యుద్ధ నౌకలు ఆయా షిప్‌యార్డుల్లో తయారవుతున్నాయి. వీటన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. షిప్లో మ్యాగజైన్ కంపార్ట్మెంట్ రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తాం విశాఖ తీరం ఎంతో అభివృద్ధి చెందడానికి కీలకంగా ఉంది. అందుకే ఇక్కడ షిప్ బిల్డింగ్ సంస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ తీరంలో వ్యూహాత్మక షిప్‌యార్డ్‌లను కొనుగోలు చేయడం లేదా.. భాగస్వామిగా జతకట్టాలని భావిస్తున్నాం. తూర్పు తీర ప్రధాన కేంద్రంగా ఉన్న వైజాగ్‌కు దక్షిణ భాగంలో షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఐఎన్ఎస్ జలాశ్వ, విమాన వాహక నౌక విక్రమాదిత్యకు మరమ్మతులు, సర్వీసింగ్, మెయింటెనెన్స్ వంటి సవాళ్లతో కూడిన పనిని విజయవంతంగా పూర్తి చేసి.. పీఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు సిద్ధం చేశాం. భవిష్యత్‌లో అన్ని యుద్ధనౌకలకు ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ అత్యవసరం కాబట్టి ఈ టెక్నాలజీని దేశంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం. – కమాండర్ రాకేష్ ఆనంద్, క్రౌన్ మెరైన్ డివిజన్ హెడ్ -
విశాఖలో ఐఎన్ఎస్ కవరట్టి జల ప్రవేశం
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. విరోధులకు బలమైన హెచ్చరికను జారీ చేస్తూ.. యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి ఇవాళ విశాఖపట్టణంలోని నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే దీనిని కమిషన్ చేశారు. ప్రాజెక్ట్ 28(కమోర్టా క్లాస్) లో భాగంగా నిర్మించిన నాలుగు యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ కవరట్టి చివరిది. డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ .. ఐఎన్ఎస్ కవరట్టిని డిజైన్ చేసింది. కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీసర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని నిర్మించారు. ఇక ఇది పెరుగుతున్న భారత నౌకదళం, జీఆర్ఎస్ఈ సామర్థ్యాన్ని చూపించడమే కాక దేశీయంగా తయారు చేయడంతో భారత్ స్వావలంబనకు నిదర్శనంగా నిలవడమే కాక.. జాతీయ లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్‌ని ఉద్ఘాటిస్తుంది అన్నారు అధికారులు. ఇక కవరట్టిలో అత్యాధునిక ఆయుధాలు, జలాంతర్గాములను గుర్తించి ప్రాసిక్యూట్ చేయగల సెన్సార్ సూట్ ఉందని భారత నావికాదళం తెలిపింది. ఇక ఐఎన్ఎస్ కవరట్టి 90 శాతం దేశీయంగా తయారయ్యింది.(చదవండి: ‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!) INS Kavaratti, last of the 4 indigenously built Anti-Submarine Warfare stealth corvettes, is all set to join Indian Navy. Designed by Indian Navy's Directorate of Naval Design, the ship portrays our growing capability in becoming self-reliant through indigenization: Indian Navy pic.twitter.com/jHFcuGIkwT — ANI (@ANI) October 22, 2020 "ఓడ బోర్డులో అమర్చిన అన్ని వ్యవస్థల సముద్ర పరీక్షలను పూర్తి చేసినందున ఓడను నావికాదళంలోకి ప్రవేశపెట్టడం గమనార్హం. కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలను పరిగణనలోకి తీసుకొని, ఇది నేవీకి అందజేయడం ప్రశంసనీయమైన విజయం. కవరట్టిని నేవీలోకి ప్రవేశపెట్టడంతో, భారత నావికాదళ సంసిద్ధత మెరుగుపడుతుంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కవరట్టికి ఆర్నాలా-క్లాస్ క్షిపణి కొర్వెట్టి అయిన ఐఎన్ఎస్ కవరట్టి నుంచి ఆ పేరు వచ్చింది. పాత కవరట్టి 1971 లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి మద్దతుగా పనిచేయడం ద్వారా గుర్తింపు పొందింది. -
60 మంది సస్పెన్షన్‌ను రద్దు చేసిన బీఎంసీ
సాక్షి, ముంబై: శిథిలావస్థ, ప్రమాదకర భవనాల్లో నివాసం ఉంటూ ఖాళీ చేసేందుకు నిరాకరించిన 105 మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 60 మంది సస్పెన్షన్‌ను రద్దు చేసింది. వీరిలో గౌతమ్నగర్కు చెందిన 53 మంది ఉన్నారని ఘనవ్యర్థాల విభాగం అధికారి మహాదేవ్ ఘాడ్గే తెలిపారు. డాక్‌యార్డు రోడ్డులో ఇటీవల భవనం కూలిన దుర్ఘటన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఎంసీ శిథిలావస్థలో ఉన్న, అలాగే ప్రమాదకర స్థాయికి చేరుకున్న భవనాల వివరాలను వెల్లడించింది. అయితే ఈ భవనాల్లో నివసించే వారి ఇళ్లను ఖాళీ చేసే చర్యలు చేపట్టింది. కార్పొరేషన్‌కు చెందిన కాలనీల్లో కూడా ప్రమాదకర భవనాలు ఉన్నాయి. వీటిలో నివసించే బీఎంసీ సిబ్బం ది, కార్మికులు ఖాళీ చేసేందుకు నిరాకరించారు. బీఎంసీ ఆదేశాలను పాటించకుండా వ్యతిరేకించడంతో వారిని వెంటనే సస్పెండ్ చేసింది. ఇలా మొత్తం 105 మంది సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. అయితే వీరిలో గౌతమ్నగర్కు చెందిన 53 మంది సిబ్బంది సస్పెన్షన్‌ను రద్దు చేసి వారిని ఆదివారం తిరిగి విధుల్లోకి చేర్చుకుంది. ఘాట్కోపర్కు చెందిన ఏడుగురిని సోమవారం నుంచి విధులకు హాజరుకావాలని సూచించింది. అయితే మిగతా 39 మంది సస్పెన్షన్‌ను రద్దు చేయలేదు. వీరంతా గౌతమ్‌నగర్‌వాసులే. ఖాళీ చేసే ప్రయత్నం కొనసాగుతుంది... గౌతమ్‌నగర్‌లోని బిల్డింగ్ నంబర్ 2 శిథిలావస్థకు చేరుకున్నట్లు గుర్తించిన బీఎంసీ అందులో ఉండేవారిని ఖాళీ చేయించేందుకు ఇంకా ప్రయత్నిస్తోంది. బీఎం సీ ఎఫ్-దక్షిణ విభాగం అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ కురాడే నేతృత్వంలో ఒక బృందం శనివారం సదరు బిల్డింగ్‌కు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో బిల్డింగ్‌లో నివసించే కుటుం బాలు తీవ్ర నిరసన, వ్యతిరేకతలు తెలపడంతో అధికారులు విద్యుత్, నీటి కనెక్షన్లను ఇచ్చారు. ఎమ్మెల్యే కాలిదాస్ కోళంబర్, కార్పొరేటర్ సునీల్ మోరేలు సదరు భవనం స్ట్రక్చలర్ ఆడిట్ చేయడం కోసం నియమించిన జోషి కన్సల్టెంట్ ఆదివారం నుంచి ఆడిట్‌ను ప్రారంభించింది. -
బీఎంసీ అధికారులకు బేడీలు
సాక్షి, ముంబై: డాక్‌యార్డ్ ప్రాంతంలో గత శుక్రవారం భవనం కూలిన ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న ముగ్గురు బీఎంసీ అధికారులను స్థానిక శివ్డీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడైన అశోక్ జైన్ అనే డెకొరేటర్ను ఇదివరకే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో ఏడుగురు బీఎంసీ అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేయగా 11 మంది పాత్రపై దర్యాప్తుకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ఆదేశించారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు అధికారులపై ఆదివారమే సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీఎంసీ ఉన్నతాధికారులు రాజీవ్ జలోటా, మోహన్ అడ్తానితో ద్వీసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణలో దోషులుగా తేలడంతో డి.సి.చవాన్-డిప్యూటీ సూపరింటెండెంట్ (మార్కెటింగ్ శాఖ). రాహుల్ జాదవ్-అసిస్టెంట్ ఇంజినీర్ (మార్కెటింగ్ శాఖ), ఇన్స్పెక్టర్ (మార్కెటింగ్ శాఖ) జమాల్ కాజీని శివ్డీ పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారిపై విచారణ జరుగుతోంది. ఇందులో ఎంతమంది దోషులుగా తేలుతారో, ఎంతమందిని అరెస్టు చేయాల్సి వస్తుందో త్వరలో వెల్లడవుతుందని కుంటే అన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 61 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉండగా 28 మంది మహిళలున్నారు. మొత్తం 38 మంది గాయపడగా ఇందులో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 99 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మొత్తం 48 గంటల తరువాత భవన శిథిలాలను తొలగించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ 21 కుటుంబాలకు పునరావాసం కల్పించడం పెనుసవాలుగా మారింది. మాడా శరణార్థి శిబిరాలన్నీ కిక్కిరిసి ఉండడంతో వీరికి ఎక్కడ బస కల్పించాలో తెలియని పరిస్థితి నెలకొంది. డాక్టర్ల సస్పెన్షన్ డాక్‌యార్డ్‌లో భవనం కూలడంతో గాయపడ్డవారికి వైద్యపరీక్షలు నిర్వహించడానికి డబ్బులు వసూలుచేసిన ముగ్గురు నాయర్ ఆస్పత్రి వైద్యులపై సెస్పెండ్ వేటు పడింది. మరో 11 మంది వైద్యులపాత్రపైనా విచారణ జరుగుతోంది. ఇందులో దోషులుగా తేలితే వీరిని కూడా సస్పెండ్ చేయనున్నారు. డాక్‌యార్డ్ దుర్ఘటనలో 61 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులందరికీ ఉచితంగా వైద్యం అందజేయాలని మేయర్ సునీల్ ప్రభు ఆదేశించారు. అయినప్పటికీ నాయర్ ఆస్పత్రిలోని బాధితుల నుంచి రక్తపరీక్షలు నిర్వహించేందుకు డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని శ్వేతాకాంబ్లే అనే బాధితురాలు బయటపెట్టడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ముగ్గురు డాక్టర్లు దోషులుగా తేలడంతో సస్పెండ్ చేశారు.