సాక్షి, ముంబై: శిథిలావస్థ, ప్రమాదకర భవనాల్లో నివాసం ఉంటూ ఖాళీ చేసేందుకు నిరాకరించిన 105 మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 60 మంది సస్పెన్షన్‌ను రద్దు చేసింది. వీరిలో గౌతమ్‌నగర్‌కు చెందిన 53 మంది ఉన్నారని ఘనవ్యర్థాల విభాగం అధికారి మహాదేవ్ ఘాడ్గే తెలిపారు. డాక్‌యార్డు రోడ్డులో ఇటీవల భవనం కూలిన దుర్ఘటన విషయం తెలిసిందే.
ఆ తర్వాత బీఎంసీ శిథిలావస్థలో ఉన్న, అలాగే ప్రమాదకర స్థాయికి చేరుకున్న భవనాల వివరాలను వెల్లడించింది. అయితే ఈ భవనాల్లో నివసించే వారి ఇళ్లను ఖాళీ చేసే చర్యలు చేపట్టింది. కార్పొరేషన్‌కు చెందిన కాలనీల్లో కూడా ప్రమాదకర భవనాలు ఉన్నాయి. వీటిలో నివసించే బీఎంసీ సిబ్బం ది, కార్మికులు ఖాళీ చేసేందుకు నిరాకరించారు. బీఎంసీ ఆదేశాలను పాటించకుండా వ్యతిరేకించడంతో వారిని వెంటనే సస్పెండ్ చేసింది. ఇలా మొత్తం 105 మంది సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. అయితే వీరిలో గౌతమ్‌నగర్‌కు చెందిన 53 మంది సిబ్బంది సస్పెన్షన్‌ను రద్దు చేసి వారిని ఆదివారం తిరిగి విధుల్లోకి చేర్చుకుంది. ఘాట్కోపర్‌కు చెందిన ఏడుగురిని సోమవారం నుంచి విధులకు హాజరుకావాలని సూచించింది. అయితే మిగతా 39 మంది సస్పెన్షన్‌ను రద్దు చేయలేదు. వీరంతా గౌతమ్‌నగర్‌వాసులే.
ఖాళీ చేసే ప్రయత్నం కొనసాగుతుంది...
గౌతమ్‌నగర్‌లోని బిల్డింగ్ నంబర్ 2 శిథిలావస్థకు చేరుకున్నట్లు గుర్తించిన బీఎంసీ అందులో ఉండేవారిని ఖాళీ చేయించేందుకు ఇంకా ప్రయత్నిస్తోంది. బీఎం సీ ఎఫ్-దక్షిణ విభాగం అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ కురాడే నేతృత్వంలో ఒక బృందం శనివారం సదరు బిల్డింగ్‌కు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో బిల్డింగ్‌లో నివసించే కుటుం బాలు తీవ్ర నిరసన, వ్యతిరేకతలు తెలపడంతో అధికారులు విద్యుత్, నీటి కనెక్షన్లను ఇచ్చారు. ఎమ్మెల్యే కాలిదాస్ కోళంబర్, కార్పొరేటర్ సునీల్ మోరేలు సదరు భవనం స్ట్రక్చలర్ ఆడిట్ చేయడం కోసం నియమించిన జోషి కన్సల్టెంట్ ఆదివారం నుంచి ఆడిట్‌ను ప్రారంభించింది.
60 మంది సస్పెన్షన్‌ను రద్దు చేసిన బీఎంసీ
Published Mon, Oct 7 2013 2:15 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement