న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. విరోధులకు బలమైన హెచ్చరికను జారీ చేస్తూ.. యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి ఇవాళ విశాఖపట్టణంలోని నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే దీనిని కమిషన్ చేశారు. ప్రాజెక్ట్ 28(కమోర్టా క్లాస్) లో భాగంగా నిర్మించిన నాలుగు యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌకల్లో ఐఎన్‌ఎస్ కవరట్టి చివరిది. డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ .. ఐఎన్ఎస్ కవరట్టిని డిజైన్ చేసింది. కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీసర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని నిర్మించారు. ఇక ఇది పెరుగుతున్న భారత నౌకదళం, జీఆర్‌ఎస్‌ఈ సామర్థ్యాన్ని చూపించడమే కాక దేశీయంగా తయారు చేయడంతో భారత్ స్వావలంబనకు నిదర్శనంగా నిలవడమే కాక.. జాతీయ లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్‌ని ఉద్ఘాటిస్తుంది అన్నారు అధికారులు. ఇక కవరట్టిలో అత్యాధునిక ఆయుధాలు, జలాంతర్గాములను గుర్తించి ప్రాసిక్యూట్ చేయగల సెన్సార్ సూట్ ఉందని భారత నావికాదళం తెలిపింది. ఇక ఐఎన్‌ఎస్ కవరట్టి 90 శాతం దేశీయంగా తయారయ్యింది.(చదవండి: ‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!)
INS Kavaratti, last of the 4 indigenously built Anti-Submarine Warfare stealth corvettes, is all set to join Indian Navy.
— ANI (@ANI) October 22, 2020
Designed by Indian Navy's Directorate of Naval Design, the ship portrays our growing capability in becoming self-reliant through indigenization: Indian Navy pic.twitter.com/jHFcuGIkwT
"ఓడ బోర్డులో అమర్చిన అన్ని వ్యవస్థల సముద్ర పరీక్షలను పూర్తి చేసినందున ఓడను నావికాదళంలోకి ప్రవేశపెట్టడం గమనార్హం. కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలను పరిగణనలోకి తీసుకొని, ఇది నేవీకి అందజేయడం ప్రశంసనీయమైన విజయం. కవరట్టిని నేవీలోకి ప్రవేశపెట్టడంతో, భారత నావికాదళ సంసిద్ధత మెరుగుపడుతుంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కవరట్టికి ఆర్నాలా-క్లాస్ క్షిపణి కొర్వెట్టి అయిన ఐఎన్ఎస్ కవరట్టి నుంచి ఆ పేరు వచ్చింది. పాత కవరట్టి 1971 లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి మద్దతుగా పనిచేయడం ద్వారా గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment