Manoj Mukund Naravane
-
ఆర్మీ కొత్త చీఫ్ మనోజ్ పాండే
న్యూఢిల్లీ: దేశ 29వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే శనివారం రిటైర్ కావడంతో ఆయన స్థానంలో జనరల్ పాండే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. చైనా, పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పగ్గాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఆర్మీ చీఫ్‌గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్ కమాండ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. దేశ మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ థియేటర్ కమాండ్స్ బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం మరొకరిని నియమించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పాండే.. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌లో చేరారు. సుదీర్ఘ కెరీర్లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్ ఉన్న అండమాన్ నికోబార్ కమాండ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు. -
భావి యుద్ధాలకు ట్రైలర్లు చూస్తున్నాం
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్తులో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి రానుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అభిప్రాయపడ్డారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్ వార్ఫేర్ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయన్నారు. అణుపాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్లు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అన్నారు. గురువారం ఇక్కడ సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (సీఎల్‌ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేసిన సెమినార్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌లతో పాటు నరవణె పాల్గొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలి యుద్ధ రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యం ఎంతగానో పెరిగిందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే ప్రధాన పాత్ర కావడం, యూఏఈపై యెమన్ హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు, వాటిని అమెరికా సాంకేతిక సహకారంతో యూఏఈ అడ్డుకున్న తీరు ఇందుకు తాజా నిదర్శనాలన్నారు. పాక్, చైనా నుంచి జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను లోతుగా ఆయన విశ్లేషించారు. ‘‘విచ్ఛిన్న శక్తులు స్థానిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని తక్కువ ఖర్చుతో భారీ దాడులకు తెగబడతాయి. అధునాతన సామర్థ్యం అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయిలో ప్రయోగించలేని పరిస్థితులను కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. అఫ్గానిస్తాన్‌లో నిత్యం జరుగుతున్న మారణహోమమే నిదర్శనం’’ అన్నారు. పాక్‌ను నిర్దేశించగలుగుతున్నాం నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గడం, పాక్‌తో కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవుతుండటానికి ప్రధాన కారణం మన సైనిక పాటవమేనని జనరల్ నరవణె అన్నారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడుతూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను కట్టిపెట్టేందుకు ఇరు సైన్యాల మధ్య గతంలో అంగీకారం కుదరడం తెలిసిందే. -
చెనాతో ముప్పు పొంచే వుంది: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో చైనా నుంచి ముప్పు పొంచేఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. రానున్న ఆర్మీ డేను పురస్కరించుకొని బుధవారం నరవణే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరిహద్దు భూభాగాలకు సంబంధించి చైనా కొత్తగా తీసుకొచ్చిన చట్టం మూలంగా తలెత్తే పర్యవసానాలను ఎదుర్కొనడానికి సంసిద్ధులై ఉన్నామన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయడానికే కట్టుబడి ఉన్నామని నరవణే చెప్పారు. నియంత్రణ రేఖకు అవతలి వైపున (పాక్ ఆక్రమిత కశ్మీర్లో) 350 నుంచి 400 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి క్యాంప్ వేశారని, పదేపదే చొరబాటుయత్నాలు చోటుచేసుకోవడం శత్రుదేశం నీచమైన ఉద్దేశాలను ఎత్తిచూపుతున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ 4న నాగాలాండ్‌లో పొరపాటున పౌరులపైకి సైనికులు కాల్పులు జరిగిన ఘటనపై ఆర్మీ విచారణ నివేదిక ఒకటి, రెండు రోజుల్లో అందవచ్చని తెలిపారు. హాట్‌స్ప్రింగ్స్ నుంచి వెనక్కి మళ్లండి తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి (పెట్రోలింగ్ పాయింట్ 15) సాధ్యమైనంత త్వరగా చైనా బలగాలు వెనక్కి మళ్లాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు అవతలి వైపున చైనా భూభాగంలో బుధవారం భారత్– చైనాల మధ్య 14వ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. -
కొత్త సీడీఎస్ ‘ఎంపిక’ షురూ
న్యూఢిల్లీ: దివంగత జనరల్ బిపిన్ రావత్ స్థానంలో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) నియామక ప్రక్రియ మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన జనరల్ బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సీనియర్ కమాండర్లతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్యానెల్ ప్రతిపాదించిన పేర్లతో కూడిన జాబితా త్వరలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తదుపరి ఈ జాబితా కేబినెట్ నియామకాల కమిటీకి పరిశీలనకు అందుతుంది. ఆ కమిటీ అంతిమంగా సీడీఎస్ పేరును ఖరారు చేస్తుంది. అత్యున్నత స్థాయి ఈ పోస్టుకు అత్యంత సీనియర్ అయిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జనరల్ నరవణె వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇద్దరూ కూడా ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఒక వేళ సీడీఎస్‌గా జనరల్ నరవణెను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే, తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాల్సింది కూడా ఇప్పుడే నిర్ణయించాల్సి ఉంటుంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతి, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన సీనియర్ మోస్ట్ కమాండర్లు. ఇద్దరూ కూడా జనవరి 31వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది. దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా గత ఏడాది జనవరి ఒకటో తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
తదుపరి సీడీఎస్ రేసులో నరవాణె..?!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ భద్రతా రంగంలో అత్యున్నత పోస్టు చీఫ్ ఆఫ్ డిఫెన్స్. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దానిలో భాగంగా దేశ భద్రతకు కీలకమైన ఆర్మీ, వాయు, నావిక దళాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టును రూపొందించింది. వయసు, అనుభవం పరంగా సీనియర్ అయిన బిపిన్ రావత్‌ను తొలి సీడీఎస్‌గా 2019లో నియమించింది మోదీ ప్రభుత్వం. అయితే దురదృష్టం కొద్ది ఆయన పదవి చేపట్టిన రెండున్నరళ్లేకే అకాల మరణం పొందారు. తమిళనాడు, కూనూరు సమీపంలో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. సైనిక బలగాలకు కొత్త రూపు తెచ్చిన రావత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదంతో పాటు.. మోదీ సర్కార్‌కు పలు సవాళ్లను కూడా తీసుకొచ్చింది. తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాలన్నది.. ప్రభుత్వం, ముఖ్యంగా రక్షణ శాఖ ముందున్న తక్షణ సవాలు. (చదవండి: చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్) అనుభవం ఆధారంగానే రావత్‌కు అవకాశం... ప్రస్తుతం రక్షణ శాఖలో సీడీఎస్ పదవికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక మొదటి సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన బిపిన్ రావత్ సాయుధ దళాల కోసం ఎన్నో సంస్కర్ణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రావత్ ఇండియన్ ఆర్మీ చీఫ్ పదవి కాలం ముగియడానికి అనగా పదవీ విరమణకు ఒక్క రోజు ముందుగా ఆయనను సీడీఎస్‌గా నియమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం ఆధారంగానే 2019లో రావత్‌ని సీడీఎస్‌గా నియమించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన రెండున్నరేళ్ల కాలంలోనే ఆయన మృత్యువాత పడ్డారు వారాల వ్యవధిలో ప్రభుత్వం తదుపరి సీడీఎస్ ఎవరనేది ప్రకటించనున్నట్లు సమాచారం. సీడీఎస్ ఎంపికకు ఎలాంటి నిర్దేశిత నియమాలు లేవు. సరిహద్దు భద్రతా సవాళ్లను దృష్టిలో పెట్టుకుని.. కేంద్ర ప్రభుత్వం సీడీఎస్ నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది. (చదవండి: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు.. వీడియో వైరల్) సీడీఎస్ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. సీడీఎస్ నియామక ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. భారత ఆర్మీ, వాయుసేన, నావిక దళాలకు చెందిన ఏ కమాండింగ్ అధికారిని అయినా సీడీఎస్‌గా నియమించవచ్చు. ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే సీడీఎస్‌గా నియమితుడయ్యే వ్యక్తి వయసు 65 ఏళ్లకు మించకూడదు. రావత్ తర్వాత సీనియర్ నరవాణెనే... ప్రస్తుత విషయానికి వస్తే.. సైనిక దళాలకు పని చేస్తున్న చీఫ్‌లలో.. బిపిన్ రావత్ తర్వాత సీనియర్.. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె. తదుపరి సీడీఎస్‌గా నరవాణెని నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత ఆర్మీ చీఫ్‌గా నరవాణె పదవీ కాలం 2022, ఏప్రిల్ వరకు ఉంది. అంతేకాక ఆర్మీ చీఫ్‌గా జనరల్ రావత్ నుంచే నరవాణె.. 2019, డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. అయితే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న ప్రస్తుత ఉన్నతాధికారులతో పోలిస్తే.. నరవాణెనే సీనియర్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ వి.ఆర్.చౌదరీ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఆ ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను స్వీకరించారు. ఆర్ హరి కుమార్ నేవీ చీఫ్ అడ్మైర్గా గత నెల 30న నియమితులయ్యారు. దీనితో నరవాణెనే తదుపరి సీడీఎస్‌గా ప్రభుత్వం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: Bipin Rawat: భయమంటే తెలియని.. అలుపెరగని సైనికుడు -
చైనాతో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయ్
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య ఒక ఒప్పందం కుదిరే వరకు సరహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా గతంలో మాదిరిగా బుద్ధి చెప్పడానికి మన సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. గురువారం పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సులో పాల్గొన్న నరవణె మాట్లాడారు. అఫ్గానిస్తాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఏర్పడే ముప్పుపై దృష్టి సారించామని చెప్పారు. దానికనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నట్టుగా తెలిపారు. -
ఆధునిక ఆలోచన వైపు మారాలి: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: డ్రోన్లు సులభంగా లభ్యమవుతుండడం తో భద్రతపరమైన సవాళ్లు మరింత పెరుగుతున్నాయని ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె పేర్కొన్నారు. దాడులను డ్రోన్లు సులభతరం చేశాయన్నారు.ఆధునిక యుద్ధ రీతులను, డ్రోన్ దాడుల వంటి కొత్తరకం సవాళ్లను ఎదుర్కొనేందుకు కాలం చెల్లిన ఆలోచన విధానం సరికాదన్నారు. రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునే విషయంలో ఆర్మీ డిజిటల్ కాలానికి మారకపోవడం సమస్యగా మారిందన్నారు. మార్పుకు అనుగుణంగా ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యమన్నారు. జమ్మూ విమానాశ్రయంలోని వైమానిక దళ కేంద్రంపై ఇటీవల డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే చేసి ఉంటారని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
ఆ వ్యూహం మా దగ్గర పని చేయదు: నరవాణే
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద భారత్–చైనా సైనిక బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణే బలగాల ఉపసంహరణ ఇరు దేశాల సమిష్టి విజయం అన్నారు. అంతేకాక దళాల తొలగింపు, విస్తరణ వంటి తదుపరి చర్యలకు చాలా సమయం పడుతుందన్నారు. లద్దాఖ్ ఉద్రిక్తతల సమయంలో చైనా, పాకిస్తాన్ల మధ్య బహిరంగ కలయిక సంకేతాలు లేవని స్పష్టం చేశారు నరవాణే. కానీ ఇండియా మాత్రం ఈ రెండు ప్రధాన శత్రువులతో పాటు అంతర్గత భద్రత అనే మరో సగం సమస్యను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉందని.. ఈ మేరకు ఈ రెండున్నర శత్రువులతో తలపడేందుకు దీర్ఘకాలిక వ్యూహ రచన చేస్తోందని వెల్లడించారు. దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత మరికొన్ని అంశాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు నరవాణే. "మనం ఏమి చేస్తున్నామో, దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మేం ఎల్లవేళలా గుర్తుంచుకుంటాము. మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. ఇరు దేశాల మధ్య విశ్వాస లోపం ఉంది. దాన్ని తొలగించే వరకు మే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎల్ఏసీ వద్ద ఇరువైపులా జరిగే ప్రతి కదలికను జాగ్రత్తగా గనిస్తాం’’ అని తెలిపారు నరవాణే. సరిహద్దు వివాదాల సమస్యలకు హింస ఎన్నటికి పరిష్కారం కాదన్నారు నరవాణే. చైనాకు ప్రారంభం నుంచి ముందుకు పాకే అలవాటు ఉందని.. దాని వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి అన్నారు నరవాణే. అయితే ప్రతి మార్పుకు సంబంధించి ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఇక దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ అనుసరించిన వ్యూహం భారత్‌తో పని చేయదని స్పష్టం చేశారు. ఇక ఉద్రికత్తలు ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం, ఆర్మీ అందరు కలిసి సమిష్టిగా పని చేశారని.. వాటి ఫలితమే ఈ రోజు మనం చూస్తున్న బలగాల ఉపసంహరణ అన్నారు నరవాణే. చదవండి: భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..! తూర్పు లద్దాఖ్ నుంచి వెనక్కి మళ్లుదాం -
మా ఓపికను పరీక్షించొద్దు!
న్యూఢిల్లీ: భారత్ ఓపికను పరీక్షించే సాహసం చేయవద్దని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. ఉత్తర సరిహద్దులో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని వ్యాఖ్యానించారు. లద్దాఖ్ లో చైనాతో ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితుల్లో జనరల్ నరవణె వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్లో శుక్రవారం జరిగిన ఆర్మీ డే పరేడ్ కార్యక్రమంలో జనరల్ నరవణె పాల్గొన్నారు. గత సంవత్సరం జూన్‌లో లద్దాఖ్‌లో ‘గల్వాన్ హీరోలు’ చేసిన ప్రాణత్యాగం వృధా పోదని, దేశ సమగ్రత, సార్వభౌమత్వం, రక్షణకు ప్రమాదం వాటిల్లనివ్వబోమని స్పష్టం చేశారు. ‘తీవ్రమైన చలి పరిస్థితుల్లోనూ తూర్పు లద్దాఖ్‌ల్లో విధుల్లో ఉన్న భారత సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతినలేదు. అక్కడి పర్వతాల కన్నా ఎత్తుగా వారి ధైర్య, సాహసాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘చర్చలు, రాజకీయ ప్రయత్నాల ద్వారా సమస్యలు పరిష్కారమవ్వాలనే మేం కోరుకుంటాం. అయితే, మా ఓపికను పరీక్షించే తప్పు ఎవరూ చేయవద్దు’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉందని పాకిస్తాన్‌పై ఆయన మండిపడ్డారు. -
పాక్, చైనాకు ఆర్మీ చీఫ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాతో దేశానికి ముప్పు పొంచి ఉందని, అయితే సరైన సమయంలో స్పందించడం ద్వారా వారి పన్నాగాలను తిప్పికొట్టవచ్చని భారత సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. భారత్‌ను ఇరుకున పెట్టేవిధంగా ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిర్లక్ష్యం చేయలేమని పేర్కొన్నారు. ఆర్మీ డే(జనవరి 15) సమీపిస్తున్న నేపథ్యంలో జనరల్ నరవాణే మంగళవారం పత్రికా సమావేశం(వార్షిక) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. మనం మాత్రం టెర్రరిస్టుల పట్ల ఉక్కుపాదం మోపుతున్నాం. సరైన సమయంలో సరైన చోట సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టమైన సందేశం ఇస్తున్నాం’’ అని ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: 20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్ దురాగతం) అదే విధంగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19ను ఎదుర్కోవడం అతిపెద్ద సవాలు అన్న ఆర్మీ చీఫ్ నరవాణే.. ‘‘ఉత్తర సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి విధించి బలగాలను అప్రమత్తం చేశాం. శాంతియుతమైన పరిష్కారం కనుగొనడానికి మేం సహకరిస్తాం. అయితే అదే పరిస్థితుల్లో దీటుగా బదులిచ్చేందుకు కూడా సన్నద్ధమై ఉన్నాం. సమీప భవిష్యత్తులో రక్షణ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతిక సహకారం అందిపుచ్చుకునే దిశగా ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకున్నాం’’ అని తెలిపారు. ఇక చైనాతో తూర్పు లదాఖ్‌లో ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ.. భారత్- చైనా వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన బలగాల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదని స్సష్టం చేశారు. ఇరు దేశాలు పరస్పర చర్చలు, సహకారంతో ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాయనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం తూర్పు లదాఖ్‌లో సుమారు 50 వేల భారత బలగాలు ఉన్నట్లు సమాచారం. -
భారత్‌తో మాకు ప్రత్యేక అనుబంధం: నేపాల్
ఖాట్మండు: భారత్‌తో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలోనే సమసిపోతాయని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి అన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనగలమని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనంటూ కొన్ని నెలల క్రితం నేపాల్ మ్యాపులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. అయితే గత కొన్నిరోజులుగా ఈ చిటపటలు కాస్త సద్దు మణిగాయి. (చదవండి: ‘నేపాల్ భూభాగం ఆక్రమణ’; చైనా స్పందన) గత ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్ భావించగా, అందుకు భారత్ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో భారత సైనిక దళాల ప్రధానాధికారి ఎంఎం నరవాణే నేపాల్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి, జనరల్ నరవాణేకు నేపాల్ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. ఖడ్గాన్ని కూడా బహూకరించారు. ఖాట్మండూలోని అధ్యక్ష భవనం శీతల్ నివాస్‌లో ప్రధాని ఓలి, భారత రాయబారి వినయ్ ఎం. క్వాత్రా సహా ఇరు దేశాల ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. (చదవండి: నేపాల్‌తో మళ్లీ చెట్టపట్టాలు) ఇక నేపాల్ పర్యటనలో భాగంగా జనరల్ నరవాణే శుక్రవారం ప్రధాని, రక్షణ మంత్రి కేపీ శర్మ ఓలితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధానమంత్రి అధికారిక భవనంలో జరిగిన ఈ సమావేశంలో సుదీర్ఘకాలంగా భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక బంధం గురించి ఓలీ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు నేపాల్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాగా కాగా నవంబరు 4న సతీమణి వీణా నరవాణేతో కలిసి జనరల్ నరవాణే నేపాల్ చేరుకున్నారు. పుణ్యక్షేత్రాల సందర్భంతో పర్యటన ఆరంభించిన ఆయన తొలుత, రాజధానిలో గల కుమారి ఘర్కు వెళ్లి దేవీ కుమారి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. ఆ తర్వాత బసంతాపూర్ దర్బార్ స్వ్కేర్ను సందర్శించారు. పర్యటన సందర్భంగా.. ఎక్స్‌రే మెషీన్లు, రేడియోగ్రఫీ సిస్టంలు, ఐసీయూ వెంటిలేటర్లు, వీడియో ఎండోస్కోపీ యూనిట్లు తదితర వైద్య పరికరాలను నేపాల్ ఆర్మీ ఫీల్డ్ ఆస్పత్రులకు బహుమతిగా అందించారు. -
విశాఖలో ఐఎన్ఎస్ కవరట్టి జల ప్రవేశం
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. విరోధులకు బలమైన హెచ్చరికను జారీ చేస్తూ.. యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి ఇవాళ విశాఖపట్టణంలోని నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే దీనిని కమిషన్ చేశారు. ప్రాజెక్ట్ 28(కమోర్టా క్లాస్) లో భాగంగా నిర్మించిన నాలుగు యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ కవరట్టి చివరిది. డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ .. ఐఎన్ఎస్ కవరట్టిని డిజైన్ చేసింది. కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీసర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని నిర్మించారు. ఇక ఇది పెరుగుతున్న భారత నౌకదళం, జీఆర్ఎస్ఈ సామర్థ్యాన్ని చూపించడమే కాక దేశీయంగా తయారు చేయడంతో భారత్ స్వావలంబనకు నిదర్శనంగా నిలవడమే కాక.. జాతీయ లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్‌ని ఉద్ఘాటిస్తుంది అన్నారు అధికారులు. ఇక కవరట్టిలో అత్యాధునిక ఆయుధాలు, జలాంతర్గాములను గుర్తించి ప్రాసిక్యూట్ చేయగల సెన్సార్ సూట్ ఉందని భారత నావికాదళం తెలిపింది. ఇక ఐఎన్ఎస్ కవరట్టి 90 శాతం దేశీయంగా తయారయ్యింది.(చదవండి: ‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!) INS Kavaratti, last of the 4 indigenously built Anti-Submarine Warfare stealth corvettes, is all set to join Indian Navy. Designed by Indian Navy's Directorate of Naval Design, the ship portrays our growing capability in becoming self-reliant through indigenization: Indian Navy pic.twitter.com/jHFcuGIkwT — ANI (@ANI) October 22, 2020 "ఓడ బోర్డులో అమర్చిన అన్ని వ్యవస్థల సముద్ర పరీక్షలను పూర్తి చేసినందున ఓడను నావికాదళంలోకి ప్రవేశపెట్టడం గమనార్హం. కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలను పరిగణనలోకి తీసుకొని, ఇది నేవీకి అందజేయడం ప్రశంసనీయమైన విజయం. కవరట్టిని నేవీలోకి ప్రవేశపెట్టడంతో, భారత నావికాదళ సంసిద్ధత మెరుగుపడుతుంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కవరట్టికి ఆర్నాలా-క్లాస్ క్షిపణి కొర్వెట్టి అయిన ఐఎన్ఎస్ కవరట్టి నుంచి ఆ పేరు వచ్చింది. పాత కవరట్టి 1971 లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి మద్దతుగా పనిచేయడం ద్వారా గుర్తింపు పొందింది. -
‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!
న్యూఢిల్లీ: త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’ను ఏర్పాటు చేయడం సైనిక సంస్కరణల్లో తదుపరి కీలక నిర్ణయం అవుతుందని బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే వెల్లడించారు. సైనిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)’ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. థియేటర్ కమాండ్స్ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఐక్యంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనరల్ నరవణె ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని ‘కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్’లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భవిష్యత్తులో సాయుధ దళాల విలీనం తప్పని సరిగా చోటు చేసుకునే విషయమని, త్రివిధ దళాల మధ్య సమన్వయానికి, వనరుల అత్యుత్తమ వినియోగానికి అది తప్పదని జనరల్ నరవణె వ్యాఖ్యానించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఒక కమాండర్ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా, ఐకమత్యంగా ఉమ్మడి మిలటరీ లక్ష్యం కోసం సమర్ధవంతంగా, సమన్వయంతో పనిచేసేందుకు ఏర్పాటు చేసేవే ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్’. -
దేనికైనా సిద్ధంగా ఉన్నాం: నరవణే
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యూహాత్మక మోహరింపులు చేశామని, మన సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పూర్తి సంసిద్ధులై ఉన్నామని తెలిపారు. దేశం తమపై పూర్తి విశ్వాసం ఉంచవచ్చన్నారు. లద్దాఖ్‌లో నరవణే శుక్రవారం రెండోరోజు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పలు ఆర్మీ పోస్టులను సందర్శించి... సైనికులు, సీనియర్ కమాండర్లతో మాట్లాడారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘మన సైనికులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడటానికి వారు పూర్తి సంసిద్ధంగా ఉన్నారనే విశ్వాసం నాకు కలిగింది’అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలతో సహా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు. ఐదురోజుల కిందట తూర్పు లద్ధాఖ్లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో చైనా దుస్సాహసంతో అతిక్రమణకు దిగగా... భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన భారత్ అదనపు బలగాలను, ఆయుధ సామగ్రిని ఈ ప్రాంతానికి తరలించి పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలోని కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించింది. ఫింగర్ 2, ఫింగర్ 3 ప్రాంతాల్లో ఆర్మీపోస్టులను బలోపేతం చేసింది. కమాండర్ల చర్చల్లో దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... తమ భూభాగంలోనే మోహరించామని, వెనక్కితగ్గే ప్రసక్తేలేదని భారత్ తేల్చిచెప్పింది. దశాబ్దాల్లో అతిపెద్ద సవాల్: ష్రింగ్లా లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు గడిచిన కొన్ని దశాబ్దాల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌గా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అభివర్ణించారు. దేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి పూర్తి కంకణబద్ధులమై ఉన్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమని, అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో దఫా మిలిటరీ చర్చలు భారత్– చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో శుక్రవారం బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు. -
లద్దాఖ్ చేరుకున్న ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ భాగం, ఇతర ప్రాంతాల్లో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లద్దాఖ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, తలెత్తిన వివాదాల గురించి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో టాప్ కమాండర్లు తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న భూ వివాదాల గురించి ఆర్మీ చీఫ్‌కు వివరించనున్నట్లు సమాచారం. అంతేకాక భారత్ భూభాగంతో పాటు ఇక్కడి పర్వత ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నించిన చైనా సైనికులను ఇండియన్ ఆర్మీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఆర్మీ చీఫ్ ఈ ఆపరేషన్లలో పాల్గొన్న అధికారులతో పాటు ఇతర సైనికులను కలవనున్నారని సమాచారం. చైనాతో ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో భారత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా బలగాలకు గట్టి షాక్ ఇస్తూ ఇప్పటికే ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను భారత బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. (చదవండి: వ్యూహాత్మక మోహరింపు) ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంపై ప్రస్తుతం భారత సైన్యం ఆధిపత్యం చెలాయిస్తోంది. గత కొద్ది రోజులుగా, తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సో సరస్సు దక్షిణ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడానికి చైనా సైన్యం పలు ప్రయత్నాలు చేసింది. కానీ అప్రమత్తమైన భారత దళాలు ఈ ప్రయత్నాలన్నింటిని విఫలం చేశాయి. అంతకుముందు, ప్యాంగ్యాంగ్ సో సరస్సు ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో రెండు రోజుల పాటు(సోమ, మంగళవారాల్లో)చుషుల్‌లో బ్రిగేడ్ కమాండర్-స్థాయి చర్చలు జరిపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజు ఆరుగంటలకు పైగానే సాగిన ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం వెలువడలేదు. గత కొద్ది రోజులుగా భారత సైన్యం మనకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన కొండ శిఖరాలు, ప్రదేశాలను ఆక్రమించి చైనాపై పట్టు బిగించింది. -
రాజ్‌నాథ్ @ అమర్నాథ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండో రోజు శనివారం ప్రఖ్యాత అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పవిత్ర గుహలో మంచు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బివిన్ రావత్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎం.ఎం.నరవణే తదితరులు ఉన్నారు. వారంతా దాదాపు గంట పాటు అమర్నాథ్ ఆలయ ప్రాంగణంలో గడిపారు. అమర్‌నాథుడిని ప్రార్థించడం గొప్ప అనుభూతి కలిగించిందంటూ రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు. నార్త్ హిల్ పోస్టును సందర్శించిన రాజ్‌నాథ్ జమ్మూకశ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉన్న కీలకమైన నార్త్ హిల్ సైనిక పోస్టును రాజ్‌నాథ్‌సింగ్ శనివారం సందర్శించారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని సైనికాధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు. నార్త్ హిల్ పోస్టులో విధుల్లో ఉన్న జవాన్లతో మాట్లాడానని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వారు అసమాన ధైర్య సాహసాలతో మన దేశాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారని ప్రశంసించారు. -
‘సరిహద్దుల్లో అంతా అదుపులోనే ఉంది’
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న మన సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే తెలిపారు. చైనాతో కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు జరిగాయని, ఆ తర్వాత స్థానిక స్థాయి కమాండర్లతోనూ మీటింగ్‌లు జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ డెహ్రాడూన్‌లో జరిగిన ఆర్మీ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న ఎమ్ఎమ్ నారావనే మీడియాతో మాట్లాడారు. నిరాటంకంగా చర్చలు నిర్వహించడం వల్ల చైనాతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉందన్నారు. అలానే ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ ప్రాంతంపై నేపాల్‌తో ఇటీవల జరిగిన సరిహద్దు వివాదాల గురించి ఆయన మాట్లాడుతూ... ‘మనకు నేపాల్‌తో చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి. భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక, మత సంబంధాలు ఉన్నాయి. నేపాల్-భారత్ ప్రజల మధ్య మంచి బంధం ఉంది. ఆ దేశ ప్రజలతో మా సంబంధం ఇప్పుడు, ఎల్లప్పుడూ బలంగానే ఉంటుంది’ అన్నారు.(కాలాపానీ కహానీ) నివేదికల ప్రకారం, గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేశాయి. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరటాలు జరుగుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించడానికి ఇరు దేశాలు సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. గల్వాన్ వ్యాలీలోని డార్బుక్-షాయోక్-దౌలత్ బేగ్ ఓల్డీ రహదారిని అనుసంధానించే మరో రహదారిని నిర్మించడంతో పాటు.. పాంగోంగ్ త్సో సరస్సు ప్రాంతంలో భారత్ మరో కీలక రహదారిని నిర్మిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలని చైనా వ్యతిరేకిస్తుంది. అలానే భారతదేశానికి ఆమోదయోగ్యం కాని ఫింగర్ ప్రాంతంలో చైనా కూడా రహదారిని నిర్మించింది. (‘భారత్ చర్యలతో.. సంబంధాలు సంక్లిష్టం’) 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ వెంబడి భారతదేశం-చైనా సరిహద్దు వివాదం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో భాగంగా చైనా పేర్కొంటుండగా, భారత్ వ్యతిరేకిస్తోంది. సరిహద్దు సమస్యకు సంబంధించి అంతిమ పరిష్కారం ఇంకా పెండింగ్‌లో ఉన్నందున.. సరిహద్దు ప్రాంతంలో ఇరు పక్షాలు శాంతితో మెలగాలని కోరుకుంటున్నారు. -
చైనా కవ్వింపు చర్యలపై ఆర్మీ కమాండర్ల భేటీ
న్యూఢిల్లీ : లడక్, సిక్కింలో చైనా తన ఆర్మీని మోహరించి, కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో బోర్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే అధ్యక్షతన బుధవారం ఆర్మీ కమాండర్ల సమావేశం జరిగింది. వివిధ విభాగాలకు చెందిన టాప్ కమాండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటూ జరిగే ఈ సమావేశాల్లో లడాఖ్‌లో చైనా దురాక్రమణ సహా అన్ని భద్రతా సమస్యలపై చర్చించనున్నారు.(హద్దు మీరుతున్న డ్రాగన్) నరవాణే ఇటీవలే లడక్‌కు వెళ్లి అక్కడ పరిస్థితులు సమీక్షించారు. నరవాణే లడక్ పర్యటన రహస్యంగా ఉండటంతో అనేక అనుమానాలకు తావునిస్తున్నాయి. మరోవైపు చైనా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆర్మీని మోహరిస్తోంది. పైగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. యుద్దానికి సిద్ధంగా ఉండేలా సైన్యాన్ని సిద్ధం చేయాలనీ పిలుపునిచ్చినట్టు సమాచారం. దీనికంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా హైలెవల్ మీటింగ్ జరపడం కూడా అనేక అనుమానాలకు తావునిస్తోంది. జరుగుతున్నా తాజా పరిణామాలను విశ్లేషిస్తే ఇండియా, చైనా దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది. చైనాపై ప్రపంచం చేస్తున్న కరోనా ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రపంచం దృష్టిని మరల్చడానికి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత: ప్రధాని మోదీ కీలక భేటీ!) -
భారత్‌పై నేపాల్ అభ్యంతరం.. చైనా ప్రమేయం!
న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతంలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణంపై నేపాల్ అభ్యంతరం లేవనెత్తడం వెనుక చైనా ప్రమేయం ఉన్నట్లు భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే సందేహం వ్యక్తం చేశారు. భారత్ పట్ల నేపాల్ నిరసన వైఖరి ఎందుకు ప్రదర్శిస్తుందో తనకు అర్థంకావడం లేదన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే... వేరొకరి తరఫున ఆ దేశం వకాల్తా పుచ్చుకున్నట్లుగా కనిపిస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో చైనా ప్రచ్చన్న యుద్ధంలో ఇదొక భాగమేనన్న సంకేతాలు ఇచ్చారు. కాగా భారత్- చైనా సరిహద్దులో గల లిపూలేఖ్ వెంబడి భారత ప్రభుత్వం ఇటీవల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇందుకు అభ్యంతరం తెలిపిన నేపాల్ ప్రభుత్వం లిపులేఖ్ తమ భూభాగానికి చెందినదే అని ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆ దేశంలోని భారత రాయబారికి నోటీసులు సైతం పంపింది.(భారత్, చైనాలతో చర్చించేందుకు సిద్ధం: నేపాల్) ఇక ఈ విషయం గురించి నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలి మాట్లాడుతూ... లిపూలేఖ్ నేపాల్, భారత్, చైనా ట్రై జంక్షన్లో ఉందని.. ఈ విషయం గురించి భారత్‌తో పాటు చైనాతో చర్చిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌తో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జనరల్ నరవాణే.. ‘‘కాళీ నది తూర్పు ప్రాంతం నేపాల్‌లో ఉంది. భారత్ చేపట్టిన రహదారి నిర్మాణం నది పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఈ విషయంలో వారికి అభ్యంతరం ఏముందో తెలియడం లేదు. వేరొకరి వాదనను వీరు వినిపిస్తున్నారేమో’’అని పేర్కొన్నారు. (తైవాన్‌పై చైనా పెత్తనం.. భారత్ సాయం కావాలి!) అదే విధంగా ఇండో- చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల ఘర్షణ గురించి కూడా నరవాణే ఈ సందర్భంగా స్పందించారు. లఢఖ్, సిక్కిం సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్రంగా పరిగణించదగ్గవి కాదన్నారు. రోజుకు పదిసార్లు ఇరు వర్గాలు తారసపడతాయని.. ఇలాంటి ఘటనలు అక్కడ సాధారణంగా జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కమాండర్లను మార్చినపుడు.. కొత్త వాళ్లతో గొడవకు దిగే అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత: చైనా స్పందన) -
పాక్‌కు సరైన రీతిలో బదులిస్తాం: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు సరైన రీతిలో బదులిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే హెచ్చరించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లోని హంద్వారాలో పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి అమరులైన కల్నల్ అశుతోష్ శర్మతో పాటు మరో నలుగురు జవాన్ల పట్ల దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సైన్యం తరచుగాకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారత్‌లోకి ఉగ్రవాదులను రవాణా చేస్తోందని ఆరోపించారు. జనం ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారిపై పోరాడాలన్న ఆసక్తి పాకిస్తాన్‌కు లేదని, ప్రస్తుతం దాని దృష్టి మొత్తం భారత్‌లోకి ఉగ్రవాదులను పంపడంపైనే ఉందని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే పాకిస్తాన్‌కు గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు. -
పాకిస్తాన్‌కు సరైన బుద్ది చెబుతాం..
న్యూఢిల్లీ: పాకిస్తాన్ దుస్సాహసానికి భారత సైన్యం ఎల్లప్పుడు దీటుగా బదులిస్తుందని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. భారత్‌లో పదే పదే అక్రమ చొరబాట్లకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు. సోమవారం పీటీఐతో మాట్లాడిన ఎంఎం నరవాణే.. హంద్వారా ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్, భద్రతా సిబ్బంది, పోలీసులు, సైనికుల త్యాగాన్ని కీర్తించారు. గ్రామస్తులు, బందీలకు ఎటువంటి గాయాలు కాకుండా కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోశ్ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. అదే విధంగా దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న దాయాది దేశం తీరుపై ఎంఎం నరవాణే మండిపడ్డారు. (భారత్ మందులు ఎగుమతి చేస్తుంటే.. పాక్..) ‘‘ప్రస్తుత పరిణామాలన్నింటినీ చూస్తుంటే కోవిడ్-19 వల్ల తలెత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కడం కంటే పొరుగు దేశంలో చొరబడేందుకే పాకిస్తాన్‌కు ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తోంది. కశ్మీరీల స్నేహితుడిని అంటూ పాక్ పదే పదే ప్రగల్భాలు పలుకుతుంది కదా. మారణకాండ, ఉగ్రదాడులు సాగించడమేనా స్నేహం అంటే. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను ప్రోత్సహించే గుణాన్ని త్యజించనంత వరకు.. భారత్ వాళ్లకు సరైన రీతిలో బదులు ఇస్తూనే ఉంటుంది’’అని హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్-19పై సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ పాకిస్తాన్ ఆ వేదికపై తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకుందని ఈ సందర్భంగా నరవాణే విమర్శించారు. కరోనాపై పోరాటం చేసేందుకు ఆ దేశం సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.(కల్నల్ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం) కాగా చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలు చేసినట్లు సమాచారం అందించిన వెంటనే.. కల్నల్ శర్మ, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకోవడంతో.. కల్నల్, మేజర్ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అమరులయ్యారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.(ఓ వీర సైనికా నీకు వందనం) -
భారత్ మందులు ఎగుమతి చేస్తుంటే.. పాక్..
శ్రీనగర్: ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాడుతుంటే పాకిస్తాన్ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదని భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. దాయాది దేశం నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) రేఖ వద్ద పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న వేళ సరిహద్ద వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా పరిస్థితులను పర్యవేక్షించేందుకు నరవాణే రెండు రోజుల పర్యటన నిమిత్తం కశ్మీర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ‘‘భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తుంటే పొరుగు దేశం మాత్రం మనల్ని ప్రమాదంలో పడేయాలని చూడటం అత్యంత దురదృష్టకరం’’అని పేర్కొన్నారు. ‘‘మన పౌరులను కాపాడుకుంటూనే.. ఇతర దేశాలకు వైద్య బృందాలను పంపిస్తూ... ఔషధాలు ఎగుమతి చేస్తూ మనం బిజీగా ఉంటే... మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోంది. ఇది ఏమాత్రం శుభ శకునం కాదు’’అని నరవాణే పాక్ తీరును ఎండగట్టారు. ఇక భారత సైన్యంలో ఇప్పటి వరకు ఎనిమిది మందికి కరోనా సోకగా.. ఒకరు పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారని నరవాణే వెల్లడించారు.(జమ్మూ కశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్) కాగా జమ్మూ కశ్మీర్‌లోని కీరన్ సెక్టార్ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్‌నైల్లో కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 10న దూద్‌నైల్‌లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.