![Indian Army Commanders Conference held in Delhi over Chinese aggression - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/27/india%20army.jpg.webp?itok=YFwoVC6p)
న్యూఢిల్లీ : లడక్, సిక్కింలో చైనా తన ఆర్మీని మోహరించి, కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో బోర్డర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే అధ్యక్షతన బుధవారం ఆర్మీ కమాండర్ల సమావేశం జరిగింది. వివిధ విభాగాలకు చెందిన టాప్ కమాండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటూ జరిగే ఈ సమావేశాల్లో లడాఖ్‌లో చైనా దురాక్రమణ సహా అన్ని భద్రతా సమస్యలపై చర్చించనున్నారు.(హద్దు మీరుతున్న డ్రాగన్)
నరవాణే ఇటీవలే లడక్‌కు వెళ్లి అక్కడ పరిస్థితులు సమీక్షించారు. నరవాణే లడక్ పర్యటన రహస్యంగా ఉండటంతో అనేక అనుమానాలకు తావునిస్తున్నాయి. మరోవైపు చైనా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆర్మీని మోహరిస్తోంది. పైగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. యుద్దానికి సిద్ధంగా ఉండేలా సైన్యాన్ని సిద్ధం చేయాలనీ పిలుపునిచ్చినట్టు సమాచారం. దీనికంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా హైలెవల్ మీటింగ్ జరపడం కూడా అనేక అనుమానాలకు తావునిస్తోంది. జరుగుతున్నా తాజా పరిణామాలను విశ్లేషిస్తే ఇండియా, చైనా దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది. చైనాపై ప్రపంచం చేస్తున్న కరోనా ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రపంచం దృష్టిని మరల్చడానికి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత: ప్రధాని మోదీ కీలక భేటీ!)
Comments
Please login to add a commentAdd a comment