commanders conference
-
తూర్పు లద్దాఖ్‌పై భారత్, చైనా సైనిక చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మూడున్నరేళ్ల క్రితం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు భారత్, చైనా 21వ విడత సైనిక చర్చలు జరిపాయి. చర్చల్లో ఎలాంటి కీలకమైన ఉమ్మడి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. వాస్తవా«దీన రేఖ వెంబడి ఛుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఫిబ్రవరి 19వ తేదీన ఈ చర్చలు జరిగాయి. భారత్ తరఫున లేహ్ కేంద్రంగా ఉన్న 14వ కోర్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలీ, చైనా తరఫున దక్షిణ గ్జిన్జియాంగ్ సైనిక జిల్లా కమాండర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కోర్ కమాండర్ స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సైనికుల మొహరింపును ఉపసంహరించుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే సైనిక, దౌత్య కమ్యూనికేషన్లను ఇకమీదటా కొనసాగించాలని నిర్ణయించారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. దెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ అంశమూ చర్చకొచి్చందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో 20వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని జనవరిలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించడం తెల్సిందే. 2020 ప్రథమార్ధంలో తూర్పు లద్దాఖ్‌లో ఉన్న సాధారణ స్థాయికి ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. -
భారత్–చైనా ఆర్మీ మధ్య రేపు చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ వేగంగా జరగాలని భారత్ స్పష్టం చేయనుంది. భారత్– చైనా మధ్య 19వ విడత చర్చలు ఈ నెల 14న జరగనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండు దేశాల కార్ప్స్ కమాండర్ స్థాయి చివరి దఫా చర్చలు నాలుగు నెలల క్రితం జరిగాయి. రేపు జరిగే చర్చల్లో మిగిలిన ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ పూర్తిగా జరగాలని భారత ప్రతినిధి బృందం పట్టుబడ్టనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు దేశాల మధ్య పలు విడతలుగా జరిగిన చర్చల ఫలితంగా తూర్పులద్దాఖ్‌లోని కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు పక్షాలు బలగాలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 18వ విడత చర్చల్లో ప్రధానంగా డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలంటూ భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. తాజా చర్చలు చుషుల్–మోల్డో సరిహద్దు పాయింట్‌లోని భారత భూభాగంలో జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత బృందానికి లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, చైనా కు సౌత్ జిన్జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నాయకత్వం వహించే అవకాశాలున్నాయి. -
India, China Military Talks: అసంపూర్తిగానే సుదీర్ఘ సైనిక చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో మిగతా ప్రాంతాల్లోని ప్రతిష్టంభనపై భారత మరియు చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు భారత సైన్యం ప్రకటించింది. అయితే భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చైనా ప్రతిపాదనలను భారత్ సైన్యం అంగీరించడానికీ ముందుకు వచ్చినా చైనా ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని పేర్కొంది. ఈ సమావేశంలో తూర్పు లడఖ్‌లోని మిగతా ప్రాంతాల్లో సమస్యల పరిష్కార మార్గానికి భారత్ కొన్ని ప్రతిపాదనలు సూచించిన చైనా ఏ మాత్రం ఆమోదించడానికి మొగ్గు చూపలేదని స్పష్టం చేసింది. (చదవండి: భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ) కాగా, సరిహద్దు ప్రాంతాల్లో ఘర్ణణ వాతావరణం ఏర్పడకుండా ఉండటానికీ సహకరిస్తామని ఇరు సైన్యాలు అంగీకరించినట్లు తెలిపింది. భారత్-చైనాల ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా సరిహద్దు సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నమాని భారత్ పేర్కొంది. గోగ్రాలోని రిజల్యూషన్ ఆరు ఫ్లాష్పాయింట్లలో నాలుగింటిలో భారత్ , చైనాలు వెనక్కి తగ్గడానికి అంగీకరించాయి. అదేవిధంగా మిగిలిన గంగాన్, పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లోని డిప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్‌లో చైనా బలగాలు వెనక్కి తగ్గి సహకరించాలని భారత్ ఒత్తిడి చేస్తోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే డెప్సాంగ్తో సహా మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇదే అత్యుత్తమైన పరిష్కార మార్గం అని భారత్ నొక్కి చెబుతోంది. మే 5,2020న తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన అనంతరం ఇరు దేశాల అధికారులు సంప్రదింపుల కారణంగా 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగిన సంగతి తెలిసిందే . (చదవండి: "మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు") -
పీపీ–15 నుంచి వెనక్కి వెళ్లిపోండి: చైనాకు తెగేసి చెప్పిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ఆదివారం జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.జి.కె.వీునన్ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్దాఖ్ హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. గత ఏడాది మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ పురావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. గోగ్రా నుంచి ఉపసంహరణ పూర్తి 2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి. ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్‌తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్ నొక్కి చెబుతోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం. -
దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల వద్ద, ప్రస్తుత ఘర్షణలకు కేంద్ర స్థానమైన పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లోని కీలక స్థావరాల వద్ద పాగా వేయడం చైనా లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, దక్షిణ తీరంలో పరిస్థితి ఏ మలుపైనా తీసుకునేలా కనిపిస్తోందని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. చైనా దళాల చర్యలను నియంత్రిస్తోంది స్థానికంగా ఉన్న ఆర్మీ కమాండర్లు కాదని, ఉన్నత స్థాయి చైనా నాయకత్వ అదుపాజ్ఞల మేరకే చైనా దళాల కదలికలు ఉంటున్నాయని వివరించారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం ఉద్రిక్తంగానే ఉందని, అయితే, అక్కడి కొన్ని వ్యూహాత్మక పర్వతాలు భారత నియంత్రణలోనే ఉన్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల స్థితిలో భారత ఆర్మీ ఉంది. పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలోని ఫింగర్ 4 వద్ద చైనా దళాల కన్నా భారతే మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ, కీలక పర్వత ప్రాంతాలు భారత్ స్వాధీనంలో ఉన్నాయి. రెండు దేశాల సైనికులు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉన్నారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీర ప్రాంతంలో కూడా సుమారు 6 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్వాధీనంలో ఉన్న దక్షిణ తీరంలోని వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను మళ్లీ ఆక్రమించేందుకు చైనా తరచుగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను భారత్ గట్టిగా అడ్డుకుంటోంది. అయితే, ఈ ప్రయత్నాలను చైనా మరింత తీవ్రస్థాయిలో కొనసాగించే అవకాశం ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి చైనా ఇప్పటికే సుమారు 150 యుద్ధ విమానాలను, ఇతర సహాయక హెలికాప్టర్లను తరలించింది. పాంగాంగ్ సరస్సుకు దక్షిణ తీరంలో భారత సైనికులను ఎంగేజ్ చేస్తూ.. ఉత్తర తీరంలో నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించే వ్యూహాన్ని చైనా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉపగ్రహ ఛాయాచిత్రాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఫింగర్ 5 ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు కొనసాగినట్లు ఆ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ సంవత్సరం మే నెల నుంచి ఉత్తర తీర ప్రాంతంలోని ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు భారత దళాలు గస్తీని చైనా అడ్డుకుంటోంది. ఫింగర్ 8 వరకు భారత్ భూభాగమేనన్న భారతదేశ వాదన. కానీ, చైనా మాత్రం ఫింగర్ 4 వద్దనే వాస్తవాధీన రేఖ ఉందని వాదిస్తోంది. ఆ కీలక ప్రాంతాల్లో మే నెల నుంచి పలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది. ఇండో, చైనా ఆర్మీ కమాండర్ల చర్చలు సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నివారణపై భారత్, చైనా సైన్యాలకు చెందిన కమాండర్లు తూర్పు లద్దాఖ్‌లో చర్చలు జరిపారు. టెన్షన్ల నివారణకు అనుసరించాల్సిన మార్గాలపై హాట్‌లైన్‌లోనూ చర్చించినట్లు సమాచారం. చైనా, ఇండియా విదేశాంగ మంత్రుల మధ్య మాస్కోలో గురువారం సమావేశం జరగనుంది. ఇప్పటికీ తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గురువారం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల్లో జైశంకర్, వాంగ్ల భేటీపై ఆసక్తి నెలకొంది. ఇదే రోజు రష్యా, చైనా, ఇండియా విదేశాంగ మంత్రుల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగనున్నాయి. -
చైనాకు దీటుగా బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా సుమారు 17 వేల సైనికులను, యుద్ధ వాహనాలను మోహరించింది. ఏప్రిల్, మేల నుంచే చైనా ఆ ప్రాంతాలకు బలగాల తరలింపు ప్రారంభించింది. అలాగే, అక్కడ పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 10 నుంచి పీపీ 13 వరకు భారత బలగాల గస్తీ విధులను చైనా సైనికులు అడ్డుకోవడం ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో, భారత్ కూడా అదే స్థాయిలో స్పందించిందని, టీ 90 రెజిమెంట్స్ సహా భారీగా బలగాలను ఆ ప్రాంతాలకు తరలించిందని వెల్లడించాయి. కారకోరం పాస్ దగ్గర్లోని పీపీ 1 దగ్గర్నుంచి పెద్ద ఎత్తున భారత్ బలగాలను దెప్సాంగ్‌కు తరలించిందని తెలిపాయి. ఏదైనా దుస్సాహసానికి పాల్పడాలంటే చైనా పలుమార్లు ఆలోచించే స్థాయిలో 15 వేల మంది భారత జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నారన్నాయి. టీడబ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంతో రెండు బెటాలియన్ల మధ్య దూరం చాలా తగ్గుతుంది. భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో చిన్న వంతెనను నిర్మించగా భారత సైనికులు దాన్ని కూల్చేశారు. భౌగోళిక సమగ్రతలో రాజీ లేదు చైనాకు మరోసారి స్పష్టం చేసిన భారత్ దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ లేదని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సొ, ఇతర ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఇరుదేశాల మిలటరీ కమాండర్ స్థాయి ఐదో విడత చర్చల సందర్భంగా స్పష్టం చేసింది. సీనియర్ కమాండర్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఆదివారం చైనా భూభాగంలోని మోల్డో వద్ద 11 గంటల పాటు చర్చించారు. రెండు దేశాల మధ్య సౌహార్ధ సంబంధాలు నెలకొనాలంటే.. వాస్తవాధీన రేఖ వెంట గతంలో ఉన్న యథాతథ స్థితి నెలకొనడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ‘గల్వాన్ లోయ, పలు ఇతర ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ పాంగాంగ్ సొ ప్రాంతంలోని ఫింగర్ 4, ఫింగర్ 8 ల్లో, గొగ్రా వద్ద బలగాలను ఉపసంహరించకపోవడంపై భారత్ గట్టిగా ప్రశ్నించింది’ అని వివరించాయి. 1.75 లక్షల కోట్ల టర్నోవర్ లక్ష్యం 2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది. -
పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందే
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని పాన్‌గాంగ్ త్సో నుంచి చైనా సైనికులు పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందేనని భారత్ తేల్చిచెప్పింది. మరో రెండు వివాదాస్పద ప్రాంతాల్లో తిష్టవేసిన చైనా బలగాలు సైతం వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది. ఆదివారం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనా భూభాగం వైపు భారత్–చైనా సీనియర్ సైనిక కమాండర్ల మధ్య 11 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇవి ఐదో దఫా చర్చలు. సాధ్యమైనంత త్వరగా చైనా సైనికులు వెనక్కి తగ్గితేనే సరిహద్దుల్లో శాంతి సాధ్యమని భారత అధికారులు స్పష్టం చేశారు. మే 5వ తేదీ ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించారు. సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగా, తూర్పు లద్ధాఖ్లోని కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించింది. రానున్న శీతాకాలంలో చైనా నుంచి కవ్వింపు చర్యలు తప్పకపోవచ్చని అంచ నా వేస్తున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు ఇప్పట్లో పరిష్కార మార్గాలు సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తూర్పు లద్ధాఖ్‌లో సైన్యాన్ని కొనసాగించడమే మేలని భారత సైనిక అధికారులు చెబుతున్నారు. -
40 వేల మంది చైనా సైనికుల తిష్ట!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత వాయుసేన చురుకుగా వ్యవహరించి ప్రత్యర్థికి బలమైన సందేశాన్ని పంపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కొనియాడారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధవిమానాలను వేగంగా మోహరించడం ద్వారా వాయుసేన తన యుద్ధ సన్నద్ధతను చాటిందని, తద్వారా పాకిస్థాన్‌పై భారత్ జరిపిన బాలాకోట్ దాడిని చైనాకు గుర్తు చేసిందని ఆయన బుధవారం ఢిల్లీలో మొదలైన వాయుసేస సదస్సులో అన్నారు. వాయుసేన ఉన్నతస్థాయి అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో దేశ ప్రజలందరి నమ్మకం త్రివిధ దళాలపై ఉందని రాజ్‌నాథ్ అన్నారు. సరిహద్దులు దాటి మరీ బాలాకోట్‌పై వాయుసేన జరిపిన దాడిని గుర్తు చేస్తూ వాయుసేన ఈ విషయంలో అత్యంత నైపుణ్యంతో వ్యవహరించిందని అన్నారు. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్) తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో వాయుసేన యుద్ధ విమానాల మోహరింపు ఇలాంటిదేనని మంత్రి పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించిన మంత్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధంగా ఉండాలని కోరారు. శత్రువులను ఎదుర్కొనేందుకు వాయుసేన సన్నద్ధంగా ఉంటుందని సదస్సులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధూరియా స్పష్టం చేశారు. 40 వేల మంది చైనా సైనికుల తిష్ట! తూర్పు లద్ధాఖ్ సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి మళ్లిస్తున్నామని పైకి చెబుతున్న చైనా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బలగాల మళ్లింపుపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా పీపుల్స్ రిబరేషన్ ఆర్మీ లెక్కచేయడం లేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు 40,000 మంది చైనా సైనికులు తిష్ట వేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని సైతం కలిగి ఉన్నట్లు తెలియజేసింది. భారత్–చైనా కమాండర్ల స్థాయి చర్చలు గత వారంలోనే జరిగాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. అయినా చైనా తన పంథా మార్చుకోవడం లేదు. (చైనా కాన్సులేట్‌లో పత్రాల కాల్చివేత) -
చైనా కవ్వింపు చర్యలపై ఆర్మీ కమాండర్ల భేటీ
న్యూఢిల్లీ : లడక్, సిక్కింలో చైనా తన ఆర్మీని మోహరించి, కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో బోర్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే అధ్యక్షతన బుధవారం ఆర్మీ కమాండర్ల సమావేశం జరిగింది. వివిధ విభాగాలకు చెందిన టాప్ కమాండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటూ జరిగే ఈ సమావేశాల్లో లడాఖ్‌లో చైనా దురాక్రమణ సహా అన్ని భద్రతా సమస్యలపై చర్చించనున్నారు.(హద్దు మీరుతున్న డ్రాగన్) నరవాణే ఇటీవలే లడక్‌కు వెళ్లి అక్కడ పరిస్థితులు సమీక్షించారు. నరవాణే లడక్ పర్యటన రహస్యంగా ఉండటంతో అనేక అనుమానాలకు తావునిస్తున్నాయి. మరోవైపు చైనా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆర్మీని మోహరిస్తోంది. పైగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. యుద్దానికి సిద్ధంగా ఉండేలా సైన్యాన్ని సిద్ధం చేయాలనీ పిలుపునిచ్చినట్టు సమాచారం. దీనికంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా హైలెవల్ మీటింగ్ జరపడం కూడా అనేక అనుమానాలకు తావునిస్తోంది. జరుగుతున్నా తాజా పరిణామాలను విశ్లేషిస్తే ఇండియా, చైనా దేశాల మధ్య మరోసారి యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది. చైనాపై ప్రపంచం చేస్తున్న కరోనా ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రపంచం దృష్టిని మరల్చడానికి భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. (సరిహద్దుల్లో ఉద్రిక్తత: ప్రధాని మోదీ కీలక భేటీ!) -
నడి సముద్రంలో నరేంద్ర మోదీ
- అరేబియా సముద్ర జలాల్లోని విక్రమాదిత్య యుద్ధనౌకను సందర్శించిన ప్రధానమంత్రి - అక్కడే త్రివిధ దళాధిపతులతో భేటీ కొచి: రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా అరేబియా సముద్ర జలాల్లో వినూత్న రీతిలో కీలక సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొచి తీరానికి 40 నాటికన్ మైళ్ల దూరంలో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలో.. ప్రధాన మంత్రి అధ్యక్షతన త్రివిధ దళాధిపతుల సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఈ సమావేశం కొనసాగుతుంది. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. కొచి తీరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విక్రమాదిత్య వద్దకు చేరుకున్న ప్రధానికి సిబ్బంది ఘనస్వాగతం పలికారు. భారత నౌకాదళం అమ్ములపొదిలోని అతి భారీ యుద్ధనౌక అయిన విక్రమాదిత్యను మోదీ సందర్శించడం ఇది రెండోసారి. గత జూన్ లో ప్రధాని మోదీయే విక్రమాదిత్యను జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత మోదీ కొల్లాం బయలుదేరతారు. అక్కడ కేరళ మాజీ ఆర్ శంకరన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం ఢిల్లీకి తిరుగుపయనమయ్యేలోగా కేరళ కేబినెట్ తోనూ భేటీ అవుతారని సమాచారం.