sub merine
-
‘టైటాన్ మునుగుతుందని ముందే చెప్పా’.. అందుకే జాబ్ నుంచి పీకేశారు!
అట్లాంటిక్ మహా సముద్రంలో ఇటీవల జరిగిన టైటాన్ జలాంతర్గామి ప్రమాదంలో ఓషన్ గేట్ యజమాని సహా ఐదుగురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. టైటానిక్ ఓడ శిథిలాల ఉన్న చోటుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన టైటాన్ జలాంతర్గామి నిర్మాణ సమయంలోనే అందులో లోపాలు ఉన్నట్లు ఓ నిపుణుడు గుర్తించాడు. ఈ విషయాన్ని యాజమాన్యం వద్దకు తీసుకెళ్లగా.. వారు ఆయన మాటలను వినిపించుకోలేదు. పైగా లోపాలను చెప్పిన ఆ నిపుణుడిని ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. అసలేం జరిగిందంటే.. ‘టైటాన్’ జలాంతర్గామి నిర్మాణ జరుగుతుండగా… దాని సామర్థత మీద ఆ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న ఓ నిపుణుడికి సందేహాలు మొదలయ్యాయి. దాంతో టైటాన్‌కు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి అవసరం ఉందని, నౌక తీవ్రమైన లోతులకు చేరినప్పుడు ప్రయాణికులకు ముప్పు తలెత్తే అవకాశముందని 2018లోనే ‘ఓషన్ గేట్’ సంస్థ మెరైన్ ఆపరేషన్స్ డైరెక్టర్ తన నివేదికలో విశ్లేషించాడు. దీనిపై అప్పట్లో అమెరికాలోని సియాటెల్ జిల్లా కోర్టులో వ్యాజ్యం సైతం దాఖలైంది. కంపెనీ విషయాలను బహిర్గతం చేస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ ఆ నిపుణుడు మీద ‘ఓషన్ గేట్’ సంస్థ వ్యాజ్యం వేసింది. మరో వైపు ‘టైటాన్’ భద్రత గురించి, దాని లోపాలు ఎత్తిచూపానని, పరీక్షల గురించి ప్రశ్నించినందుకు తనను ఉద్యోగం నుంచి అక్రమంగా తొలగించారంటూ సదరు వ్యక్తి కూడా కౌంటర్ దాఖలు చేశాడు. కంపెనీ ఆ రోజే నిర్మాణంలో నాణ్యత, భద్రత విషయంలో శ్రద్ధ చూపించి ఉంటే ఐదుగురు ప్రాణాలు గాల్లో కలిసేవి కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. చదవండి: ప్రయాణం.. విషాదాంతం -
మూడు దశాబ్దాలకు పైగా సేవలు..సెలవిక.. అగ్రజా!
పదేళ్ల క్రితమే దీని పనైపోయిందన్నారు. మరమ్మతులకు వచ్చిన ప్రతిసారి స్క్రాప్ అని హేళన చేశారు. కానీ.. వయసుతో సంబంధం లేదంటూ దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది. సముద్రంలో చిక్కుకున్న సబ్ మెరైన్లలోని సైనికుల్ని కాపాడే అతి పెద్ద ప్రయోగానికి కేంద్ర బిందువుగా మారింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న అనేక జలాంతర్గాములకు దిక్సూచిగా నిలిచింది. మూడున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ సేవలందించి సలాం అంటూ నిష్క్రమించింది. సాక్షి, విశాఖపట్నం: ఐఎన్ఎస్ సింధు ధ్వజ్.. ప్రపంచంలోనే అత్యంత సాధారణ సంప్రదాయ జలాంతర్గామి. దీనిని కిలో క్లాస్ సబ్మెరైన్గా పరిగణిస్తారు. 35 ఏళ్ల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేసిన దీనిని అత్యంత పటిష్టమైన సబ్మెరైన్గా భారత్ తీర్చిదిద్దింది. స్వదేశీ సోనార్, స్వదేశీ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌తో పాటు స్వదేశీ టార్పెడో ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంతో సింధు ధ్వజ్ తన సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకుంది. భారత నౌకాదళం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారు చేస్తున్న ప్రతి సబ్‌మెరైన్ డిజైన్ వెనుక.. సింధు ధ్వజ్‌ని స్ఫూర్తిగా తీసుకుంటుండటం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇన్నోవేషన్ ఫర్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రోలింగ్ ట్రోఫీని పొందిన ఏకైక జలాంతర్గామిగా చరిత్రలో నిలిచింది. మలబార్ విన్యాసాల్లో సత్తా సింధు ధ్వజ్ భారత నౌకాదళంలో చేరిన తర్వాత సాగర గర్భంలో నిర్విరామంగా శత్రు సేనల రాకను పసిగట్టేందుకు ‘స్పెషల్ ఐ’గా విధులు నిర్వర్తించింది. తరచుగా మరమ్మతులకు గురవుతుండటంతో పదేళ్ల క్రితమే డీ కమిషన్ చెయ్యాలని భావించారు. (ఉపసంహరించాలని) అయితే.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే మలబార్ విన్యాసాల్లో భాగంగా 2015లో జరిగిన ఎడిషన్‌లో దీని అసలు బలం ప్రపంచానికి తెలిసింది. అమెరికా తన సరికొత్త లాస్ ఏంజిల్స్ క్లాస్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ యూఎస్ఎస్ సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టీ(ఎస్ఎస్ఎన్–705)తో విన్యాసాల్లో తలపడింది. ఈ విన్యాసాల్లో అప్పటికే పలుమార్లు మరమ్మతులకు గురైన సింధు ధ్వజ్ మట్టికరవడం ఖాయమనుకున్నారు. కానీ.. అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. అత్యాధునిక సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసినంత పని చేసి.. అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. చారిత్రక విజయంలో కీలక పాత్ర మహా సముద్రాల లోతుల్లో చిక్కుకుపోయే సబ్ మెరైన్లలో సిబ్బందిని కాపాడే అతి క్లిష్టమైన పరీక్షని భారత నౌకాదళం విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగంలోనూ సింధు ధ్వజ్ ముఖ్య భూమిక పోషించింది. 2019లో బంగాళాఖాతంలో నిర్వహించిన పరీక్షల్లో ఐఎన్ఎస్ సింధు ధ్వజ్‌ను వినియోగించారు. సముద్రం అడుగున ఉన్న సింధు ధ్వజ్ వద్దకు డీప్ సబ్ మెరైన్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్వీ)ను నేవీ పంపించగా.. డీఎస్ఆర్వీని సింధు ధ్వజ్ సేఫ్‌గా సముద్ర ఉపరితలానికి తీసుకొచ్చింది. ఈ విజయంతో డీఎస్ఆర్వీ వినియోగంలో అగ్ర నౌకాదళాల సరసన ఇండియన్ నేవీ చేరింది. అనేక విజయాల్లో కీలక భూమిక పోషించిన సింధు ధ్వజ్ సబ్‌మెరైన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. దేశ రక్షణకు నిర్విరామంగా అందించిన సేవలకు గాను తూర్పు నౌకాదళం సింధు ధ్వజ్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. -
విశాఖలో ఐఎన్ఎస్ కవరట్టి జల ప్రవేశం
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. విరోధులకు బలమైన హెచ్చరికను జారీ చేస్తూ.. యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి ఇవాళ విశాఖపట్టణంలోని నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే దీనిని కమిషన్ చేశారు. ప్రాజెక్ట్ 28(కమోర్టా క్లాస్) లో భాగంగా నిర్మించిన నాలుగు యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ కవరట్టి చివరిది. డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ .. ఐఎన్ఎస్ కవరట్టిని డిజైన్ చేసింది. కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీసర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని నిర్మించారు. ఇక ఇది పెరుగుతున్న భారత నౌకదళం, జీఆర్ఎస్ఈ సామర్థ్యాన్ని చూపించడమే కాక దేశీయంగా తయారు చేయడంతో భారత్ స్వావలంబనకు నిదర్శనంగా నిలవడమే కాక.. జాతీయ లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్‌ని ఉద్ఘాటిస్తుంది అన్నారు అధికారులు. ఇక కవరట్టిలో అత్యాధునిక ఆయుధాలు, జలాంతర్గాములను గుర్తించి ప్రాసిక్యూట్ చేయగల సెన్సార్ సూట్ ఉందని భారత నావికాదళం తెలిపింది. ఇక ఐఎన్ఎస్ కవరట్టి 90 శాతం దేశీయంగా తయారయ్యింది.(చదవండి: ‘థియేటర్ కమాండ్స్’ ఏర్పాటు కీలక మలుపు!) INS Kavaratti, last of the 4 indigenously built Anti-Submarine Warfare stealth corvettes, is all set to join Indian Navy. Designed by Indian Navy's Directorate of Naval Design, the ship portrays our growing capability in becoming self-reliant through indigenization: Indian Navy pic.twitter.com/jHFcuGIkwT — ANI (@ANI) October 22, 2020 "ఓడ బోర్డులో అమర్చిన అన్ని వ్యవస్థల సముద్ర పరీక్షలను పూర్తి చేసినందున ఓడను నావికాదళంలోకి ప్రవేశపెట్టడం గమనార్హం. కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలను పరిగణనలోకి తీసుకొని, ఇది నేవీకి అందజేయడం ప్రశంసనీయమైన విజయం. కవరట్టిని నేవీలోకి ప్రవేశపెట్టడంతో, భారత నావికాదళ సంసిద్ధత మెరుగుపడుతుంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కవరట్టికి ఆర్నాలా-క్లాస్ క్షిపణి కొర్వెట్టి అయిన ఐఎన్ఎస్ కవరట్టి నుంచి ఆ పేరు వచ్చింది. పాత కవరట్టి 1971 లో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి మద్దతుగా పనిచేయడం ద్వారా గుర్తింపు పొందింది. -
విశాఖలో బీచ్‌కు స్నానానికి వెళ్లి...!
-
విశాఖలో బీచ్‌కు స్నానానికి వెళ్లి...!
విశాఖపట్నం: సరదా కోసం బీచ్‌లో స్నానానికి వెళ్లిన స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో ఆదివారం ఏడుగురు విద్యార్థులు బీచ్ స్నానానికి వెళ్లారు. సబ్‌మెరైన్ వద్ద బీచ్‌లో వారు స్నానం చేస్తుండగా ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. అతన్ని గాయత్రి కళాశాల విద్యార్థి సత్యానంద్గా గుర్తించారు. ప్రస్తుతం గల్లంతైన విద్యార్థి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.