సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్ 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో మెరిశాడు. అయితే ఇటీవలే వింబుల్డన్ ఫైనల్లో అల్కారాజ్ చేతిలో అనూహ్యంగా ఓడినప్పటికి మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కొట్టే సత్తా జొకోవిచ్‌కు ఇంకా ఉంది.
ఇప్పటికే 23 టైటిల్స్‌తో పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ చరిత్రకెక్కాడు. ఆగస్టులో యూఎస్ ఓపెన్ జరగనున్న నేపథ్యంలో జొకోవిచ్ దానికి సంబంధించిన ప్రిపరేషన్‌ను ఇప్పటికే మొదలుపెట్టాడు. తాజాగా జకోవిచ్ తండ్రి స్ర్ద్‌జన్ జకోవిచ్ అతని కొడుకు రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది జకోవిచ్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పే అవకాశముందని తెలిపాడు.
''టెన్నిస్ ఆట అనేది శారీరకంగా, మానసికంగా ఎంతో సవాల్‌తో కూడినది. అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. దాంతో, జీవితంలో ఇతర పనులు చేసేందుకు అతడికి సమయం ఉండడం లేదు. టెన్నిస్ అనేది జకోవిచ్ జీవితంలో ఓ భాగం. అంతేకానీ, అదే జీవితం'' కాదంటూ పేర్కొన్నాడు. జకోవిచ్ ఆటకు గుడ్ బై చెప్పనున్నాడనే వార్తతో అతడి అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది.
చదవండి: WI Vs IND 1st ODI: టాస్ గెలిచిన టీమిండియా.. ఇషాన్ కిషన్ వైపే మొగ్గు
Japan Open 2023: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
Comments
Please login to add a commentAdd a comment