పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ (సెర్బియా) 3 గంటల 35 నిమిషాల్లో 5–7, 2–6, 6–3, 6–2, 6–2తో పదో సీడ్ జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలిచి 11వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల మ్యాచ్‌ల్లో జకోవిచ్ తొలి రెండు సెట్‌లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజయం అందుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం.
రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–4, 6–2, 7–6 (8/6)తో జాండ్‌షుల్ప్ (నెదర్లాండ్స్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్, 34 ఏళ్ల తాత్యానా మరియా (జర్మనీ) 4–6, 6–2, 7–5తో తన దేశానికే చెందిన జూల్ నిమియెర్‌పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment