Australian Open 2023: Novak Djokovic Wins His 10th Australian Open Title In Melbourne - Sakshi
Sakshi News home page

Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా జొకోవిచ్‌..

Published Sun, Jan 29 2023 5:23 PM | Last Updated on Sun, Jan 29 2023 7:06 PM

Novak Djokovic wins 10th Australian Open title - Sakshi

ఆస్ట్రేలియా ఓపెన్‌-2023 పురుషుల సింగిల్స్‌ విజేతగా సెర్బియా స్టార్‌ నోవాక్‌ జొకోవిచ్‌ నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో గ్రీక్ ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపస్‌పై 6-3,7-6(7/4),7-6(7/5) తేడాతో జొకోవిచ్‌ విజయం సాధించాడు. తొలి సెట్‌లో జకోవిచ్‌ సూపర్ స్మాష్ షాట్స్‌తో ప్రత్యర్ధి ఆటగాడికి చెమటలు పట్టించాడు. ఇదే క్రమంలో 6-3తో ఫస్ట్ సెట్ను సొంతం చేసుకున్నాడు.

అనంతరం పుంజుకున్న సిట్సిపస్ రెండో సెట్‌ను సమం చేశాడు.  దీంతో సెట్ టై బ్రేక్కు దారి తీసింది. టై బ్రేక్ లో అదరగొట్టిన జొకోవిచ్‌ 7-4తో రెండో సెట్ ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన  మూడో సెట్ కూడా సమం మైంది. దీంతో  టై బ్రేక్ లో అద్బుతంగా రాణించిన జొకోవిచ్‌  7-5తో మూడో సెట్‌తో పాటు టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

కాగా జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 10 వఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. ఇక ఓవరాల్‌గా జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. తద్వారా ఓ అరుదైన ఘనతను జొకోవిచ్‌ సాధించాడు. అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన నాధల్‌(22) రికార్డును  జొకోవిచ్‌ సమం చేశాడు. అదే విధంగా తాజా విజయంతో ప్రపంచ నెం1గా జొకోవిచ్‌ అవతరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement