మోంటెకార్లో: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్‌లోనూ ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)కు నిరాశ ఎదురైంది. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన ఈ సెర్బియా స్టార్... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ సెమీస్ చేరలేకపోయాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 3–6, 6–4, 2–6తో మెద్వెదేవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు.
సెమీస్‌లో నాదల్
మరోవైపు 11సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ ఈ టోర్నీలో 14వసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. అర్జెంటీనా ప్లేయర్ గిడో పెల్లాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–6 (7/1), 6–3తో విజయం సాధించాడు. గతంలో నాదల్ 2004 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిదిసార్లు... 2016 నుంచి 2018 వరకు వరుసగా మూడుసార్లు మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్స్ సాధించాడు.
జొకోవిచ్‌కు చుక్కెదురు
Published Sat, Apr 20 2019 4:11 AM | Last Updated on Sat, Apr 20 2019 4:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment