Joko Witch
-
జొకోవిచ్‌కు చుక్కెదురు
మోంటెకార్లో: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్లోనూ ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)కు నిరాశ ఎదురైంది. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన ఈ సెర్బియా స్టార్... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ సెమీస్ చేరలేకపోయాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 3–6, 6–4, 2–6తో మెద్వెదేవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో నాదల్ మరోవైపు 11సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ ఈ టోర్నీలో 14వసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. అర్జెంటీనా ప్లేయర్ గిడో పెల్లాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–6 (7/1), 6–3తో విజయం సాధించాడు. గతంలో నాదల్ 2004 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిదిసార్లు... 2016 నుంచి 2018 వరకు వరుసగా మూడుసార్లు మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్స్ సాధించాడు. -
సెరెనా మరో అడుగు
మెల్బోర్న్: రెండేళ్ల క్రితం రెండు నెలల గర్భంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మళ్లీ టైటిలే లక్ష్యంగా వేగం పెంచింది. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైన ఆమె సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్‌సీడ్ హలెప్‌కు రెండో రౌండ్లోనే చావుతప్పి కన్నులొట్టపోయినంత పనైంది. ఆమె అతికష్టమ్మీద గట్టెక్కింది. వీనస్ విలియమ్స్, సీడెడ్ క్రీడాకారిణిలు ఒసాకా, స్వితోలినా, ప్లిస్కోవా మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ సీడ్ జొకోవిచ్ సునాయాస విజయంతో ముందంజ వేయగా... రావ్‌నిక్, నిషికొరి, జ్వెరెవ్ మూడో రౌండ్‌కు చేరారు. ‘అమ్మ’ అలవోకగా... మహిళల సింగిల్స్‌లో 16వ సీడ్‌గా బరిలోకి దిగిన అమెరికన్ దిగ్గజం సెరెనా రెండో రౌండ్లో దూకుడుగా ఆడింది. కోర్ట్ అంతా పాదరసంలా కదిలిన ఈ ‘అమ్మ’ 6–2, 6–2తో ఎజెని బౌచర్డ్ (కెనడా)పై విజయం సాధించింది. కేవలం గంటా 10 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. టాప్ సీడ్ హలెప్ (రుమేనియా)కు అన్‌సీడెడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ముచ్చెమటలు పట్టించింది. చివరకు హలెప్ 6–3, 6–7 (5/7), 6–4తో కెనిన్‌పై గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ నవొమి ఒసాకా (జపాన్) 6–2, 6–4తో తమర జిదన్సెక్ (స్లోవేనియా)పై, ఆరో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుజ్మోవ (స్లోవేకియా)పై గెలుపొందారు. ఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 6–1, 6–0తో బ్రింగిల్ (అమెరికా)ను ఓడించగా, వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 4–6, 6–0తో కార్నెట్ (ఫ్రాన్స్)పై, ముగురుజా (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 7–5తో జొహానా కొంటా (ఇంగ్లండ్)పై నెగ్గింది. మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–4తో అనస్తాసియా పొటపొవా (రష్యా)పై విజయం సాధించింది. జోరుమీదున్న జొకో పురుషుల సింగిల్స్‌లో సెర్బియన్ స్టార్, టాప్ సీడ్ జొకోవిచ్ జోరు పెంచాడు. రెండో రౌండ్లో అతను 6–3, 7–5, 6–4తో జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఇంటిదారి పట్టించాడు. నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (7/5), 6–4, 5–7, 6–7 (6/8), 6–1తో జెరిమి చార్డి (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ నిషికొరి (జపాన్) 6–3, 7–6 (8/6), 5–7, 5–7, 7–6 (10/7)తో కార్లోవిక్ (క్రొయేషియా)పై చెమటోడ్చి నెగ్గారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆటగాడు అలెక్సి పొపిరిన్ (ఆస్ట్రేలియా) ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)కు షాకిచ్చాడు. 5–7, 4–6, 0–2తో వెనుకబడిన దశలో థీమ్ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 11వ సీడ్ బొర్నా కొరిచ్ (క్రొయేషియా) 6–4, 6–3, 6–4తో ఫుక్సోవిక్స్ (హంగేరి)పై, 12వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 7–6 (7/3), 6–3, 7–6 (7/5)తో మేయర్ (అర్జెంటీనా)పై గెలిచారు. -
జొకోవిచ్‌కు ఝలక్
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ విజేత జ్వెరెవ్ లండన్: ఈ ఏడాదిని గొప్ప విజయంతో ముగించాలని ఆశించిన సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఐదుసార్లు మాజీ చాంపియన్ జొకోవిచ్ ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల జర్మనీ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ 6–4, 6–3తో జొకోవిచ్‌ను ఓడించి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను తొలిసారి గెల్చుకున్నాడు. సెమీస్‌లో రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై సాధించిన విజయం గాలివాటమేమీ కాదని ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్‌ను ఓడించి జ్వెరెవ్ నిరూపించాడు. ‘ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో తెలియడంలేదు. నా జీవితంలోనే అతి పెద్ద విజయమిది. అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడి గెలిచినందుకు అద్భుతంగా అనిపిస్తోంది’ అని ఈ సీజన్‌ను నాలుగో ర్యాంక్‌లో ముగించిన జ్వెరెవ్ వ్యాఖ్యానించాడు. హావిజేత జ్వెరెవ్‌కు 25 లక్షల 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 17 కోట్ల 96 లక్షలు), 1300 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ జొకోవిచ్‌కు 14 లక్షల 32 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 25 లక్షలు), 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. హాఈ టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లో జ్వెరెవ్ 4–6, 1–6తో జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో విజయంతో లీగ్ దశ ఓటమికి బదులు తీర్చుకున్నాడు. హాఅజేయంగా ఫైనల్‌కు చేరిన జొకోవిచ్ ఈ క్రమంలో ఒక్కసారి కూడా సర్వీస్‌ను కోల్పోలేదు. అయితే ఫైనల్లో జ్వెరెవ్ తన తడాఖా చూపించాడు. ఏకంగా నాలుగుసార్లు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. అంతేకాకుండా 10 ఏస్‌లు కూడా సంధించాడు. హా 80 నిమిషాలపాటు సాగిన టైటిల్ పోరులో తొలి సెట్ తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. పదో గేమ్‌లో తన సర్వీస్‌లో మూడు ఏస్‌లు సంధించి గేమ్తోపాటుసెట్ను 6–4తో దక్కించుకున్నాడు. హారెండో సెట్ బ్రేక్ పాయింట్లతో మొదలైంది. తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను జ్వెరెవ్... రెండో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను జొకోవిచ్ బ్రేక్ చేశారు. మూడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన జ్వెరెవ్ ఆ తర్వాతతన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–1తో ముందంజ వేశాడు. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను కళ్లు చెదిరే బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. హా 2008లో జొకోవిచ్ (21 ఏళ్లు) తర్వాత ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు. హా జర్మనీ తరఫున బోరిస్ బెకర్ (1995లో) తర్వాత ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన రెండో జర్మన్ ప్లేయర్ జ్వెరెవ్ కావడం విశేషం. హాఆండీ అగస్సీ (1990లో) తర్వాత టాప్ సీడ్, రెండో సీడ్ క్రీడాకారులను ఓడించి ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచిన మరో ప్లేయర్ జ్వెరెవ్. -
జొకో జోరు కొనసాగేనా..?
నేటి నుంచి యూఎస్ ఓపెన్ గాయంతో నాదల్ దూరం 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై ఫెడరర్, సెరెనా దృష్టి న్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు నేడు (సోమవారం) తెరలేవనుంది. వచ్చే నెల 8 వరకు జరిగే ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ గాయం కారణంగా బరిలోకి దిగడం లేదు. దీంతో 2011లో ఈ టైటిల్ గెలిచిన ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, 2012 నుంచి ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా సాధించలేకపోతున్న మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్ ఈసారి ఆ లోటును తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వింబుల్డన్ విజయంతో జోరు మీదున్న జొకోవిచ్ క్లిష్టమైన డ్రానే ఎదుర్కోనున్నాడు. సన్నాహక మ్యాచ్‌ల్లో భాగంగా ఆడిన మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్స్, సిన్సినాటీ టోర్నీ మూడో రౌండ్లోనే వెనుదిరిగినా ఆ ప్రభావం ఇక్కడ ఉండదని నమ్మకంగా ఉన్నాడు. మరో రెండు నెలల్లో తండ్రి కాబోతున్న ఉత్సాహంతో ఉన్న ఈ సెర్బియా ఆటగాడు అనుకున్న ప్రకారం ముందుకెళితే క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే ఎదురయ్యే అవకాశం ఉంది. సోంగా, వావ్రింకాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ఈ టోర్నీకి ముందు ఫామ్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జొకోవిచ్‌ను ప్రత్యర్థులు తక్కువగా తీసుకోవడానికి లేదు. మైదానంలో పాదరసంలా కదిలే ఈ సెర్బియన్‌కు అనూహ్యంగా పుంజుకునే సత్తా ఉంది. ఇక రికార్డు స్థాయిలో 18వ గ్రాండ్‌స్లామ్ అందుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న రెండో సీడ్ ఫెడరర్‌కు ఆ కల తీర్చుకునే అవకాశాలూ మెరుగ్గానే ఉన్నాయి. ఈ ఏడాది సూపర్ ఫామ్‌తో దూసుకెళుతున్న తనకు డ్రా ప్రకారం సెమీస్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్వార్టర్స్‌లో ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) ఎదురయ్యే అవకాశం ఉంది. వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడినా... ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో టైటిల్స్ గెలిచి ఊపు మీదున్నాడు. అతడితో పాటు ముర్రే నుంచి ఫెడరర్‌కు ముప్పు పొంచి ఉంది. 33 ఏళ్ల ఫెడరర్ ఒకవేళ ఆరోసారి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకుంటే మాత్రం అత్యధిక వయస్సులో గ్రాండ్‌స్లామ్ నెగ్గిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. సెరెనా గెలిస్తే దిగ్గజాల సరసన.. మహిళల విభాగానికొస్తే ప్రస్తుత చాంపియన్, నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ కూడా మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 17 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఈ అమెరికా దిగ్గజం మరో టైటిల్‌తో ఓపెన్ శకంలో 18 టైటిల్స్ నెగ్గి క్రిస్ ఎవర్ట్, మార్టినా నవత్రిలోవాల సరసన నిలిచేందుకు ఎదురుచూస్తోంది. అంతేకాకుండా దాదాపు 40 ఏళ్ల అనంతరం వరుసగా మూడు యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణిగా నిలవాలని అనుకుంటోంది. భవిష్యత్ అమెరికా స్టార్‌గా పిలువబడుతున్న 18 ఏళ్ల టేలర్ టౌన్సెండ్తో తొలి రౌండ్లో సెరెనా తలపడనుంది. అలాగే షరపోవా, ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరిన బౌచర్డ్ (కెనడా) నుంచి పోటీ ఎదురుకానుంది. లీ నా, విక్టోరియా అజరెంకా గాయాల కారణంగా తప్పుకున్నారు.