ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. టోర్నీ నుంచి జకోవిచ్ అవుట్ | Jannik Sinner Ends Novak Djokovics Australian Open Reign To Reach Final, See Details Inside - Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. టోర్నీ నుంచి జకోవిచ్ అవుట్

Published Fri, Jan 26 2024 2:56 PM | Last Updated on Fri, Jan 26 2024 4:43 PM

Jannik Sinner Ends Novak Djokovics Australian Open Reign To Reach Final - Sakshi

ఆస్ట్రేలియన్ ఓపెన్‌-2024లో సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇటలీకి చెందిన యువ ప్లేయర్‌ జనిక్‌ సినర్‌ చేతిలో జకో ఓటమి పాలయ్యాడు.  తద్వారా జకోవిచ్ 33 మ్యాచ్ ల విజయప్రస్థానానికి సినర్ బ్రేక్‌లు వేశాడు . 

తొలి రెండు సెట్లను  1-6, 2-6 తేడాతో సిన్నర్‌కు కోల్పోయిన జకోవిచ్‌.. మూడో సెట్‌లో అద్బుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చి 7-6తో విజయం సాధించాడు. అయితే నిర్ణయాత్మక నాలుగో సెట్‌లో మాత్రం సినర్‌ 6-3తో జకోవిచ్‌ను చిత్తు చేశాడు.

దీంతో జకోవిచ్‌ ఇంటిముఖం పట్టగా.. సినర్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగే ఫైనల్లో 22 ఏళ్ల సిన్నర్... మెద్వెదెవ్/జ్వెరెవ్ లలో ఒకరిని సినర్‌ ఎదుర్కొంటాడు. శుక్రవారం రెండో సెమీఫైనల్లో డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు.
చదవండిAUS vs WI: వారెవ్వా.. క్రికెట్‌ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement