మెల్‌బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్‌లో పెను సంచలనం చోటు చేసుకుంది. టైటిల్ ఫేవరెట్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–6 (7/3), 7–6 (7/4), 4–6, 7–6 (8/6)తో ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించి తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరాడు. 4 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో థీమ్ 14 ఏస్‌లు సంధించి, నాలుగుసార్లు నాదల్ సర్వీసెస్ ను బ్రేక్ చేశాడు.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో టైబ్రేక్‌లలో మాత్రం థీమ్ పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 1–6, 6–3, 6–4, 6–2తో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)పై నెగ్గి శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో థీమ్‌తో ఆడనున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సిమోనా హలెప్ (రొమేనియా) 6–1, 6–1తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ముగురుజా (స్పెయిన్) 7–5, 6–3తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment