Dominic theme
-
మెద్వెదేవ్ మెరిసె...
లండన్: ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ జొకోవిచ్పై... 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రాఫెల్ నాదల్‌పై తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని రష్యా టెన్నిస్ నయాతార డానిల్ మెద్వెదేవ్ నిరూపించాడు. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో 24 ఏళ్ల మెద్వెదేవ్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ మెద్వెదేవ్ 4–6, 7–6 (7/2), 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ‘బెస్ట్ ఆఫ్ త్రీ సెట్స్’ ప్రవేశపెట్టాక సుదీర్ఘంగా సాగిన ఫైనల్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాదితో లండన్‌లో ఏటీపీ ఫైనల్స్ టోర్నీకి తెరపడింది. వచ్చే ఏడాది నుంచి ఇటలీలోని ట్యూరిన్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ► 2 గంటల 43 నిమిషాలపాటు సాగిన ఈ తుది సమరంలో 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదేవ్ 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్ టైబ్రేక్‌లో 0–2తో వెనుకబడిన మెద్వెదేవ్ వరుసగా ఏడు పాయింట్లు గెలిచి టైబ్రేక్‌ను 7–2తో నెగ్గి రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్లో ఐదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదేవ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా తన సర్వీస్‌లను కాపాడుకున్న ఈ రష్యా ప్లేయర్ చివరకు 6–4తో మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో థీమ్ వరుసగా రెండో ఏడాదీ ఈ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ► ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్ నెగ్గినందుకుగాను మెద్వెదేవ్‌కు 15 లక్షల 64 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 58 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్‌కు 8 లక్షల 61 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 37 లక్షలు)తోపాటు 800 ర్యాం కింగ్ పాయింట్లు దక్కాయి. ► 50 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఏకకాలంలో ప్రపంచ నంబర్‌వన్, నంబర్–2, నంబర్–3 ఆటగాళ్లను ఓడించి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా మెద్వెదేవ్ గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలో మెద్వెదేవ్ లీగ్ దశలో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై, సెమీఫైనల్లో రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, ఫైనల్లో మూడో ర్యాంకర్ థీమ్‌పై గెలిచాడు. ► నికొలాయ్ డెవిడెంకో (2009) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన రెండో రష్యా ప్లేయర్ మెద్వెదేవ్. ► ఓవరాల్‌గా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఒకే టోర్నీలో ఏకకాలంలో వరల్డ్ నంబర్‌వన్, నంబర్–2, నంబర్–3 ఆటగాళ్లను ఓడించిన నాలుగో ప్లేయర్ మెద్వెదేవ్. గతంలో నల్బందియాన్ (అర్జెంటీనా–2007 మాడ్రిడ్ ఓపెన్‌లో), జొకోవిచ్ (సెర్బియా–2007 మాంట్రియల్ ఓపెన్‌లో), బోరిస్ బెకర్ (జర్మనీ–1994 స్టాక్‌హోమ్ ఓపెన్‌లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. ► ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది కొత్త చాంపియన్ అవతరించాడు. ఈ టోర్నీలో ఇలా జరగడం ఇది రెండోసారి. మొదటిసారి 1974 నుంచి 1979 వరకు వరుసగా ఆరేళ్లు కొత్త విజేత వచ్చాడు. ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నపుడు నేను ఎంత గొప్ప ఫలితాలు సాధించగలనో ఈ టైటిల్ ద్వారా నిరూపితమైంది. ఈ గెలుపు భవిష్యత్‌లో మరిన్ని మేటి విజయాలకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నాను. –మెద్వెదేవ్ -
ఫైనల్లో డొమినిక్ థీమ్
లండన్: ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో గతేడాది రన్నరప్ థీమ్ 7–5, 6–7 (10/12), 7–6 (7/5)తో గెలుపొందాడు. రెండో సెట్లో నాలుగు మ్యాచ్ పాయింట్లు వదులుకున్న థీమ్... నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో ఒకదశలో 0–4తో వెనుకబడ్డాడు. కానీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన థీమ్ 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ మరో పాయింట్ గెలిచినా... ఆ వెంటనే థీమ్ మరో పాయింట్ సాధించి 7–5తో టైబ్రేక్తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. థీమ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మెద్వెదేవ్ (రష్యా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో థీమ్ ఆడతాడు. -
నాదల్కు థీమ్ షాక్
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో బుధవారం పురుషుల సింగిల్స్‌లో పెను సంచలనం చోటు చేసుకుంది. టైటిల్ ఫేవరెట్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–6 (7/3), 7–6 (7/4), 4–6, 7–6 (8/6)తో ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించి తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరాడు. 4 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో థీమ్ 14 ఏస్‌లు సంధించి, నాలుగుసార్లు నాదల్ సర్వీసెస్ ను బ్రేక్ చేశాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో టైబ్రేక్‌లలో మాత్రం థీమ్ పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 1–6, 6–3, 6–4, 6–2తో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)పై నెగ్గి శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో థీమ్‌తో ఆడనున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సిమోనా హలెప్ (రొమేనియా) 6–1, 6–1తో కొంటావీట్ (ఎస్తోనియా)పై, ముగురుజా (స్పెయిన్) 7–5, 6–3తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గారు. -
థీమ్ నిష్క్రమణ వింబుల్డన్ టోర్నీ
లండన్: గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ వింబుల్డన్ టోర్నమెంట్లో మాత్రం తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ఆస్ట్రియా ఆటగాడు మార్కోస్ బగ్ధాటిస్ (సైప్రస్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 4–6, 5–7తో రెండు సెట్లను చేజార్చుకొని మూడో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో థీమ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 4–6, 3–6, 4–6తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో నాదల్ 6–3, 6–3, 6–2తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై, జ్వెరెవ్ 7–5, 6–2, 6–0తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, డెల్‌పొట్రో 6–3, 6–4, 6–3తో గొజోవిక్ (జర్మనీ)పై గెలిచారు. క్విటోవా ఇంటిముఖం... మహిళల సింగిల్స్‌లో 2011, 2014 చాంపియన్, ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బెలారస్ అమ్మాయి సస్నోవిచ్ 6–4, 4–6, 6–0తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–2, 7–5తో బ్రాడీ (బ్రిటన్)పై, టాప్ సీడ్ సిమోనా హాలెప్ (రొమేనియా) 6–2, 6–4తో కురిమి (జపాన్)పై గెలిచారు. ఫెడరర్ రికార్డు బద్దలు వరుసగా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లు ఆడిన ప్లేయర్‌గా స్పెయిన్ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (వరుసగా 65) పేరిట ఉన్న ఈ రికార్డును వరుసగా 66వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న లోపెజ్ బద్దలు కొట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో లోపెజ్ 6–3, 6–4, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై గెలిచాడు. -
నాదల్కు థీమ్ షాక్
రోమ్: ఈసీజన్లో క్లే కోర్టులపై వరుసగా నాలుగో టైటిల్ సాధించాలని ఆశించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు అనూహ్య ఓటమిఎదురైంది. వరుసగా మోంటెకార్లో, బార్సిలోనా, మాడ్రిడ్ ఓపెన్లలో టైటిల్స్ నెగ్గిన నాదల్ జోరుకు... రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ఆస్ట్రియా యువ ఆటగాడు డొమినిక్ థీమ్ బ్రేక్ వేశాడు. బార్సిలోనా, మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్స్‌లో నాదల్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన థీమ్ మూడో ప్రయత్నంలో మాత్రం నాదల్‌ను బోల్తా కొట్టించడంలో సఫలమయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ థీమ్ 6–4, 6–3తో నాలుగో సీడ్ నాదల్‌పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ సర్వీస్‌ను థీమ్ నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఓటమితో క్లే కోర్టులపై నాదల్ 17 వరుస విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది.