నాదల్‌కు థీమ్ షాక్
రోమ్: ఈసీజన్‌లో క్లే కోర్టులపై వరుసగా నాలుగో టైటిల్ సాధించాలని ఆశించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌కు అనూహ్య ఓటమిఎదురైంది. వరుసగా మోంటెకార్లో, బార్సిలోనా, మాడ్రిడ్ ఓపెన్‌లలో టైటిల్స్ నెగ్గిన నాదల్ జోరుకు... రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో ఆస్ట్రియా యువ ఆటగాడు డొమినిక్ థీమ్ బ్రేక్ వేశాడు. బార్సిలోనా, మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్స్‌లో నాదల్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన థీమ్ మూడో ప్రయత్నంలో మాత్రం నాదల్‌ను బోల్తా కొట్టించడంలో సఫలమయ్యాడు.
శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ థీమ్ 6–4, 6–3తో నాలుగో సీడ్ నాదల్‌పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ సర్వీస్‌ను థీమ్ నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఓటమితో క్లే కోర్టులపై నాదల్ 17 వరుస విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది.