మెల్‌బోర్న్: కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో రాఫెల్ నాదల్ (స్పెయిన్)... అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నాదల్ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలనే పట్టుదలతో నొవాక్ జొకోవిచ్... రేపటి నుంచి మొదలయ్యే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నారు. ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో బ్రిటన్‌కు చెందిన 40వ ర్యాంకర్ జాక్ డ్రేపర్‌తో ఆడనున్నాడు.
మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ 75వ ర్యాంకర్ రొబెర్టో బేనా (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. జొకోవిచ్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గగా అందులో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న జొకోవిచ్ ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిస్తే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. నాదల్, జొకోవిచ్ కాకుండా ఏడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment