Tennis season
-
Australian Open 2023: నాదల్, జొకోవిచ్లపైనే దృష్టి
మెల్బోర్న్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో రాఫెల్ నాదల్ (స్పెయిన్)... అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నాదల్ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలనే పట్టుదలతో నొవాక్ జొకోవిచ్... రేపటి నుంచి మొదలయ్యే టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నారు. ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సోమవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రిటన్‌కు చెందిన 40వ ర్యాంకర్ జాక్ డ్రేపర్‌తో ఆడనున్నాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 75వ ర్యాంకర్ రొబెర్టో బేనా (స్పెయిన్)తో జొకోవిచ్ తలపడతాడు. జొకోవిచ్ 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గగా అందులో 9 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న జొకోవిచ్ ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిస్తే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. నాదల్, జొకోవిచ్ కాకుండా ఏడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగనున్నారు. -
సంచలనాలతో షురూ
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. టోర్నీ మొదటి రోజు ఆదివారం మహిళల సింగిల్స్‌లో 2016 చాంపియన్, పదో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), ఆరో సీడ్ ఆన్స్ జెబర్ (ట్యూనిసియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 46వ ర్యాంకర్ కయా కనెపి (ఎస్టోనియా) 2–6, 6–3, 6–4తో పదో ర్యాంకర్ ముగురుజాను ఓడించగా... ప్రపంచ 52వ ర్యాంకర్ మాగ్దా లినెట్ (పోలాండ్) 3–6, 7–6 (7/4), 7–5తో ఆరో ర్యాంకర్ ఆన్స్ జెబర్పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. 2011 జూనియర్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఆన్స్ జెబర్ ఇటీవల మాడ్రిడ్ ఓపెన్–1000 టోర్నీలో టైటిల్ సాధించడంతోపాటు ఇటాలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. క్లే కోర్టులపై 17 విజయాలు నమోదు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జెబర్ను ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా పరిగణించారు. అయితే మాగ్దా లినెట్‌తో 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జెబర్ 47 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. పురుషుల సింగిల్స్‌లో 2018, 2019 రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమై 194వ ర్యాంక్‌కు పడిపోయిన థీమ్ 3–6, 2–6, 4–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. -
సంప్రాస్ సరసన జొకోవిచ్
పారిస్: ఈ ఏడాది అద్భుతంగా రాణించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన చిన్ననాటి ఆరాధ్య క్రీడాకారుడు పీట్ సంప్రాస్ సరసన నిలిచాడు. అత్యధికసార్లు పురుషుల టెన్నిస్ సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా ఇన్నాళ్లూ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. గతంలో సంప్రాస్ 1993 నుంచి 1998 వరకు వరుసగా ఆరేళ్లపాటు సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్‌గా ముగించాడు. 33 ఏళ్ల జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్లను టాప్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ సరసన చేరాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20 చొప్పున) సాధించిన మేటి క్రీడాకారులు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) గతంలో ఐదుసార్లు చొప్పున సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించారు. గతేడాది వరకు ఫెడరర్, నాదల్ సరసన నిలిచిన జొకోవిచ్ ఈ ఏడాది వారిద్దరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిపోయాడు. కరోనా వైరస్ కారణంగా కుదించిన ఈ టెన్నిస్ సీజన్లో జొకోవిచ్ మొత్తం 39 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అంతేకాకుండా నాలుగు టైటిల్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ‘టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి సంప్రాస్‌ను ఆరాధించేవాణ్ని. ఇప్పుడు అతని రికార్డును సమం చేసినందుకు నా కల నిజమైంది’ అని జొకోవిచ్ అన్నాడు. కెరీర్లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ గత సెప్టెంబర్‌లో అత్యధిక వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాలో సంప్రాస్ (286 వారాలు)ను మూడో స్థానానికి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే 294 వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్న జొకోవిచ్ వచ్చే సీజన్లోనూ నిలకడగా ఆడితే మార్చి తొలి వారంలో... అత్యధిక వారాలు నంబర్‌వన్ స్థానంలో ఉన్న ప్లేయర్ ఫెడరర్ (310 వారాలు) రికార్డును కూడా బద్దలు కొడతాడు. నవంబర్ 15న లండన్‌లో మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించినందుకు అతనికి అధికారిక ట్రోఫీని ప్రదానం చేస్తారు. -
మరో టాప్ సీడ్ ఔట్
యూఎస్ ఓపెన్ లో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ కొరోలినా పిస్కోవా(చెక్) తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది. తొలి రౌండ్ మ్యాచ్ లో అమెరికా క్రీడాకారిణి టటిస్విలి కొరోలినాకు షాకిచ్చింది. 6-2, 6-1, స్కోర్ తో బోల్తాకొట్టించింది. గంటలోపే ముగిసిన మ్యాచ్ లో కొరోలినా సర్వీస్ ను 5సార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ మొత్తానికి 3 డబుల్ ఫాల్ట్ లు చేసిన కరోలీనా తగిన మూల్యం చెల్లించుకుంది. కాగా సోమా వారం ప్రారంభమైన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఇద్దరు టాప్ సీడ్ లు తొలి రౌండ్ లోనే వెనుదిరిగి నట్లైంది. -
తొలిరౌండ్లోనే ఓడిన ఇవనోవిచ్
- ఏడో సీడ్‌కు షాక్ ఇచ్చిన సిబుల్కోవా - యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 3-6, 6-3తో ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిబుల్కోవా ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసినప్పటికీ... ఇనోవిచ్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు ఇవనోవిచ్ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడటం ఇవనోవిచ్కిది రెండోసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఈ సెర్బియా సుందరి తొలి రౌండ్లోనే నిష్ర్కమించింది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-3తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 13వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-3, 6-3తో తెలియానా పెరీరా (బ్రెజిల్)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 14వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), 17వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో గాఫిన్ 6-4, 6-1, 6-2తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, దిమిత్రోవ్ 6-4, 6-2, 6-4తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. నేటి మ్యాచ్‌లు రాత్రి గం. 8.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం