యూఎస్ ఓపెన్ లో మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఇవాళ జరిగిన మ్యాచ్ లో ఎనిమిదో సీడ్ కొరోలినా పిస్కోవా(చెక్) తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టింది. తొలి రౌండ్ మ్యాచ్ లో అమెరికా క్రీడాకారిణి టటిస్విలి కొరోలినాకు షాకిచ్చింది. 6-2, 6-1, స్కోర్ తో బోల్తాకొట్టించింది. గంటలోపే ముగిసిన మ్యాచ్ లో కొరోలినా సర్వీస్ ను 5సార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ మొత్తానికి 3 డబుల్ ఫాల్ట్ లు చేసిన కరోలీనా తగిన మూల్యం చెల్లించుకుంది. కాగా సోమా వారం ప్రారంభమైన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఇద్దరు టాప్ సీడ్ లు తొలి రౌండ్ లోనే వెనుదిరిగి నట్లైంది.
మరో టాప్ సీడ్ ఔట్
Published Tue, Sep 1 2015 8:19 PM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM
Advertisement
Advertisement