మెల్‌బోర్న్ : గతేడాది గ్రాండ్‌స్లామ్ చివరి టోర్నీ యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా.. ఈ ఏడాది సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సైతం అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఒసాకా 7-6(7/2), 5-7, 6-4 తేడాతో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఇరువురు క్రీడాకారిణులు మధ్య హోరాహోరీగా సాగిన తుది పోరులో ఒసాకానే విజయం వరించింది. తొలి సెట్‌ను టైబ్రేక్ ద్వారా గెలుపొందిన ఒసాకా.. రెండో సెట్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ ఆసక్తికరంగా మారింది. ఓవరాల్‌గా 116 పాయింట్లను ఒసాకా సాధించి విజేతగా నిలవగా, 112 పాయింట్లను క్విటోవా సాధించారు. ఇందులో ఒసాకా 9 ఏస్‌లను సంధించగా, క్విటోవా 5 ఏస్‌లను మాత్రమే సంధించి వెనుకబడింది. ఇక ఇరువురు తలో నాలుగుసార్లు డబుల్ ఫాల్ట్స్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment