న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ జొకోవిచ్‌ను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. అందులో ఒకటి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) కాగా... రెండోది పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నిలువడం. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్‌ను గెలిచాడు.
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) సరసన చేరాడు. యూఎస్ ఓపెన్‌లోనూ జొకోవిచ్ గెలిస్తే 21 టైటిల్స్‌తో కొత్త చరిత్రను సృష్టిస్తాడు. అంతేకాకుండా దిగ్గజ ప్లేయర్ రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలుస్తాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున జరిగే తొలి రౌండ్‌లో క్వాలిఫయర్ హోల్గర్ రునే (డెన్మార్క్) తో జొకోవిచ్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment