సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజురోజుకూ విస్తరిస్తోంది. మన దేశంలో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. వ్యాక్సిన్లు వేస్తున్నా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే థర్డ్..ఫోర్త్.. ఫిఫ్త్ ఇలా ఎన్ని వేవ్‌లు వచ్చినా ఎదుర్కొనేలా యుద్ధానికి సన్నద్ధం కావా ల్సిందేనని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రాలకు సూచించింది.
ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు, మందులు, ఆక్సిజన్ సరఫరా, ఇతర వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని కోరింది.
రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలు..
♦గ్రామాలు, నగరాల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను మరింత బలోపేతం.
♦జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో కొత్తగా క్రిటికల్ కేర్ సంబంధిత పడకల ఏర్పాటు.
♦వ్యాధి నిర్ధారణ లేబరేటరీ వ్యవస్థను బలోపేతం చేయడానికి మెట్రోపాలిటన్ యూనిట్ల ఏర్పాటు.
♦ఇప్పటికే ఉన్న వైరల్ డయాగ్నోస్టిక్ అండ్ రీసెర్చ్ ల్యాబ్‌ల (వీఆర్‌డీఎల్) బలోపేతం.
♦నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వన్ హెల్త్ ఏర్పాటు.
♦విమానాశ్రయాల వంటి ఇంటర్నేషనల్ పాయింట్స్ ఆఫ్ ఎంట్రీ (పీఓఈ)ల వద్ద పబ్లిక్ హెల్త్ యూనిట్ల బలోపేతం. తద్వారా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడం.
♦కరోనా నిర్ధారణ పరీక్షల రేట్లు, ఆసుపత్రుల్లో పడకల ధరలపై చేరికల ఆధారంగా పరిమితులు విధించడం.
♦ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరులను సంసిద్ధం చేసుకోవడం. ఇతర వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులు తదితరులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం.
♦కోవిడ్ మేనేజ్‌మెంట్ విధుల్లో మెడికల్ ఇంటర్న్‌ల సేవలను ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించాలి.
♦ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులను టెలి–కన్సల్టేషన్, తేలికపాటి కోవిడ్ కేసుల పర్యవేక్షణ వంటి సేవలను అందించడానికి ఉపయోగించుకోవచ్చు.
♦మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ ఫైనలియర్ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలి.
♦కొత్త నియామకాలు జరిగే వరకు సీనియర్ రెసిడెంట్ల సేవలను వినియోగించుకోవాలి.
♦బీఎస్సీ, జీఎన్‌ఎం అర్హత పొందిన నర్సులను పూర్తి సమయం కోవిడ్ నర్సింగ్ విధుల్లో ఉపయోగించుకోవాలి.
♦జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించుకోవాలి.
♦గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో సేవలందించే నిపుణులైన వైద్యులకు భత్యం కోసం అవసరమైన ఆర్థిక సాయం చేయాలి.
♦ఆక్సిజన్ ప్లాంట్ల స్థాపన విషయంలో రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందుతుంది.
♦ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగ ఆడిట్‌ను చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment