
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించకపోతే, మూసేయాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి బుధవారం రాజ్యసభకు తెలిపారు. సంస్థ ఉద్యోగులు అందరికీ సానుకూల ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎయిర్ ఇండియా తన ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని, ప్రైవేటీకరించేంత వరకు ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తీసివేయడం జరగదని వివరించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అంతర్జాతీయంగా విమానాల రద్దీ తగ్గుముఖం పట్టినా, మన దేశంలో అంత ప్రతికూల పరిస్థితి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment