న్యూఢల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి 100శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్‌దీప్ సింగ్ పురి లోక్‌సభలో గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజంను (ఏఐఎస్‌ఎఎమ్) పునర్నిర్మించామని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియాను 100శాతం విక్రయించడాన్ని ఏఐఎస్‌ఎఎమ్ స్వాగతించిందని మంత్రి లోక్‌సభలో తెలిపారు.
విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) రూ.25,000కోట్లు కోరిందని మంత్రి తెలిపారు. 2018-19 సంవత్సరానికి ఎయిర్ ఇండియా రూ.8,556.35కోట్లు నష్ట పోయిందని అన్నారు. కాగా, రూ.50వేల కోట్ల అప్పులతో ఎయిర్ ఇండియా సతమవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియాకు మోయలేనంత రుణభారమే పెద్ద సమస్య అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment