సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న కార్మికుల కోసం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు విమానాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలు, జీతాలు లేక అక్కడ భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే కార్మికుడు మస్కట్‌లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అయితే మూడు నెలలుగా పని, ఆహారం, జీతాలు లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వీడియో తీసి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు. భారత్‌కు వద్దామనుకుంటే హైదరాబాద్‌కు విమానాలు లేక కార్మికులు అవస్థలుపడుతున్నారని పేర్కొన్నాడు.
Request Hon’ble Civil Aviation Minister @HardeepSPuri Ji to kindly arrange for flights from Muscat to Hyderabad 🙏 Apparently fellow Indians are in distress without wages & essentials https://t.co/wu3xc8BSS9
— KTR (@KTRTRS) June 6, 2020
Comments
Please login to add a commentAdd a comment