సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటుని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనను కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి ఎగతాళి చేశారు. వారు చేసిన ఆమోదయోగ్యం కానీ రాజకీయ ప్రసంగంపై కొంత ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్‌కు సలహా ఇచ్చారు. రాహాల్ గాంధీ సావర్కర్ వంటి వ్యక్తుల గురించి ప్రస్తావించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అసలు సావర్కర్ వంటి వ్యక్తుల కృషి గురించి మీకు తెలుసా? అని ప్రశ్నించారు.
మీరు గుర్రపు పందెంలో పరిగెత్తించేందుకు గాడిదను ఉపయోగిస్తున్నారంటూ రాహుల్‌ని దుయ్యబట్టారు. భారతదేశ ప్రజలు వారికి తగిన సమాధానం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ దీని గురించి కోర్టులో పోరాడాలి గానీ ఇలా కాదన్నారు. మీరు మహాభారతం, సావర్కర్‌ల గురించి ఎందుకు చెప్పడం అంటూ ఎద్దేవా చేశారు. అయినా కోర్టు గాంధీని దోషిగా నిర్థారించింది. ఆ తర్వాత వారు చేయాల్సిన ప్రక్రియలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిపై దృష్టి సారించక ఎందుకు ఇవన్నీ అంటూ మండిపడ్డారు.
అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా విపక్షాలన్ని అరుదైన విధంగా ఐక్యతను ప్రదర్శిస్తూ.. రాహుల్ గాంధీపై కేంద్రం తీసుకున్న చర్యను తప్పుపట్టడమే గాక నిరసనలు చేపట్టాయి. తృణమాల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రత్యర్థులు, మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఈ నిరసనలో పాల్లొన్నాయి కూడా. అదానీ హిండెన్ బర్గ్ సమస్యపై వస్తున్న ప్రశ్నలు ప్రధాని మోదీని, బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, ఆ క్రమంలోనే రాహుల్‌ని సైలెంట్ చేసేందుకు ఇలా అనర్హత కుట్రకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
#WATCH | On Opposition's protest over disqualification of Rahul Gandhi, Union Minister Hardeep Singh Puri says, "...You are getting an ass to run a horse's race...They really deserve to do some serious introspection...People of India would judge them for what they are...Fight… pic.twitter.com/2Yjq3ybcWG
— ANI (@ANI) March 27, 2023
(చదవండి: సత్యం, ధైర్యం, త్యాగం మా వారసత్వం! ప్రియాంక ఉద్వేగభరిత ప్రసంగం)
Comments
Please login to add a commentAdd a comment