
సాక్షి, ఢిల్లీ: ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన పది మంది రాజ్యసభ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాజ్యసభ ఛాంబర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేంద్రమంత్రి హార్‌దీప్ సింగ్ పూరీ కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పది మంది సభ్యులలో కర్ణాటకకు చెందిన నారాయణ కొరగప్ప. చదవండి: (రాజీవ్ గాంధీ విగ్రహానికి మసి పూశారు)
బ్రిజ్లాల్, గీతా అలియాస్ చంద్రప్రభా, రాంజీ, హార్డ్వర్ దుబే, హర్దీప్ సింగ్ పూరి, నీరజ్ శేఖర్, బి ఎల్ వర్మ ,రామ్ గోపాల్ యాదవ్ వీరందరు యూపీ నుంచి ఎన్నికైనారు. నరేష్ బన్సల్ ఉత్తరఖండ్ కి చెందినవారు. కొత్తగా, తిరిగి ఎన్నికైన సభ్యులను స్వాగతించిన రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు వారికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దల సభకు ఎన్నికైన ఎంపీలపై ప్రజలకు అంచనాలు అధికంగా ఉంటాయని, వారి ఆకాంక్షలకు మించి పనిచేయాలని సూచించారు.
రాజ్యసభ పెద్దల సభ కావడంతో, యువకులకు, ప్రజలకు మార్గనిర్ధేశం చేసేందుకు సభ్యులు ప్రవర్తన ఉన్నత ప్రమాణాలతో పాటించడం అత్యవసరం వెల్లడించారు. సభ సంప్రదాయాలను అందరు గౌరవించాలని ఆయన కోరారు. కోవిడ్ మహమ్మారి గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఛైర్మన్, ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సభ్యులకు పిలుపునిచ్చారు.మాస్క్ ధరించడం, సురక్షితమైన దూరాన్ని పాటించడం తప్పనిసరి అని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సామాజిక దూరం కన్నా సురక్షిత దూరం అనే పదాన్ని తాను ఇష్టపడుతున్నానని పేర్కొన్నారు.