సాక్షి, న్యూఢిల్లీ: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టును ‘ఉడాన్’ పథకంలో చేర్చాలని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీని కోరినట్లు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. అదే విధంగా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.2537.81 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రితో సోమవారం భేటీ అయిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. (మున్సిపాలిటీల్లో వార్డుకో ఆఫీసర్!)
ఈ సందర్భంగా.. కేసీఆర్ సర్కారు ప్రతిపాదించిన నూతన పురపాలక చట్టంలోని అంశాలను హర్దీప్‌సింగ్ పూరికి వివరించినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఆయన.. అక్టోబర్‌లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని సూచించినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు స్వచ్ఛ భారత్, అమృత్ పథకం నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ రూ.784 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వాల్సిన రూ.1184 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment