సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రెండోరోజు శనివారం కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశం అయ్యారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గృహ నిర్మాణం, పౌర విమానయాన రంగాలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లపై చర్చించారు. పట్టణాభివృద్ధికి నిధులు, వరంగల్, సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.
అలాగే రాష్ట్రంలో నూతనంగా ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా విమానాశ్రయాల అభివృద్ధి కోసం భూమిని గుర్తించి, ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్ హైదరాబాద్‌లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కోరిన విషయం విదితమే.
1. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ (బ్రౌన్ ఫీల్డ్)
2. మామునూర్ (వరంగల్) బ్రౌన్ ఫీల్డ్
3. ఆదిలాబాద్ (గ్రీన్ ఫీల్డ్)
4. జక్రాన్ పల్లి, నిజామాబాద్ (గ్రీన్ ఫీల్డ్)
5. గుడిబండ, మహబూబ్ నగర్ (గ్రీన్ ఫీల్డ్)
6. భద్రాద్రి కొత్తగూడెం (గ్రీన్ ఫీల్డ్)
Comments
Please login to add a commentAdd a comment