
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు(గురువారం) సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి పయనమయ్యారు సీఎం జగన్. తొలుత తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.
రాత్రి 7.30 గంటల సమయలో సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి 1 జన్‌పథ్ నివాసంలో బస చేస్తారు సీఎం జగన్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో సీఎం జగన్ భేటీ కానున్నట్టు సమాచారం. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.