
Updates
► ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను సీఎం జగన్ కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. శుక్రవారం(రేపు) ఉదయం విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరిగే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ
►రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ
►పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని వినతి
►సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి
►కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ కానున్న సీఎం జగన్
►రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చ
►ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
►సాయంత్రం 6:30కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం
►రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించనున్న సీఎం
►రేపు వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో పాల్గొననున్న సీఎం
►రేపు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్న సీఎం జగన్
► సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు (గురువారం, శుక్రవారం) దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. నేటి సాయంత్రం 6:30 కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై కేంద్రమంత్రితో చర్చించనున్నారు.
అదే విధంగా శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
చదవండి: నిధులు అడగొద్దని మాకేం చెప్పలేదు
Comments
Please login to add a commentAdd a comment