14:52PM
►ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరారు. అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.
13:53PM
► కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ అయిన సీఎం వైఎస్ జగన్.
►సుమారు అరగంట పాటు కొనసాగిన భేటీ
►విద్యుత్ బకాయిలపై చర్చ
12:30PM
► రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీఎం జగన్ భేటీ
► మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిసిన సీఎం జగన్
11:19AM
► మధ్యాహ్నం 12:30 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతొ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు.
11:17AM
► మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఆర్.కే. సింగ్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6వేల కోట్ల విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది.
11:04AM
► ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్బంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే, ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు.
► పోలవరం, రీసోర్స్ గ్యాప్ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని సీఎం కోరారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.2900 కోట్లు ఖర్చు చేశాము. వీటిని రీయింబర్స్ చేయాలని మోదీని సీఎం జగన్ కోరారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు.
► టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్ట్ వ్యయం రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలిపాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు. ఇప్పటి వరకు చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీసోర్స్ గ్యాప్ కింద ఏపీకి రావాల్సిన రూ. 32,625.25 కోట్లు మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు.
► తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని కూడా ప్రధాని వద్ద సీఎం జగన్ ప్రస్తావించారు. రూ. 6,756 కోట్ల బకాయిలు ఉన్నాయని, 8 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఈ క్రమంలోనే విభజన హామీలు అమలు చేయాలని కోరారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరారు. ప్రత్యేక హోదాతోపాటు హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో 12 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ వినతి పత్రం అందజేశారు.
10:30AM
►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రధానితో భేటీలో సీఎం జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.
కాగా, ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధుల విడుదల, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, నిధుల విడుదల తదితర విషయాల గురించి మాట్లాడనున్నారు. అలాగే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌కర్‌లను కూడా సీఎం వైఎస్ జగన్ కలువనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment