సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రితో చర్చించా. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరాను. వీటిపై ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు’’ అని సీఎం వైఎస్ జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్న సమయంలో సుమారు గంట పాటు ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విభజన చట్టంలో హామీలలో కీలకాంశాలు ఇంకా నెరవేరలేదని, త్వరగతిన వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారితో చర్చించడం జరిగింది. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతో పాటు, పలు పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ప్రధాని గారు సానుకూలంగా స్పందించారు. pic.twitter.com/20WiwfSlXQ
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2022
ఏపీకి ప్రత్యేక హోదా అంశం, కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంతో పాటు పెండింగ్ బకాయిల విడుదలలో జాప్యం, జాతీయ ఆహార భద్రతా చట్టంలో నిబంధనలు, తెలంగాణ డిస్కం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు మెట్రో రైల్వే లైన్, కడప స్టీల్ ప్లాంట్ అంశాలను సైతం ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వీటికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment