సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్ జోనల్ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు-వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ కూడా పెండింగులో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం మరోమారు హోంమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీంతో పాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపైనకూడా సీఎం, హోంమంత్రితో చర్చించారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం జగన్ తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా కొనసాగిన ముఖ్యమంత్రి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ , గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment