
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉన్నారు.