న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇరువురి మధ్య దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఢిల్లీకి వచ్చారు.
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ
ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు అనుమతులే ప్రధానాంశంగా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
పర్యటనలో భాగంగానే ఒడిశా మంత్రి అశోక చంద్ర సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. హాకీ ప్రపంచకప్-2023ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరపున ఈ మ్యాచ్‌లకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు.
చదవండి: (Prem Sagar Reddy: అగ్రరాజ్యంలో ఆస్పత్రి కట్టిన రైతు బిడ్డ)
Comments
Please login to add a commentAdd a comment