
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. మంగళవారం సీఎం రేవంత్.. ఢిల్లీ వెళ్లనున్నట్లు సీఎంవో కార్యాలయం పేర్కొంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మిగితా ఆరుగురు మంత్రుల జాబితాకు సంబంధించి సీఎం రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించన్నుట్లు సమాచారం. దీంతో కొత్త మంత్రుల కేటాయింపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.