( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. విభజన సమస్యలపై ప్రధానంగా భేటీ సాగింది. విభజన సమస్యలపై త్వరలోనే ఇద్దరు సీఎస్‌లను పిలిచి మాట్లాడతానని అమిత్‌షా హామీ ఇచ్చారు. నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరోల కోసం పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి ఉన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ, సాంకేతిక అనుమతులు ఇవ్వాలని వినతించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్.. ఈ పర్యటనలో భాగంగా ఫైనాన్స్, హెల్త్, ఇరిగేషన్, పరిశ్రమలతో పాటు పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment