ఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా, ఇప్పుడు ఆయన తనయుడు నారా లోకేష్ ఢిల్లీలో సానుభూతి కోసం చక్కర్లు కొడుతున్నారు. కేంద్ర పెద్దలు కలిసేందుకే ఢిల్లీకి వెళ్లారా అనే దానిపై పూర్తి స్పష్టత లేకపోయినా అక్కడ జాతీయ మీడియాను ఆకర్షించే యత్నం చేసి విఫలమయ్యాడు లోకేష్.
ఢిల్లీకి వెళ్లిందే తడువుగా జాతీయ మీడియాను ఇంటర్వ్యూల కోసం రమ్మని ఫోన్లు చేయిస్తున్నాడు. కానీ జాతీయ మీడియా మాత్రం చంద్రబాబు అంశంపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అందులోనూ నారా లోకేష్ అంటే పూర్తి అయిష్టతనే కనబరుస్తోంది నేషనల్ మీడియా. తనకు ప్రైమ్ టైం లైవ్ ఇంటర్వ్యూలు కావాలని విన్నవించినా, రికార్డింగ్ ఇంటర్వ్యూలతో మాత్రమే సరిపెట్టేసింది. లైవ్ ఇంటర్వ్యూలు లోకేష్‌తో నిర్వహించడానికి ఆసక్తే కనబరచడం లేదు జాతీయ మీడియా.
అదే సమయంలో చంద్రబాబు కేసులపై పలువురు సీనియర్ లాయర్లతోనూ లోకేష్ చర్చలు జరిపారు. ప్రధానంగా సుప్రీంకోర్టు లాయర్ల దగ్గరకు ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించడం లేదు. ఈ కేసు నుంచి, జైలు నుంచి తండ్రిని ఎలాగైనా బయటపడేయాలని చూస్తున్న లోకేష్‌కు ఇప్పుడు అది సవాల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment