Oct 13th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Supreme Court Hearing On Chandrababu Naidu Leave Petition And Other Cases, Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Oct 13th 2023 : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Fri, Oct 13 2023 7:22 AM | Last Updated on Mon, Oct 16 2023 8:36 AM

Supreme Court Hearing On Chandrababu Case Live Updates - Sakshi

LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates

21:20 PM, అక్టోబర్‌ 13, 2023
నారా వారి డ్రామాలు అట్టర్‌ ఫ్లాప్‌ 
►కోర్టులో చంద్రబాబుకు ఇవాళ కూడా ఎదురు దెబ్బలే
►ఒక్క అంగళ్లు విధ్వంసం కేసులో మాత్రం ముందస్తు బెయిల్‌
►సుప్రీంలో పిటిషన్లు మంగళవారానికి వాయిదా
► హైకోర్టులో స్కిల్‌ స్కామ్‌పై ఉండవల్లి పిటిషన్‌ విచారణ
►44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
►చంద్రబాబు బరువు తగ్గారంటూ భార్య భువనేశ్వరి డ్రామా
►బరువు ఒక కేజీ దాకా.. పెరిగినట్లు జైళ్ల శాఖ రికార్డులు
► జైల్లో తండ్రి భద్రతకు ముప్పు అంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ నాటకాలు
► ఆరోపణలు ఖండించి మరీ.. తప్పుడు ప్రచారాలపై వార్నింగ్‌ ఇచ్చిన జైళ్ల శాఖ

20:19 PM, అక్టోబర్‌ 13, 2023
ఫైబర్‌ నెట్‌ కేసులో సీఐడీ మెమోదాఖలు
ఫైబర్‌ నెట్‌ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
బుధవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయడం లేదని మెమో
ఈ కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రస్తావన 
► పిటిషన్‌ మంగళవారానికి వాయిదా వేయడంతో.. సోమవారం చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారన్న ఆయన లాయర్‌ లూథ్రా
ఇప్పుడే అరెస్ట్‌ చేయబోమన్న సీఐడీ తరపు న్యాయవాది
చంద్రబాబు అరెస్ట్‌ సోమవారం ఉండదని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ స్పష్టీకరణ
అందుకు తగ్గట్లే.. బుధవారం వరకు అరెస్ట్‌ ఉండదని ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
పీటీ వారెంట్‌ విచారణ కోసం.. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు 

20:11 PM, అక్టోబర్‌ 13, 2023
చంద్రబాబు అనారోగ్యం ఓ డ్రామా
చంద్రబాబు నిర్దోషి అని అయన తరపు లాయర్లు చెప్పలేని స్థితిలో ఉన్నారు
నారా లోకేష్‌ను అమిత్ షానే పిలిపించుకుని మాట్లాడినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు విషయంలో వ్యూహం మార్చుకుంది
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో కొత్త డ్రామాలు ఆడుతున్నారు
జైలులో దోమలు, కలుషిత నీరు వంటి అంశాలు లేవనెత్తుతోంది
లోకేష్ చెప్పేదానిలో వాస్తవాలు ఎంతో అందరికీ తెలుసు
టీడీపీ న్యాయవాదులు ప్రభుత్వ లాయర్లపై వ్యవహరించే తీరు చాలా దారుణం
ప్రభుత్వ లాయర్ల పై అనుచితంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి
::: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

18:25 PM, అక్టోబర్‌ 13, 2023
మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు: జైళ్ల శాఖ డీఐజీ
బాబుకు భద్రతా లోపాలు ఉన్నాయన్న వార్తలు నమ్మొద్దు
జైల్‌లోకి డ్రోన్‌ వచ్చిందన్న వార్త అవాస్తవం
చంద్రబాబుకి ఏ వైద్య పరీక్షలు చేసినా.. ఆ వివరాలు చెబుతాం
చంద్రబాబు ఒక రిమాండ్‌ ఖైదీ మాత్రమే!
జైల్‌ నిబంధనల ప్రకారం.. ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేయలేం
కోర్టు నిబంధనలు మాత్రం పాటిస్తాం
మా నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం
ఇకపై ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే వారిపై కేసులు పెడతాం
ఇప్పటికే తప్పుడు వార్తలు రాయొద్దని చాలాసార్లు చెప్పాం
జైల్‌లోకి రావడానికి యత్నించారనే టీడీపీ నేతల్ని అరెస్ట్‌ చేశాం
:::కోస్తా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ పేర్కొన్నారు.

18:14 PM, అక్టోబర్‌ 13, 2023
లోకేష్‌ ట్వీట్‌ పూర్తిగా అవాస్తవం: జైళ్ల శాఖ డీఐజీ
చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆందోళనల గురించి జైళ్ల శాఖ డీఐజీ ప్రెస్‌మీట్‌
చంద్రబాబుకి రోజుకు మూడుసార్లు వైద్యపరీక్షలు చేస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు 67 కేజీల బరువున్నారు.
బయట ప్రచారం చేస్తున్నట్లుగా అంత సీరియస్‌ ఏమీ లేదు.
యనమల ఏం మాట్లాడారో మాకు తెలియదు
చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు.
ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్‌కు, పేషెంట్‌కు మధ్య ఉండే ప్రైవసీ.
చంద్రబాబుకు థ్రెట్‌ అంటూ నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌ పూర్తిగా అవాస్తవం.
ఏసీ వసతి గురించి జైళ్ల మ్యాన్యువల్‌లో లేదు
వాటర్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే.. అందరు ఖైదీలకు సోకాలి కదా
:::కోస్తా జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ పేర్కొన్నారు.

16:50 PM, అక్టోబర్‌ 13, 2023
జైల్లో చంద్రబాబు బరువు పెరిగారు

 చంద్రబాబు ఐదు కేజీల బరువు తగ్గారంటూ భార్య భువనేశ్వరి ఆరోపణలు
 చంద్రబాబు ఆరోగ్యం, సౌకర్యాలపై స్పందించిన జైళ్ల శాఖ
జైలు అధికారిక రిజిస్టర్ ప్రకారం చంద్రబాబు జైల్లోకి అడుగు పెట్టినపుడు ఆయన బరువు 66 కేజీలు
ప్రస్తుతం ఒక కేజీ పెరిగి 67 కేజీలకు చేరుకున్నారు
భద్రతాపరంగా ఆరోగ్యపరంగా చంద్రబాబు జైల్లో ఏపరంగా చంద్రబాబుకు ఏ రకమైన ఇబ్బందులు లేవు
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఆరోగ్యపరంగా భద్రత పరంగా ఎటువంటి సమస్య లేదు
మొదటినుంచి ఆయనను హై ప్రొఫైల్ ఖైదీగానే ట్రీట్ చేస్తున్నాము
తాగునీరు భోజన విషయంలో నిబంధనల మేరకు వ్యవహరిస్తున్నాం
ఆయనకు స్కిన్ సమస్య రాగానే ప్రభుత్వ వైద్యులతో నిబంధనల ప్రకారమే వైద్యం చేయించాం
జైల్లో తాగునీటికి సంబంధించి ఎటువంటి సమస్య లేదు 
ప్రస్తుతం జైల్లో ఉన్న 2100 మంది ఖైదీలకు ట్యాంకుల్లో ఉన్న నీటినే సరఫరా చేస్తున్నాం
జైలు సిబ్బంది ప్రతిరోజు  చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు
చంద్రబాబు ఆరోగ్యం బయటనుంచి చేసే ఆరోపణలు కరెక్ట్ కాదు
బయట నుంచి వచ్చిన భోజనాన్ని  జైలు సిబ్బంది పరీక్షించిన  తర్వాతే చంద్రబాబుకు పెడుతున్నారు
చంద్రబాబు జైల్లో పూర్తిస్థాయి భద్రత ఉంది
ఆయన ఉంచిన బేరక్ చాలా విశాలంగా ఉంటుంది
చంద్రబాబు డిహైడ్రైజేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ కూడా అందజేస్తున్నాం
:::కోస్తా జిల్లాల జైళ్ళశాఖ డీఐజీ రవికిరణ్

16:00 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో స్కిల్ కేసులో CID లాయర్ లేవనెత్తిన కీలక అంశాలేంటంటే.?
► 17ఏ అన్నది అవినీతికి రక్షణ కాకూడదు: రోహత్గీ
► అవినీతిపరులను రక్షించేందుకు 17ఏ చట్టసవరణ పరికరం కాకూడదు
► సెక్షన్ 19 మాదిరిగా 17ఏ సంపూర్ణంగా కేసు నమోదుకు నిరోధం కల్పించలేదు
► ఈ చట్టం వచ్చింది... నిజాయతీపరులైన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తకుండా ఉండటంకోసమే
► పోలీసు కేసు పెట్టగానే వెంటనే హైకోర్టుకు వెళ్లారు.. ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వచ్చారు
► కనీసం పోలీసు అధికారులకు విచారణ జరిపే అవకాశం దొరకని పరిస్థితి ఏర్పడింది
► వరుసగా కోర్టు తర్వాత మరో కోర్టుకు రావడం మూలంగా పోలీసు విచారణకు విఘాతం కలుగుతుంది
► కనీసం పోలీసులు విచారణ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా
► FIR రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును చూడండి
► చట్టం అమలులో ఉన్నప్పుడు జరిగిన నేరాలకు పాత చట్టంలోని సెక్షన్స్ వర్తిస్తాయి
► చట్టాన్ని రద్దు చేసినా వెనక్కి తీసుకున్నప్పటికీ నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుంది
► కొత్త చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది కాబట్టి సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదు
► నేరమే చేయనప్పుడు ఎస్ఎల్‌పీ ఎందుకు వేశారు?
► అధికార విధుల నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని పిటిషనర్ అన్నప్పుడు 17ఏ వర్తిస్తుంది
► నిర్ణయంలో తన ప్రమేయం లేనప్పుడు 17ఏ ఎలా వర్తిస్తుంది?
► 2018 మే 14, జూన్ 6 తేదీల్లో ఉన్న పత్రాలను హైకోర్టు ముందుంచాం
► ఈ పత్రాల ఆధారంగా అప్పటికే విచారణ ప్రారంభమైనట్లు హైకోర్టుకు నివేదించాం
► మా వాదనలు ఏపీ హైకోర్టు ఆమోదించింది
► విధాన నిర్ణయాల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం అవినీతికి పాల్పడితే దానికి 17ఏను వర్తింపచేయలేము
►  సెక్షన్ 197 అయినా.. 17ఏ అయినా రక్షణ ఛత్రం కాకూడదు
► డిజైన్‌టెక్ కంపెనీకి ఇచ్చిన నిధులను షెల్ కంపెనీల ద్వారా సొంత మనుషులకు వచ్చేలా చంద్రబాబు వ్యవహరించారు
 

15:50 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు
► ఫైబర్ నెట్ కేసును మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు
► అప్పటివరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని హామీ ఇచ్చిన CID లాయర్

15:45 PM, అక్టోబర్‌ 13, 2023
ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టు ఆర్దర్
► జస్టిస్ బోస్ & జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో నోటీసులు జారీ చేస్తున్నాం. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తరపు లాయర్ విజ్ఞప్తి మేరకు ఈ కేసును మంగళవారంకు వాయిదా వేస్తున్నాం. ఈ కేసులో ఒక వేళ రాష్ట్రప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలనుకుంటే సోమవారం చేయవచ్చు. అదే కాపీని పిటిషనర్ చంద్రబాబుకు కూడా ఇవ్వాలి. 
► బాబు లాయర్ లూథ్రా : ఈ కేసులో CID లాయర్ రోహత్గీ చెప్పినట్టు బుధవారం వరకు అరెస్ట్ చేయరని భావిస్తున్నాం. ఒక వేళ దీనితో విభేదిస్తే సోమవారం కౌంటర్ దాఖలు చేస్తారు కదా.?
►CID లాయర్ రోహత్గీ : అవును

15:45 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్ నెట్ కేసు.. 
► జస్టిస్ బోస్  : అసలు అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఇక ముందస్తు బెయిల్ గురించి వాదనలు వినవలసిన అవసరమే లేదు
►CID లాయర్ రోహత్గీ : ఈ కేసును బుధవారం వరకు వాయిదా వేయమని కోర్టును అడుగుతున్నాను
► బాబు లాయర్ లూథ్రా : మాకు కూడా అంగీకారమే

15:35 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్ నెట్ కేసు.. 
► బాబు లాయర్ లూథ్రా : ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదు. కచ్చితంగా సెక్షన్ 17a పాటించాల్సిందే
► జస్టిస్ బోస్  : ప్రతీ చోటా సెక్షన్ 17a పైనేనా? ఇది పునరావృతం అవుతోంది. ఒక పని చేద్దాం. ఒక షార్ట్ నోటిస్ ఇచ్చి మంగళవారం దీనిపై విచారణ చేపడతాం
► బాబు లాయర్ లూథ్రా : అప్పటి వరకు అరెస్ట్ చేస్తామన్న నోటీసులపై స్టే ఇవ్వండి
►CID లాయర్ రోహత్గీ : ఇది  సరి కాదు. ఈ సమయంలో కోర్టు జోక్యం చేసుకోవద్దని కోరుతున్నాను
► బాబు లాయర్ లూథ్రా : పిటిషనర్ చంద్రబాబును ఫైబర్ నెట్ కేసులో సోమవారం అరెస్ట్ చూపిస్తారు. అప్పుడు మంగళవారం ఈ పిటిషన్ బెంచ్ మీదకు వచ్చినా ప్రయోజనం ఏముంటుంది? 
► జస్టిస్ బోస్  : ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేం. సోమవారం వరకు CID అరెస్ట్ చేయకుండా ఉండగలరా? 
►CID లాయర్ రోహత్గీ : ఇది మీ ముందున్న నిర్ణయం. మీ ఆదేశాలను బట్టి అమలు జరుగుతుంది
► జస్టిస్ త్రివేదీ  : అయితే సోమవారం వరకు ఆపండి
► జస్టిస్ బోస్  : సోమవారం వరకు అరెస్ట్ చేయబోమని కోర్టుకు చెప్పండి
►CID లాయర్ రోహత్గీ : మీ ఆదేశాల ప్రకారం సోమవారం వరకు ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని CIDకి చెప్పగలను
► బాబు లాయర్ లూథ్రా : ఇక్కడ కీలక విషయం ఏంటంటే, FIR ప్రకారం ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు.. 

15:35 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్ నెట్ కేసు.. 
► బాబు లాయర్ లూథ్రా : ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఒక కేసులో చంద్రబాబు అరెస్ట్ కాగానే, ఆయన మీదున్న అన్ని కేసుల్లో అరెస్ట్ చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైబర్ నెట్ స్కాంకు సంబంధించి 2021లో FIR నమోదయింది. ఆ తర్వాత ఇంకేమీ జరగలేదు. సెప్టెంబర్ 19న చంద్రబాబును నిందితుడిగా చేర్చారు. అంటే స్కిల్ స్కాంలో అరెస్ట్ కాగానే ఇందులో నిందితుడిగా చేర్చారు. కోర్టు ముందు హాజరు పరుస్తామని చెప్పారు. ఈ కేసులో కచ్చితంగా చంద్రబాబును అరెస్ట్ చూపిస్తారని భావిస్తున్నాం. 

► బాబు లాయర్ లూథ్రా : చంద్రబాబు ప్రజా ప్రతినిధిగా పని చేశారు. కేసు ఏదైనా మా వాదన ఒకటే. సెక్షన్ 17a ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేశాం కానీ మా వాదనను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ కూడా మంజూర్ చేసింది. మరో ముగ్గురు రెగ్యులర్ బెయిల్ మీద బయటున్నారు. ఈ కేసులో ఇంకొందరు అసలు అరెస్టే కాలేదు. ఇప్పుడు అరెస్ట్ చూపించాల్సిన అవశ్యకత ఏమాత్రం లేదన్నది మా విజ్ఞప్తి

15:35 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► బాబు లాయర్ సాల్వే: ఈ కేసును సోమవారం విచారణ చేపట్టగలరని విజ్ఞప్తి చేస్తున్నాం
►CID లాయర్ రోహత్గీ : మంగళవారం పరిశీలించగలరని కోరుతున్నాం
► బాబు లాయర్ సాల్వే: పిటిషనర్ గా ఈ కేసును తొందరగా విచారణ జరపాలని కోరే హక్కు మాకుంది. పైగా పిటిషనర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు
►జస్టిస్ బోస్ : ఏదో ఒక రోజు.. ఈ కేసును సమగ్రంగా వింటాం
►CID లాయర్ రోహత్గీ : పిటిషనర్ జైల్లో ఉన్నారంటే బెయిల్ వేసుకోవాలి కానీ సెక్షన్ 482 కింద వాదనలడగమేంటీ?
► బాబు లాయర్ సాల్వే: ఇప్పుడే కేసులో ఏం తీర్పు వస్తుందో మీరు చెప్పలేరు

15:30 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
► జస్టిస్ త్రివేదీ : ఈ కేసులో నిధులు విడుదల చేయాలన్న నిర్ణయం ఎవరిది? 
►CID లాయర్ రోహత్గీ : స్వయంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుది
► జస్టిస్ బోసు : ఈ కేసులో నిధులు తిరిగి చంద్రబాబుకు చేరాయని ఎలా గుర్తించారు?
►CID లాయర్ రోహత్గీ : అది దర్యాప్తులో తేలుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. 90% పేరుతో 10% నిధులు పక్కదారి పట్టించారు. ఆ కేసును దర్యాప్తు చేయాలి. ఇది ప్రజా నిధి. 
► జస్టిస్ బోసు : అయితే ఈ కేసును మరో రోజు పరిశీలిద్దాం. 
►CID లాయర్ రోహత్గీ : సోమ లేదా మంగళవారం విచారణ జరపగలరా?
► జస్టిస్ లూథ్రా : మా లాయర్ హరీష్ సాల్వే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు అనుమతి కోరుతున్నారు.

15:25 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
►CID లాయర్ రోహత్గీ : ఈ కేసులో చేసిన అవినీతి, అక్రమాలను పరిశీలిస్తే.. AP స్కిల్ డెవలప్మెంట్  కార్పోరేషన్ ను రెండు కంపెనీల మధ్య ఒప్పందం కోసం ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ఒప్పందంలో ఎక్కడా టెండర్ ప్రక్రియను పాటించలేదు. పైగా దీంట్లో ప్రభుత్వం తరపున ఏం చెప్పారంటే.. 90% నిధులు సీమెన్స్ అనే కంపెనీ చెల్లిస్తుందని, 10% మాత్రమే ప్రభుత్వం ఇస్తుందన్నారు. 90% నిధులు రాకముందే, 10% వాటాను అంటే రూ.370 కోట్లను విడుదల చేశారు. అవి కాస్తా.. రకరకాల షెల్ కంపెనీల ద్వారా పక్కదారి పట్టినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అలా విడుదలైన డబ్బు మళ్లీ వేర్వేరు పద్ధతుల్లో  కొందరి ఖాతాల్లోకి చేరింది. ఈ కుంభకోణాన్ని కచ్చితంగా దర్యాప్తు జరపాల్సిందే.

15:15 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
►CID లాయర్ రోహత్గీ : కచ్చితంగా వర్తిస్తుంది. ఈ కేసును గోద్రా కేసుతో కొన్ని అంశాలలో పోల్చవచ్చు. ఆ కేసులో సాక్షుల పేర్లు రహస్యంగా ఉంచారు. ఇక అవినీతి నిరోధక చట్టం ఇచ్చిన అధికారాలతో ఈ కేసు దర్యాప్తు జరిగింది. 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన సుబ్రమణియన్ స్వామి vs మన్మోహన్ సింగ్ కేసుతో దీన్ని పోల్చవచ్చు. 

►CID లాయర్ రోహత్గీ : ప్రజా ప్రతినిధులు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్నప్పుడు సెక్షన్ 197 కానీ, సెక్షన్ 17a కానీ కాపాడలేవని సుబ్రమణియన్ స్వామి కేసులో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దీని గురించి ఒక అఫిడవిట్ నేను ఏపీ హైకోర్టులో దాఖలు చేశాను. దాన్ని బట్టి 17a సవరణను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కేసు నెగ్గితే అది మొత్తం దర్యాప్తును ఒక అవినీతి కేసులో నిలిచిపోయేలా చేస్తుంది. పైగా దీని వెనక ఎలాంటి రాజకీయ కక్ష నాకు కనిపించడం లేదు. ఈ కేసులో నిజాల్ని బయటపెట్టడం వెనక ఉన్నవన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలే. సెబీ,  GST, IT, CBI, ED.. 

15:10 PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
►CID లాయర్ రోహత్గీ : మే 14, 2018 నుంచి జూన్ 5, 2018 వరకు ఈ కేసులో దర్యాప్తు జరిగింది. ఈ విచారణలో కొన్ని డాక్యుమెంట్లు సేకరించింది దర్యాప్తు సంస్థ. వీటిలో చంద్రబాబు పాత్రను నిరూపించే అంశాలు స్పష్టంగా ఉన్నాయి. వీటిని ఏపీ హైకోర్టు ముందుంచాం. న్యాయమూర్తి కూడా వీటిని అనుమతించారు. ఆర్డర్లో పేర్కొన్నారు కూడా. అసలు ఈ విషయాన్ని ఓ విజిల్ బ్లోయర్ సంబంధిత శాఖకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఆ విజిల్ బ్లోయరే CBIకి, వాటిని CBI మరో శాఖకు పంపించింది
►జస్టిస్ బోస్  : అంటే ఈ కేసులో విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ వర్తిస్తుంది కదా.
 

15:05PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
►CID లాయర్ రోహత్గీ : ఈ కేసులో తనకేమీ తెలియదని చంద్రబాబు అంటున్నారు. అదే సమయంలో సెక్షన్ 17a సవరణ ప్రకారం అరెస్ట్ చేయలేదుంటున్నారు. ఇది వాస్తవ విరుద్ధంగా ఉంది
►జస్టిస్ బోస్  : నిధులకు సంబంధించిన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదంటున్నారు? కానీ మీరు చెప్పేదాని బట్టి కచ్చితంగా జోక్యం చేసుకున్నారు..
 

15:00PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు
►CID లాయర్ రోహత్గీ : 17a సవరణ అమలు గురించి ఇంకొక విషయం కోర్టు ముందుంచుతున్నాను. ఒక క్వాష్ పిటిషన్ విషయంలో నిర్ణయం తీసుకునేపుడు అది 17a కారణంగా క్వాష్ కావాల్సిన అవశ్యకత రాకూడదు. జూన్ 2018లోనే.. అంటే ఈ సెక్షన్ రాకముందే దర్యాప్తు మొదలయింది. ఇప్పుడు ఈ చట్టాన్ని బూచిగా చూపించి రక్షణ పొందరాదు. ఈ సెక్షన్ 17a అమలు విషయంలో ఏదైనా సందేహాలుంటే సుప్రీంకోర్టు ఓ చక్కటి రూలింగ్ ఇచ్చింది. అవినీతిని అంతమొందించడమే దీని లక్ష్యమని చెప్పింది. ఇది సుబ్రమణియన్ స్వామి కేసులో సూటిగా పేర్కొంది.

►CID లాయర్ రోహత్గీ : 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన SM మన్సూరీ కేసును పరిశీలిస్తే.. 17a అనేది కేవలం కొందరు నిజాయితీపరులైన ప్రజా ప్రతినిధుల కోసం ఉద్దేశించింది మాత్రమే. SM మన్సూరీ కేసులో సెక్షన్ 197లో మాత్రమే ముందస్తు అనుమతి కోరుతోంది. ఒక కేసులో సెక్షన్ 482 ఉన్నప్పుడు దీన్ని అమలు చేయలేం

14:55PM, అక్టోబర్‌ 13, 2023
హైకోర్టులో కిలారు రాజేష్ పిటిషన్‌ డిస్పోజ్‌
►స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో ముందస్తు బెయిల్‌ కోసం కిలారు రాజేష్‌ పిటిషన్‌ 
►ఇవాళ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు
►41A ఫాలో అవుతామని కోర్టుకు తెలిపిన సీఐడీ తరఫున న్యాయవాదులు
►నోటీసులు ఇచ్చే ప్రశ్నిస్తామని వెల్లడి
►దీంతో.. కిలారు పిటిషన్ డిస్పోస్ చేసిన న్యాయస్థానం

14:50PM, అక్టోబర్‌ 13, 2023
దర్యాప్తుకు తగిన టైం ఇవ్వాలి:రోహత్గి
►సుప్రీంకోర్టు లో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ
►సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి
►అరెస్ట్ జరిగిన మరుక్షణమే కేసు కొట్టేయాలని వచ్చారు
►దర్యాప్తుకు అడ్డంకులు సృష్టించడం కోసం  ప్రయత్నం చేస్తున్నారు
►నేరం అనేది ఛార్జ్ షీట్ లోనే తేలుతుంది
►పోలీసులకు దర్యాప్తుకు తగిన సమయం ఇవ్వాలి

14:47PM, అక్టోబర్‌ 13, 2023
ఈ కేసులో ఎలాంటి అనుమతి అవసరం లేదు: రోహత్గీ
►సుప్రీంకోర్టు లో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ ప్రారంభం
►సీఐడీ తరపున వాదనలు కొనసాగిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్ రోహత్గీ
►2015- 16 స్కిల్ స్కాం నేరం జరిగింది
►సవరణ చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగింది 
►13(c)(d)అమలులో ఉన్నప్పుడే విచారణ ప్రారంభమైంది
►17-A జూలై 2018లో వస్తే, నేరం జరిగింది 2015లో 
►17-A ఈ కేసుల్లో ఇది అసలు వర్తించదు
►ఈ స్కాం ప్రక్రియను ప్రభుత్వ విధుల్లో భాగంగా చూడవద్దు
►ఈ సెక్షన్ నిజాయితీ పరుల రక్షణ కోసమే
►ఇది ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ చట్టం కాదు... అవినీతి నిరోధక చట్టం
►482 కేసు లో పబ్లిక్ డ్యుటీ అనే అంశాన్ని విచారించలేరు
►ఇది ట్రయల్‌లోనే తేలుతుంది
►ఈ కేసులో ఎలాంటి అనుమతి అవసరం లేదు
►చట్టంలో ఏమైనా సందిగ్ధం ఉంటే, అవినీతి నిరోధక చర్యలు తీసుకునే ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మద్దతు పలికింది

14:43PM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంలో బాబు పిటిషన్‌.. రోహత్గీ వాదనలు
►సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు
►ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల వాదనలు
►ముందుగా స్కిల్‌ స్కాం వాదనలు జరగాలని కోరిన సీఐడీ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ
►స్కిల్‌ స్కాంలో కొనసాగుతున్న వాదనలు
►ఐదేళ్ల కిందట జరిగిన నేరానికి కూడా.. ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయొచ్చు
►అందుకు చట్టం అనుమతిస్తుంది
►ఎఫ్‌ఐఆర్‌ ఎప్పుడు నమోదు చేశారనేది ముఖ్యం కాదు
►నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టం ఆధారంగానే విచారణ జరగాలి
►కొన్ని చట్టాలను సవరించిన ఆ చట్టంలోని మిగిలిన భాగం అలాగే కొనసాగుతుంది
►17ఏ చట్టం చేసిన తర్వాత జరిగిన కేసులకే వర్తిస్తుందని.. సుప్రీం కోర్టు స్పష్టం చేసింది
►అవినీతి అనేది ఎప్పుడూ ఉద్యోగ బాధ్యత కిందకు రాదు
►17ఏ చట్టం ప్రాథమిక విచారణకే వ్యతిరేకం అయినప్పుడు.. కేసులు ఎలా విచారిస్తారు?
►17ఏ విషయంపై నాలుగు హైకోర్టులు చెప్పిన తీర్పులు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నాయి
►నేరం జరిగిన సమయానికి 17ఏ లేదు కాబట్టి.. బాబుకు వర్తించదు
►ఈ కేసులో నేరం జరిగినట్లు స్పష్టమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయ్‌
►ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇది ఎక్కడా ఉద్యోగ బాధ్యతగా కనిపించట్లేదు
►ఎట్టి పరిస్థితుల్లో 17ఏ చంద్రబాబుకు వర్తించదు

14:22PM, అక్టోబర్‌ 13, 2023
వెదర్‌ వల్లే చంద్రబాబుకి సమస్య!

►చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వస్తున్న ఆందోళనకు వైద్యుల సమాధానం 
►స్పష్టత ఇచ్చిన డాక్టర్ సునీత(డెర్మటాలజిస్ట్)
►చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్య వచ్చింది 
►జైలు అధికారులు మాకు సమాచారం ఇచ్చారు
►చంద్రబాబుకు మెడిసిన్స్ సజెస్ట్ చేసాము
►ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు కారణంగానే ఈ సమస్య

14:11PM, అక్టోబర్‌ 13, 2023
భువనేశ్వరి మంచి మందులు, భోజనం పంట్లేదా?
►జైల్లో ఉండి కూడా అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నా
►అందుకే నారా భువనేస్వరి, లోకేష్ ఈ ఆరోపణలు చేస్తున్నారు
►చంద్రబాబు కి మందులు, భోజనం పంపేది భువనేశ్వరినే కదా
►మరి భువనేశ్వరి మంచి భోజనం పంపట్లేదా..?
►భువనేశ్వరి మంచి మందులు పంపట్లేదా..?
►చంద్రబాబు జడ్జి రిమాండ్ లో ఉన్నారు.. జగన్ రిమాండ్ లో కాదు
►మహాత్మాగాంధీ కూడా ఏనాడూ జైల్లో ఉన్నప్పుడు ఇలా దోమలు కుట్టలేదని మాట్లాడలేదు
►మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ కంటే బాబు గొప్పోడా?
►జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగా లేకపోతే లోకేష్ ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు
►లోకేష్ కి అమిత్ షా ని కలవడానికి సిగ్గు లేదా?
►అమిత్ షా మీద రాళ్లేయించి.. ఇప్పుడేమో కేసులు కోసం కలిశారా?
►లోకేష్ ఆడే డ్రామాలు అమిత్ షా కి తెలియవనుకుంటున్నారా?
►కమ్మ వాళ్ళని రెచ్చగొట్టడానికి భువనేశ్వరి, లోకేష్ అబద్దాలు చెప్తున్నారు
►జైల్లో నిరంతరం డాక్టర్లు, పోలీసులు పర్యవేక్షణ లో చంద్రబాబు ఉన్నారు
►చంద్రబాబు కోసం హత్యలు జరగట్లేదు అని ఇలాంటి దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు
►ఎన్టీఆర్ కి మందులు వెయ్యకుండా చివరి దశలో ఇబ్బంది పడ్డప్పుడు భువనేశ్వరి ఎక్కడున్నారు?
►మోదీని నీచంగా తిట్టిన చంద్రబాబు కోసం పురంధేశ్వరి తాపత్రయ పడటమా?
►పవన్ కల్యాణ్, లోకేష్ లు రాజకీయాలకు పనికిరారు
►బట్టలు విప్పుతాం, కొడతాం అంటే ప్రజలు ఛీ కొడుతున్నారు
:::పోసాని కృష్ణ మురళి, ఏపీ ఎఫ్ డి సి చైర్మన్

13:44PM, అక్టోబర్‌ 13, 2023
అచ్చెన్నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
►మాజీ సీఎంలు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారు
►అచ్చన్నలా ఏ పార్టీ వాళ్ళూ ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదు
►కారాగారంలో ఆయనకు ప్రాణహాని ఉందా?
►లోపల ఆయన హాయిగా, ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు
►మెప్పుకోసం మీరు ఏదో ఒకటి చెప్పి మానసిక క్షోభకు గురిచేయకండి
►ఇంటి భోజనంతో కూడా వెయిట్ లాస్ ఎలా అయ్యారో మీరే చెప్పాలి.. అంటూ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి

13:35PM, అక్టోబర్‌ 13, 2023
►బయటపడ్డ టీడీపీ  దొంగ నాటకం
►బాబు బరువు తగ్గారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం
►చంద్రబాబు కేజీ బరువు పెరిగారంటున్న జైళ్లశాఖ డీఐజీ
►బాబు జైల్లో అడుగుపెట్టినప్పుడు 66కే జీలు
►ప్రస్తుతం 67 కేజీలకు చేరుకున్నారు
►చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారు: డీఐజీ రవికిరణ్‌

12:05PM, అక్టోబర్‌ 13, 2023
►ఉండవల్లి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌
►44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
►తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
►స్కిల్‌ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్‌
►ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ వాదనలు
► ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఎస్‌ఐటీని ఏర్పాటు చేశాం
►ఈ కేసుకు సంబంధించి సీబీఐకి కూడా ప్రభుత్వ సమాచారం ఇచ్చింది
►సీబీఐకి కేసు అప్పగించే విషయంపై నాలుగేళ్ల క్రితమే కేంద్రానికి నివేదించాం ఏజీ శ్రీరామ్‌
►స్కిల్‌ కేసు సీబీఐ విచారణకు ఇవ్వడానికి తమకు అభ్యంతర లేదని కోర్టుకు తెలిపిన ఏజీ శ్రీరామ్‌
►నిన్న(గురువారం) ఏసీబీ కోర్టులో విచారణ సందర్బంగా సీఐడీ పీపీపై దాడి చేశారని హైకోర్టుకు తెలిపిన ఏజీ శ్రీరామ్‌
►ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై బాబు లాయర్లు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ

12:00PM, అక్టోబర్‌ 13, 2023
►ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ రిట్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
►స్కిల్‌ స్కాం విచారణ  సీఐడీ నుంచి..సీబీఐ విచారణకు ఇవ్వాలని రిట్‌ పిటిషన్‌
►ప్రభుత్వం తరపు  వాదనలు వినిపిస్తున్న ఏజీ శ్రీరామ్‌
►ఈ కేసు వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉందన్న ఉండవల్లి
►లోతైన విచారణ అవసరమంటూ పిటిషన్‌లో పేర్కొన్న ఉండవల్లి
►ఈ కేసులో ఈడీ, సీబీఐ, ఏపీ ప్రభుత్వంతోపాటు స్కిల్‌ స్కాం నిందితులందరినీ ప్రతివాదులగా చేర్చిన ఉండవల్లి

11:40AM, అక్టోబర్‌ 13, 2023
►ఏపీ హైకోర్టులో కిలారు రాజేష్ పిటిషన్ వాయిదా
►మధ్యాహ్నం 2.15 గంటలకు విచారిస్తామన్న ఏపీ హైకోర్టు.
►స్కిల్ కేసులో ముందస్తు బెయిల్‌పై  కిలారు రాజేష్ పిటిషన్

11:15AM, అక్టోబర్‌ 13, 2023
►కాల్ రికార్డ్స్ పిటీషన్‌పై విచారణ 18కి వాయిదా
►సీఐడీ అధికారుల కాల్‌ డేటా ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్‌
►తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

10:45AM, అక్టోబర్‌ 13, 2023
►అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌
►రూ. లక్ష పూచీకత్తుతో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
►ఇప్పటికే అంగళ్లు కేసులో 79 మందికి ముందస్తు బెయిల్‌

సానుభూతి కోసం టీడీపీ విశ్వ ప్రయత్నాలు 
►మొదట దోమలు,  తర్వాత వేడి నీళ్లు, ఆ తరువాత ఉక్క పోత,  ఇప్పుడు ఎలర్జీ
►ఏదో ఒక అనారోగ్యం పేరు చెప్పి జనాల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు 
►జైల్లో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు,  కావాల్సిన సేవలు 
►నెల కిందట వరకు రోజూ మూడు సభల్లో,  మండుటెండల్లో తిరిగిన బాబు 
►ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ సవాళ్లు 
►ఇప్పుడు రోగాల చిట్టా అంతా చదువుతున్న టీడీపీ నేతలు

కాకినాడలో టీడీపీ నేత చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు
►మేకర్ మైండ్స్ సొల్యూషన్ ఆఫీసుతో పాటు విజయవాడ, హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న సోదాలు
►కంపెనీల డాక్యుమెంట్స్ పరిశీలించిన ఐటీ అధికారులు

► చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇవాళ ములాఖత్‌లో  కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి, కాసాని జ్ఞానేశ్వర్.

10:29AM, అక్టోబర్‌ 13, 2023
►ఏపీలో నేడు టీడీపీ సీనియర్ నేతల అత్యవసర భేటీ
►ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం
►చంద్రబాబు పరిస్థితి,  కేసులు,  కోర్టులపై చర్చించనున్న నేతలు
►చంద్రబాబు కేసుల పై  లోకేశ్ తో మాట్లాడుతున్న నేతలు
►న్యాయ నిపుణులతోనూ చర్చించాలని టీడీపీ నేతల నిర్ణయం
►కీలక సమయంలో లోకేష్ అందుబాటులో లేకపోవడం పై గుర్రుగా ఉన్న నేతలు
►భువనేశ్వరి బస్సు యాత్ర ఎందుకు ఆపారన్న దానిపై చర్చ
►యువగళం ఏమిచేద్దాం అనేదానిపై చర్చ

10:03AM, అక్టోబర్‌ 13, 2023
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 34వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►జైల్లో చంద్రబాబుకు చర్మ సంబంధిత సమస్య రావడంతో  జీజీహెచ్‌ వైద్యులతో చికిత్స అందించిన జైలు అధికారులు
►చంద్రబాబు ఆరోగ్యం పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల 
►చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నట్టు స్పష్టం చేసిన జైలు అధికారులు
►ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో సోమవారం చంద్రబాబును పీటీ వారెంటుపై విజయవాడ ఏసిబి కోర్టు లో ప్రవేశపెట్టనున్న పోలీసులు

10:02AM, అక్టోబర్‌ 13, 2023
►ఇవాళ సీఐడీ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ సమగ్ర వాదనలు
►oct 9th సోమవారం రోజు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు

9:50AM, అక్టోబర్‌ 13, 2023
►నేడు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
►మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ
►సీఐడీ తరపు వాదనలు వినిపించనున్న రోహత్గి

9:15AM, అక్టోబర్‌ 13, 2023
►ఏసీబీ కోర్టులో నిన్న(గురువారం) టీడీపీ న్యాయవాదుల రౌడీయిజం
►కాల్ రికార్డ్స్ పిటిషన్ పై వాదనలు సందర్భంగా సీఐడీ తరపు స్పెషల్ పిపి వివేకానందపై దూసుకెళ్లిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందన్న చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి
►అసలు పిటిషనకు అర్హతే లేదన్న సీఐడీ న్యాయవాది వివేకానంద
►ఒక్కసారిగా సీఐడీ న్యాయవాదుల మీదకు దూసుకువెళ్లే ప్రయత్నం చేసిన టీడీపీ న్యాయవాదులు
►సీఐడీ తరపు న్యాయవాది వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో టీడీపీ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం
►సీఐడీ న్యాయవాది స్పెషల్ పిపి వివేకానందపై అనుచిత వ్యాఖ్యలు... వ్యక్తిగత దూషణలు, దాడికి యత్నం
►ఏసీబీ న్యాయమూర్తి పైనా టీడీపీ న్యాయవాదుల అనుచిత వ్యాఖ్యలు
►లక్ష్మీ నారాయణ తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేసిన సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద
►అరుపులతో కాసేపు దద్దరిల్లిన కోర్ట్ హాల్
►ఇరు పక్షాల న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏసీబీ జడ్జి
►టీడీపీ న్యాయవాదులు లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు..  అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా అంటూ ప్రశ్నించిన ఏసీబీ కోర్టు జడ్జి
►లేరని సమాధానం చెప్పిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
►కోర్టు హాల్లో అతిగా ప్రవర్తించిన వాళ్ల పేర్లు రాసుకోవాలంటూ జడ్జి ఆదేశం
►అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా జడ్జి ఆదేశం
►ఈ విధంగా ఉంటే నేను విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి
►విచారణ నేటికి వాయిదా
►ఫైబర్ నెట్ పిటి వారెంట్ పై ఏసీబీ కోర్టు అనుమతి
►చంద్రబాబుని ఏసీబీ కోర్టు ఎదుట సోమవారం నేరుగా హాజరుపర్చాలని ఆదేశం
►సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 లోపు హాజరుపర్చాలని ఆదేశం

9:07AM, అక్టోబర్‌ 13, 2023
►ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేపులో సోమవారం ఏసీబీ కోర్టుకు చంద్రబాబు
►చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
►రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో 34వ రోజు ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేసిన అధికారులు
►చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యకు జైల్లో చికిత్స

7:45AM, అక్టోబర్‌ 13, 2023
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ స్కాం కేసు విచారణ
►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి
►17-ఏ అవినీతిపరుల రక్షణ కోసం కాదు.. నిజాయితీపరుల రక్షణ కోసమేనని వాదించిన ముకుల్ రోహిత్గి
►గత విచారణలో దాదాపు నాలుగు గంటల పాటు చంద్రబాబు తరపున సుదీర్ఘ వాదనలు వినిపించిన హరీష్ సాల్వే 
►కేసు విచారణ చేస్తున్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది
►అవినీతి నిరోధక చట్టం ఉద్దేశానికి తూట్లు పొడిచేలా 17-ఏ వర్తింపజేయలేమని  వ్యాఖ్యానించిన కోర్టు

7:40AM, అక్టోబర్‌ 13, 2023
స్కిల్ కేసులో కిలారు రాజేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

►నేడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
►చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో కిలారు రాజేష్ పేరు
►స్కిల్ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే కిలారు రాజేష్‌కు 41-ఏ నోటీసులు జారీ
 ►ప్రస్తుతం పరారీలో ఉన్న కిలారు రాజేష్

7:36AM, అక్టోబర్‌ 13, 2023
►స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 17కు వాయిదా
►స్కిల్ కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించిన హైకోర్టు
►స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ నిరాకరించిన ఏసీబీ కోర్టు 
►ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు 

►నేడు ఉండవల్లి రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
►స్కిల్ కేసులో చంద్రబాబు పై ఉండవల్లి రిట్ పిటిషన్
►స్కామ్ పై సమగ్ర దర్యాప్తు చేయాలని పిటిషన్ 

►విజయవాడ ఏసీబీ కోర్టులో నిన్న(గురువారం) జరిగిన పరిణామాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిజిస్ట్రార్ కు ఏసీబీ కోర్టు జడ్జి లేఖ
►స్కిల్ డెవలప్ మెంట్ కేసు దర్యాప్తు అధికారుల కాల్ డేటా రికార్డు పిటిషన్ పై విచారణ సమయంలో సీఐడీ న్యాయవాదుల పై బాబు లాయర్ దౌర్జన్యం
►లేఖలో ఇద్దరు న్యాయవాదుల పేర్లను ప్రస్తావించిన ఏసీబీ కోర్టు జడ్జి
►కాకినాడ : లోకేశ్ అనుచరుడు గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు

7:10AM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంలో చంద్రబాబు పిటిషన్‌పై నేడు విచారణ
►చంద్రబాబు లీవ్ పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ
►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం
►సెక్షన్ 17 ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా ? లేదా? అన్నది తేల్చనున్న సుప్రీం కోర్టు 
►చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన హరీష్ సాల్వే
►సీఐడీ తరపు వాదనలు వినిపించనున్న రోహత్గి, రంజిత్ కుమార్ 

7:00AM, అక్టోబర్‌ 13, 2023
అంగళ్లు కేసుపై నేడు హైకోర్టులో తీర్పు..
►అంగళ్లు విధ్వంసం కేసులో బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►కేసుపై కోర్టులో పూర్తైన ఇరుపక్షాల వాదనలు
►తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు
► నేడు తీర్పు వెల్లడిస్తామన్న కోర్టు. 
►స్కిల్‌ స్కాం కేసులో లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 
►41A నోటీసులు ఫాలో అవుతామని చెప్పిన సీఐడీ లాయర్లు. 
►లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు. 

6:50AM, అక్టోబర్‌ 13, 2023

అసైన్డ్‌ భూదోపిడీలో కొత్త కోణం.. గుట్టుగా జీఓ–41 జారీ
►కేబినెట్‌కు తెలియకుండా బాబు, నారాయణ బరితెగింపు
►ఇది సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించడమే..
►తద్వారా అమరావతి పరిధిలోని 950 ఎకరాల అసైన్డ్‌ భూములను కొల్లగొట్టిన బాబు ముఠా
►సీఐడీ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి..

6:45AM, అక్టోబర్‌ 13, 2023
సుప్రీంకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ 
►సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు
►ఫైబర్ నెట్ స్కాం కేసులో బెయిల్  పిటిషన్ దాఖలు
►మంగళగిరి పోలీస్ స్టేషన్ హెడ్‌(SHO) ను ప్రతివాదిగా  చేరుస్తూ పిటిషన్

6:30AM, అక్టోబర్‌ 13, 2023
►ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
►ఆయనపై పీటీ వారెంట్‌ జారీకి ఏసీబీ కోర్టు అనుమతి
►సోమవారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశం
►వివాదాస్పదంగా ప్రవర్తించిన టీడీపీ న్యాయవాదులు
►ప్రత్యేక పీపీ వివేకానందపై దాడికి యత్నం.. అరుపులతో దద్దరిల్లిన కోర్టు
►టీడీపీ న్యాయవాదుల తీరుపై న్యాయాధికారి తీవ్ర ఆగ్రహం
►ఇలా అయితే కేసు విచారించలేనని చెప్పి బెంచ్‌దిగి వెళ్లిపోయిన జడ్జి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement