TDP Chandrababu Cases Petitions And Political Updates..
6.25 PM, Dec 1, 2023
ఫైబర్‌గ్రిడ్ కేసు జనవరి 5కి వాయిదా
- ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వేసిన పీటీ వారెంట్ పై ఏసీబీ కోర్టులో విచారణ
- తదుపరి విచారణ వచ్చే నెల 5కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- ‘ఫైబర్‌గ్రిడ్’ కుంభకోణం దర్యాప్తులో CID కీలక అంశాలు
- టెరాసాఫ్ట్ పేరుతో రూ.284 కోట్లు కొట్టేసిన లోకేశ్ సన్నిహితులు
- కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏపీలో చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టు
- రూ.333 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు అప్పగింత
- కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్న వేమూరి
- వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావును భాగస్వామిగా చేరిక
- వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీ సృష్టి
- ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు రూ.284 కోట్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం
- నెటాప్స్ పేరుతో డొల్ల కంపెనీ సృష్టించి నిధులు మళ్లించిన వేమూరి హరికృష్ణ
- నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు.
- నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పనిచేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లింపు
- వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు నెటాప్స్ కంపెనీ బదిలీ
- నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ
- నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ
- టెరాసాఫ్ట్ లావాదేవీలను ఆడిటింగ్ చేసిన స్వతంత్ర సంస్థ ఐబీఐ గ్రూప్
- ఇప్పటికే ఈ కేసులో నలుగురు సూత్రధారుల అరెస్టు
6.25 PM, Dec 1, 2023
తెలుగుదేశానికి జనసేన సైనికులు జై కొట్టాలి
- ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది : నాదెండ్ల మనోహర్
- జనసేన, టీడీపీ సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నాం
- ఏ కార్యక్రమం జరిగినా టీడీపీతో కలిసి పనిచేయాలని పవన్ ఆదేశించారు
- టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొనాలి
- వ్యక్తిగత విషయాలకు ఎవరూ పోవద్దు : నాదెండ్ల మనోహర్
5.35 PM, Dec 1, 2023
జనసేన పొత్తులకు అర్థాలు వేరులే
- ఏపీలో తెలుగుదేశంతో, తెలంగాణలో బీజేపీతో
- జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రకటన
- ఏపీలో టీడీపీ, తెలంగాణ లో బీజేపీ జనసేన కలవటంపై YSRCP విమర్శలు చేస్తోంది
- నేను ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాను
- దీని వెనుక వ్యూహాలు ఉంటాయి
- టీడీపీ వెనుక జన సేన వెళ్ళటం లేదు
- టీడీపీతో కలిసి జన సేన నడుస్తోంది
- ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దు
- నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవు
- నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారు
- కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదు
- ఇలా ఆలోచన చేసే వారు YSRCP లోకి వెళ్లి పోవచ్చు
- టీడీపీ జన సేన పొత్తు పై విమర్శలు చేసే వారిని YSRCP కోవర్ట్ లుగా పరిగణిస్తాం
- వీరిపై కఠిన చర్యలు తీసుకుంటాం
- కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకి అండగా ఉంటారు
- రేపు ముఖ్యమంత్రి పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.!
- నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించలేదు
- నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుంది
- కానీ ఓటు వేయని వారు ఇప్పుడు నన్ను సీఎం చేస్తామంటున్నారు.!
(సమన్వయ కమిటీ భేటీలో లోకేష్‌తో పవన్)
5.10 PM, Dec 1, 2023
టీడీపీ నేత కొల్లు రవీంద్ర పై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్
- కొల్లు రవీంద్రకు దేవుడు సిగ్గు లేకుండా మాట్లాడటమనే ఒక శాపం ఇచ్చాడు
- బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా
- సామాజిక సాధికారిక యాత్ర విజయంతం పై పట్టలేనంత కోపం ఈర్ష్య,ద్వేషంతో అబద్ధాలు మాట్లాడి కడుపు మంట తీర్చుకుంటున్నాడు
- మదరాసు స్థలం మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావు
- మీ హయాంలో పోర్ట్ కట్యకుండానే 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్
- పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారు
- పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఏకరాల్లో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే10 రోజుల ముందు శంఖుస్థాపన చేశావ్
- మెడికల్ కాలేజీ నా హాయం అంటున్నావు
- కనీసం ఒక్క జీఓ అయిన యిచ్చావా...ఇస్తే చూపించు
- ఈరోజు పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి చలవే
- ఎవరో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్ ని చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదు
- ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాం
- కానీ నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నాం
- సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయండి
5.10 PM, Dec 1, 2023
మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం
- జనసేనకు యువతే పెద్ద బలం
- మన పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారు
- ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల క్యాడర్ ఉంది
- ఇంతమంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదు
- పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతిస్తున్నారు
- నన్ను, నా భావజాలన్ని నమ్మే యువత మా వెంట వస్తున్నారు
- యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశాం
- నేనేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తా
- కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే మన పార్టీకి ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చింది
- సమాజాన్ని ఎలా చూస్తామనే దాని పై జనసేనలో స్పష్టమైన అవగాహన ఉంది
- నేను మొదట్నుంచీ పదవులు కోరుకోలేదు
- స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా
- చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది
- కష్టాల్లో ఉన్నాం, సాయం చేయాలని ఢిల్లీ పెద్దలను ఎప్పుడూ అడగలేదు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా, జనసేన కలిసి పనిచేశాయి
- YSRCPని తట్టుకోవాలంటే కలిసి పనిచేయాలని వాళ్లు చెప్పారు
- అవమానం జరిగినా, దెబ్బపడినా మరిచిపోను
- విభజన సమయంలో ఏం కావాలో ఎవరూ గట్టిగా అడగలేదు
- రాష్ట్రానికి ఏం ఇస్తే ఎలాంటి లాభమో ఏ నేతలూ ఆలోచించలేదు
- ఒక కులం మీద రాజకీయాలు నడపలేం.. సాధ్యం కాదు
- కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని కోరుతున్నా
- ఓడిపోయినప్పుడు మనకు అండగా ఎవరుంటారు అనేదే ముఖ్యం
- పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేకమంది బెదిరించారు
- ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని ఆ నాయకులకు చెప్పా
- మాకు ప్రజలు ముఖ్యం.. నాయకులు కాదు..
- అనివార్య పరిస్థితుల్లోనే 2014లో తెదేపాకు మద్దతిచ్చాం
- ఆ రోజుల్లో పార్టీని నడపలేకపోయాం.. నిలబడలేకపోయాం
- డబ్బు లేకున్నా పట్టుదలగా పదేళ్లపాటు పార్టీని నడిపాం
- ఇప్పుడు మాత్రం ప్రాణం పోయేవరకు నిలబడతాం
- మనపార్టీ నుంచి వెళ్లిపోయినవారు తిట్టినా పట్టించుకోను
- మనం తెదేపా వెనుక నడవడం లేదు.. కలిసి నడుస్తున్నాం
- షణ్ముఖ వ్యూహంలో చెప్పినవన్నీ అమలు చేయబోతున్నాం
- ఏ మతం వారినైనా సనాతన ధర్మం స్వీకరిస్తుంది.. కలుపుకుంటుంది
- ప్రజాస్వామ్య విధానంలో పరిపాలన చేస్తే ఎవరినైనా గౌరవిస్తాం
- మనం ఎన్ని మాట్లాడుకున్నా పోలింగ్ రోజు అనేది చాలా కీలకం: పవన్ కల్యాణ్
4.50 PM, Dec 1, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వాయిదా
- ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
- తదుపరి విచారణ వచ్చే నెల 6కు వాయిదా వేసిన హైకోర్టు
CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
- టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు
- కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
- లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు
- స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మూడుసార్లు మార్పు
- అలైన్‌మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
- 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్‌మెంట్‌లో మార్పులు
- ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
- అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
- ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్
- కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
- కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
- లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
- సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు
4.05 PM, Dec 1, 2023
పొత్తుల్లో సీట్లు పోతాయి.. ఏమనుకోవద్దు.!
- మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం
- పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం, పాల్గొన్న రాష్ట్రస్థాయి నాయకులు
- తెలుగుదేశంతో పొత్తును ముందుకు తీసుకెళ్లడం పై చర్చ
- క్షేత్రస్థాయిలో చాలా విభేదాలున్నాయని రెండు పార్టీల్లో ప్రచారం
- విభేదాలను పక్కనబెట్టి పొత్తు కోసం త్యాగాలు చేయాలని పవన్ పిలుపు
3.45 PM, Dec 1, 2023
కిం కర్తవ్యం.?
- అమరావతి: సాయంత్రం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ
- చంద్రబాబు కరకట్ట ఇంట్లో భేటీ
- పార్లమెంట్ సమావేశాల్లో ఏం చేయాలన్న దానిపై చర్చ
- ఢిల్లీలో ఏం చేయాలన్నదానిపై టీడీపీ ఎంపీలకు దిశానిర్ధేశం చేయనున్న చంద్రబాబు
3.00 PM, Dec 1, 2023
కరకట్ట ఇంటికి చంద్రబాబు
- కరకట్ట ఇంటికి వచ్చిన చంద్రబాబు
- గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసమీకరణకు టిడిపి ప్రయత్నాలు
- అందుబాటులో ఉన్నవారంతా రావాలంటూ పిలుపులు
- గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి టీడీపీ ర్యాలీ
2.30 PM, Dec 1, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు
- ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై హైకోర్టులో తిరిగి జరుగుతోన్న వాదనలు
- మధ్యాహ్న భోజన విరామం తర్వాత మళ్లీ మొదలైన వాదనలు
- సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్
- చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు
1.00 PM, Dec 1, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు బ్రేక్
- లంచ్ బ్రేక్ తర్వాత హైకోర్టులో వాదనలు కొనసాగే అవకాశం
12.30 PM, Dec 1, 2023
జనసేనలో సీట్ల సెగ, పవన్‌కు తగులుతున్న వేడి
- కాపుల ప్రతినిధిగా రాజకీయాలు నడపాలని పవన్ కళ్యాణ్ వ్యూహం
- తాజాగా జైలు ముందు తెలుగుదేశంతో పొత్తు తర్వాత కాపుల్లో జ్ఞానోదయం
- తమను పవన్ కళ్యాన్ కేవలం ప్యాకేజీ కోసం వాడుకుంటున్నాడని కాపుల అనుమానం
- ప్రతీ మీటింగ్‌లో తెలుగుదేశం పార్టీకి జై కొట్టాలని కాపులకు సూచిస్తోన్న పవన్‌కళ్యాణ్
- టికెట్లు రాకపోయినా.. సీట్లు త్యాగం చేయాలని కాపులకు పిలుపునిస్తోన్న పవన్ కళ్యాణ్
- ఇన్నాళ్లు నియోజకవర్గంలో చేసిన శ్రమ, పడ్డ కష్టానికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుందో అన్న అనుమానాలు
- కాపు నాయకుల సీట్లన్నీ తెలుగుదేశానికి ఇచ్చేస్తే.. తమ పరిస్థితి ఏంటన్న సందేహాలు
- తెలంగాణలో 8 సీట్లకు రాజీ పడ్డట్టు.. ఆంధ్రప్రదేశ్‌లో 16 సీట్లకు రాజీ పడితే తమ పరిస్థితి ఏంటని భయాలు
- త్యాగం చేయడమంటే.. తెలుగుదేశానికి జై కొట్టడమా?
- కాపుల రాజకీయ భవిష్యత్తుకు ఫుల్‌స్టాప్ పెట్టడమా?
- ఇంతకీ తెలుగుదేశంతో పొత్తు జనసేనకు లాభమా? లేక పార్టీ మూసుకునేంత నష్టమా?
12.30 PM, Dec 1, 2023
కాపులకు అన్యాయం చేశారా.? అంతే సంగతులు
ఏలూరు : పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి
60 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలను కాపులకు కేటాయించాలి : హరిరామజోగయ్య
కాపులకు అన్యాయం జరక్కుండా జనసేన చూసుకోవాలని సూచన
(ఫైల్ ఫోటో : హరిరామ జోగయ్యతో పవన్ కళ్యాణ్)
12.00 PM, Dec 1, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు @ హైకోర్టు
- ఏపీ హైకోర్టులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కుంభకోణం కేసు
- ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
- సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు
- తనకు కావలసిన వారికి లబ్ది చేకూర్చడం కోసం IRR అలైన్మెంట్ లో చంద్రబాబు మార్పులు చేశారు
- లింగమనేని రమేష్ ఇంట్లో చంద్రబాబు ఉండటానికి కారణం IRR ద్వారా రమేష్ కు లబ్ది చేకుర్చటమే
- ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుంది
- చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు, పార్టీ, పార్టీ సభ్యులకు లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు
- రాజధాని గుర్తించటానికి ముందే రాజధాని సమీపంలోనే కీలక ప్రాంతాల్లో భూములను చంద్రబాబు సన్నిహితులు కొన్నారు
11:40 AM, Dec 1, 2023
బాబు క్వాష్ కొట్టేయడమే మిగిలిందా.?
►నేడో, రేపో బాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు
►17ఏ సెక్షన్‌ను తనకు అనుకూలంగా మార్చుకుని చంద్రబాబు క్వాష్ పిటిషన్
►చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు
►చంద్రబాబు తరపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు
►CID తరపున ముకుల్ రోహత్గీ వాదనలు
►17ఏ సెక్షన్ ప్రకారం తనను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి అన్న బాబు లాయర్లు
►ఏ చట్టం అయినా, ఏ సెక్షన్ అయినా అవినీతిని అడ్డుకునేదే తప్ప.. సమర్థించేది కాదన్న CID లాయర్లు
►నేరం ముందే జరిగింది, దర్యాప్తు ముందే మొదలయింది, కాబట్టి చంద్రబాబుకు ఎలాంటి మినహాయింపు అవసరం లేదన్న CID లాయర్లు
►సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ లో పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
►సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు బృందం కోటి ఆశలు
►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తే.. మిగిలింది బెయిల్ పిటిషన్ మాత్రమే.
►క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం తర్వాతే బెయిల్ పిటిషన్ గురించి పరిశీలించే అవకాశం
11:33 AM, Dec 1, 2023
నారా చంద్రబాబు నాయుడు.. కొన్ని అసలు సిసలు వాస్తవాలు
మా బాబు చాలా మంచోడు, రాజకీయ కక్షతో కేసులు పెట్టారు : ఎల్లో మీడియా
►మరి చంద్రబాబు నిజంగా మంచోడేనా? చంద్రబాబుపై ఎలాంటి కేసులు లేవా?
►వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు గురించి బాగా తెలిసిన వాళ్లు ఇప్పటివరకు ఏమన్నారు?
►చంద్రబాబు కీలకమైన/వివాదస్పదమైన అంశాల గురించి ఏమన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది?
తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు
►మొదటి నుంచి చంద్రబాబుది నేరప్రవృత్తే
►ధర్నాలప్పుడు ప్రభుత్వ బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు చెప్పేవాడు
టిడిపి సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
►అమరావతిలో భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతుల పొలాలను చంద్రబాబు తగలబెట్టించారని అక్కడి స్థానిక అధికారులు నాకు చెప్పారు
ఆనాటి స్పీకర్ కోడెల చౌదరి
చంద్రబాబు కట్టిన తాత్కాలిక భవనాల్లో ఒకటైన అసెంబ్లీలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కారితే ...
►"ఇది విపక్షాలు చేయించిన పనే అని సీసీటీవీ ఫుటేజి ఉంది, రెండు రోజుల్లో ఆధారాలు బయటపెడతా" అని మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఆ తరువాత మూడేళ్లు స్పీకర్‌గా ఉండికూడా చూపలేదు.
►నిజంగా కుట్రే అయితే.. ఎందుకు బయటపెట్టలేదు?
►అంటే చేయించింది చంద్రబాబు, తెలుగుదేశం నేతలా?
కాపు ఉద్యమ సమయంలో తునిలో రత్నాచల్ రైలు తగలబడినప్పుడు చంద్రబాబు వెంటనే ప్రెస్‌మీట్ పెట్టారు
►"రైలు తగలబెట్టింది రాయలసీమ రౌడీలు, పులివెందుల రౌడీలు" అని చెప్పాడు, కానీ అరెస్ట్ చేసింది మాత్రం కోస్తా జిల్లాకు చెందిన కాపులను.?
►ముందు చంద్రబాబు ఎందుకు ప్రకటన చేశాడు? ఆ తర్వాత పోలీసులెందుకు అరెస్ట్‌లు చేశారు?
►అంటే రైలు తగలబెట్టే విషయం ముందే చంద్రబాబుకు తెలిసిందా? ఓట్ల కోసం మాట మడతేశారా?
చిత్తూరు జంట హత్యల కేసులో మరీ విడ్డూరం
►నవంబర్ 17 , 2015న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు మేయర్ దంపతుల హత్య జరిగింది. వారిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినవారు.
►ఆ వెంటనే చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టాడు. ఇది `బలిజల మీద రెడ్ల దాడి.. విపక్షనేతలే ఈ హత్య చేయించారు` అని ఆరోపణలు చేశారు.
సీన్ కట్ చేస్తే ..
►మేయర్ దంపతుల హత్య ఆస్థి తగాదాల కోసం జరిగిందని, అది చేసింది మేయర్ మేనల్లుడు చింటూ అని చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు.
మొత్తమ్మీద అన్ని పరిశీలన చేసి చెప్పే విషయం ఏంటంటే..
►ఏం జరిగినా.. దాన్ని స్వప్రయోజనాల కోసం, తన సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునే అలవాటు చంద్రబాబుదే
►బట్టకాల్చి ఇతరుల ముఖాన వేసి మసి తుడుచుకోండి అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే
ఇక చంద్రబాబుపై కేసుల గురించి వ్యాఖ్యలు చేసే వారు ఒకసారి ఆయన చరిత్ర చూడండి.
►15 సార్లు వేర్వేరు కేసుల్లో దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుది
►తన కోసం, తన వాళ్ల కోసం ఖజానాను దోచిన కేసులో అనూహ్యంగా అరెస్టయ్యారు
►ఇది అనూహ్యం అని ఎందుకు అంటారంటే.. ఏ పని చేసినా సాక్ష్యాలు లేకుండా చేస్తారన్నది చంద్రబాబుకు ఉన్న పేరు
►అందుకే మా బాబుకు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఎల్లో మీడియా ఎగిరెగిరి పడేది.!
11:22 AM, Dec 1, 2023
లోకేష్ ప్రకటనలేంటీ? వాస్తవాలేంటీ?
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్
పాదయాత్రలో లోకేష్ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ?
అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP
- మీ టాలెంట్‌పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది?
- కొడుకు లోకేష్‌కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్‌కళ్యాణ్‌ను పట్టుకున్నారు
- పవన్‌కళ్యాణ్ సపోర్ట్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు
- నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్‌గా ఎందుకు పోటీ చేయరు?
- మీకు పవన్ కళ్యాణ్, జనసేన సపోర్ట్ ఎందుకు?
- నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్ స్టిక్‌గా పవన్ కళ్యాణ్‌ను పట్టుకున్నారా?
- పైగా మీకు మరో సపోర్ట్ బీజేపీ కావాలా?
- పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా?
- ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి
- మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి
- భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి
- లోకేష్.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్ కళ్యాణ్‌కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు
- నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు
11:15 AM, Dec 1, 2023
బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం
- దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్
- ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్‌రోల్ మెంట్ చేయించిన టీడీపీ
- తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు
- సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు
- ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
- రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి
- చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు
- ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు
- మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని
- వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు
11:00 AM, Dec 1, 2023
ఇవ్వాళ చంద్రబాబు కేసుల స్టేటస్.!
- ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
10:42 AM, Dec 1, 2023
వాట్ ఐ యామ్ సేయింగ్.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..!
- చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు
- ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా
- ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
- కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్
- విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం
- ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన
- "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్
- ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు
- "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్ ఐ యామ్ సేయింగ్" గురించి చెప్పని చంద్రబాబు
- "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్
- ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్
- బాలకృష్ణ చేసిన "అన్‌స్టాపబుల్ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు
- అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా?
9:20 AM, Dec 1, 2023
ఆ సలహా ఇచ్చింది ఎవర్రా?
- తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్ అంశం
- లోకేష్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ
- 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి?
- పవన్ కళ్యాణ్‌కు జై కొట్టమని లోకేష్‌కు సలహా ఇచ్చింది ఎవరు?
- తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్‌కు అర్థమవుతోందా?
- తన కెరియర్‌తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా?
- ఇప్పుడు కాపుల కోసం పవన్‌కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం?
- అసలు పవన్‌కళ్యాణ్‌కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్‌కు ఏం లాభం?
- పైగా పవన్‌ను దూరం చేసే ప్లాన్ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు?
08:24 AM, Dec 1, 2023
తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు బాబు ఝలక్
- ఏపీలో పవన్ ఎక్కువ సీట్లు అడగకుండా కట్టడి
- రాజకీయ అపరిపక్వతతో అవకాశాన్ని జారవిడుచుకున్నామంటున్న జనసేన నేతలు
- మరోసారి తన నైజాన్ని చాటుకున్న కరివేపాకు రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు
- పొత్తుల కోసం అర్రులు చాస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు గట్టి షాక్
- ఏపీలో జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం లేకుండా తెలంగాణ ఎన్నికలను వినియోగించుకున్న చంద్రబాబు
- తెలంగాణలో జనసేన ఎక్కడా గెలవకుండా, వీలైతే డిపాజిట్లు కూడా రాకుండా చంద్రబాబు ఎత్తుగడ
- రాజకీయ వర్గాల్లో చర్చ
- ఒకపక్క బీజేపీతో అంటకాగుతూనే టీడీపీతో కలసి పోటీ చేస్తానంటూ రాజమహేంద్రవరం జైలు వద్ద పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
- తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది
- అక్కడ ఎన్నికలకు దూరంగా ఉంటూ అస్త్ర సన్యాసం చేసిన టీడీపీ లోపాయికారీగా కాంగ్రెస్‌కు సహకారం అందించిన విషయం బహిరంగ రహస్యమే.
- ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు స్నేహహస్తం సాచిన టీడీపీ శ్రేణులు బీజేపీ–జనసేన కూటమికి దూరంగా నిలిచేలా పావులు కదిపిన చంద్రబాబు
07:59 AM, Dec 1, 2023
నేడు జనసేన విస్తృతస్థాయి సమావేశం
- మంగళగిరిలో పవన్ అధ్యక్షతన జరగనున్న సమావేశం
- జనసేన, టీడీపీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్న పవన్
- రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైఎస్సార్‌సీపీని ఎదుర్కోగలమని వివరించనున్న పార్టీ అధ్యక్షుడు
- పొత్తుల విషయంలో టిడిపి తో పేచీ పడకుండా రాజీ పడాలని ముఖ్య నేతలకు సూచించనున్న పవన్ కళ్యాణ్
- ఇచ్చిన సీట్లతోనే సర్దుకోవాలని ఇప్పటికే సంకేతాలిస్తున్న పవన్ కళ్యాణ్,
- చంద్రబాబు లోకేష్ పర్యటనల్లో తెలుగుదేశానికి జై కొట్టాలని జనసేన సైనికులకు సూచనలు, టికెట్ దక్కకుండా నిరాశ పడకుండా తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలని పార్టీ కార్యవర్గానికి నేడు సూచించనున్న పవన్ కళ్యాణ్
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా రాబోయే ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ గారి ప్రజాబలం ముందు వాళ్ళు నిలవలేరు. అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్న @ysjagan గారి విజయం తథ్యం.#PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/s5pjyHTHYh
— YSR Congress Party (@YSRCParty) November 30, 2023
07:49 AM, Dec 1, 2023
తెలుగుదేశం, జనసేన పొత్తుల వెనక పాలిట్రిక్స్ ఏంటీ? : YSRCP
- చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ జై పవన్ కల్యాణ్ అని ఎందుకు అంటున్నారు?
- లోకేష్‌కు ఇంకా రాజకీయం ఒంటబట్టలేదు
- ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు
- చంద్రబాబు పెట్టుకున్న ఆశల్లో పది శాతం కూడా చేరలేకపోయాడు
- మిగిలింది పార్టీ కాడి మోసేవారొకరు కావాలి
- అందుకే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పరువును తాకట్టు పెట్టేశారు
- తనకు సరిసాటి అయిన పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నాడు
- రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవని పవన్.. ఇప్పుడు లోకేష్‌కు ఆశ, భరోసా
- తెలంగాణలో బీజేపీతో పవన్ ఉంటాడు..!!
- టీడీపీ ఏమో కాంగ్రెస్‌కు పరోక్ష మద్దతు..
- ఏపీలో మాత్రం మళ్లీ టీడీపీ - జనసేన స్నేహం..!!
- అసలు వీళ్లు రాజకీయం చేస్తున్నారా..? వ్యభిచారం చేస్తున్నారా...?
- 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 38 శాతం.
- జనసేనకు వచ్చిన ఓట్లు 5 శాతం..
- వైఎస్ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం.
- టీడీపీ - జనసేన ఓట్లు కలిపినా.. వైఎస్‌ఆర్ సీపీకి వచ్చిన ఓట్లు అన్ని లేవు.
- 2024లో టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు.. మరింత దెబ్బ పడబోతుంది...!!!
- ఇప్పటివరకు ఏ బీసీ ఓట్ల మీదయితే టిడిపి నమ్మకం పెట్టుకుందో..ఆ బీసీ ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడబోతున్నాయి.
- ఈ భయంతోనే ... పవన్ కల్యాణ్ పాట అందుకున్నారు..
- చంద్రబాబు , లోకేష్...!!!!
- రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు.. పాదయాత్రలో లోకేష్..
- వారాహి ఎక్కి పవన్ ప్రజలకు ఏం చెబుతారు..?
- మేం నీతిమంతులమని చెబుతారా..? మేం నిప్పులమని చెబుతారా..?
- మేం స్కామ్‌లు చేయలేదని చెబుతారా..?
- మీరు నీతిమంతులైతే.. మీరు స్కామ్‌లు చేయకపోతే..
- మీరు నిప్పులే అయితే.. ధీమాగా సింగిల్‌గా పోటీ చేయండి
07:15 AM, Dec 1, 2023
హస్తినలో కిం కర్తవ్యం?
- చంద్రబాబు అధ్యక్షతన నేడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
- కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం
- పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ
- పార్లమెంట్‌లో ఏ ఏ అంశాలు చర్చించాలన్నదానిపై చంద్రబాబు బ్రీఫింగ్
- డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు
- అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరగనున్న పార్లమెంటు సమావేశాలు
- అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని భావిస్తోన్న తెలుగుదేశం
- తెలంగాణలో కాంగ్రెస్ కోసం సర్వశక్తులు ఒడ్డిన చంద్రబాబు, తెలుగుదేశం
- అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితేనే.. చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు
- పార్లమెంటులో బీజేపీని ఇప్పటికిప్పుడు ఏం అనొద్దు, అదే సమయంలో తెర వెనక కాంగ్రెస్‌తో మంతనాలు కొనసాగించాలని చంద్రబాబు వ్యూహం
Comments
Please login to add a commentAdd a comment