Nov 27th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Naidu Cases Petitions And Political Live Updates And Latest News In Telugu - Sakshi
Sakshi News home page

Nov 27th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Mon, Nov 27 2023 6:58 AM | Last Updated on Mon, Nov 27 2023 7:31 PM

TDP Chandrababu Cases Petitions And Political Updates 27 November - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

07:29PM, Nov 27, 2023

ఈనెల 30న తిరుమల వెళ్లనున్న చంద్రబాబు

  • డిసెంబర్ 1న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
  • కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
  • అదే రోజు అమరావతి తిరిగిరానున్న చంద్రబాబు
  • తర్వాత రోజుల్లో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు
  • సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు
  • డిసెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాలకు చంద్రబాబు

6:05 PM, Nov 27, 2023
ప్రభుత్వంపై పచ్చపత్రికల విషం ఇంకెన్నాళ్లు ? : సజ్జల రామకృష్ణారెడ్డి

  • సీఎం జగన్‌, YSRCP ప్రభుత్వంపై టన్నుల కొద్దీ విషాన్ని చిమ్ముతున్న రామోజీ, రాధాకృష్ణ
  • ఎల్లో మీడియా ఉగ్రవాదం స్థాయి దాటి.. బరితెగించింది.
  • సచ్ఛీలుడివైనట్లు ప్రవచనాలు వల్లిస్తే ఎలా రామోజీ..?
  • ఆ పత్రికలు టీడీపీ కరపత్రాల స్టేజ్‌ దాటిపోయి.. కరదీపికలుగా మారాయి.
  • జగన్‌ గారు 99 శాతం హామీలు అమలు చేస్తే.. మిగిలిన ఆ ఒక్క శాతం మీద రాస్తారు
  • బాబు కోసం..ఇక్కడేదో ఘోరాలు జరుగుతున్నట్లు నిత్యం రోత రాతలు
  • చంద్రబాబు అక్రమాల సంగతేంటీ?
  • పారదర్శకంగా ఇసుక విధానం అమలు చేస్తున్నాం
  • ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగినప్పుడు మీ రాతలేమయ్యాయి?
  • నాడు ఎన్జీటీ వంద కోట్ల పెనాల్టీ వేసినప్పుడు మీ రాతలు ఏమయ్యాయి ..?
  • కానుకల పేరుతో హెరిటేజ్‌ మజ్జిగ టెండర్‌ను కొట్టేసింది చంద్రబాబు కాదా..?
  • ఉచితంగా పత్రిక పంచుతారా?
  • అసలు నీకు 175 స్థానాలకూ అభ్యర్థులున్నారా బాబూ..?
  • విషాన్ని మరింత ఎక్కించేందుకు ఉచితంగా ఈనాడు పంపిణీ
  • వీళ్ల ఎల్లో రాతలతో చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నాడు.
  • రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు జగన్‌గారు అండగా నిలిచారు అందుకే మేం ఇంత ధీమాగా ఉన్నాం.
  • మా ప్రభుత్వంలో టీడీపీ వారికి ఒక్కరికైనా సంక్షేమం ఆగిందా?
  • చివరికి రాజకీయాన్ని వ్యభిచారంలా చంద్రబాబు అండ్ కో మార్చారు
  • లోకేశ్‌ పాదయాత్రపై
  • భయాన్ని పరిచయం చేసే వాడివి ఢిల్లీ ఎందుకు పారిపోయావ్‌ లోకేశ్‌..?
  • అసలు భయం, భయపడటం అనే ప్రశ్న రాజకీయాల్లో ఎందుకొస్తుంది..?
  • ఆఫ్‌ చేసిన లోకేశ్ టేప్‌ రికార్డర్‌ మళ్లీ మొదలైంది
     

5:15 PM, Nov 27, 2023
ఢిల్లీలో దిగగానే రాజకీయం షురూ.!

  • ఢిల్లీకి చంద్రబాబు రాగానే ఎయిర్‌పోర్టుకు వచ్చేసిన రఘురామ కృష్ణరాజు
  • హైదరాబాద్‌లోనూ చంద్రబాబును కలిసిన రఘురామ కృష్ణరాజు
  • వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తోన్న రఘురామ కృష్ణరాజు
  • గత కొన్నాళ్లుగా తెలుగుదేశం ఎజెండాను ఫాలో అవుతోన్న రఘురామ కృష్ణరాజు
  • ఎల్లోమీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయడంలో సిద్ధహస్తుడైన రఘురామ
  • అబద్దాలు, అసత్యాలు, నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న రఘురామ
  • చంద్రబాబు కోసం ఢిల్లీలో లాయర్ల ఆఫీసులు తిరిగిన రఘురామ
  • లోకేష్‌ ఢిల్లీలో ఉన్నన్నాళ్లు కావాల్సిన ఏర్పాట్లు చేసిన రఘురామ

4:25 PM, Nov 27, 2023
ఢిల్లీకి చంద్రబాబు

  • ఢిల్లీకి టిడిపి అధినేత చంద్రబాబు
  • టిడిపి లాయర్‌ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు
  • చంద్రబాబుతో పాటు వెంట వెళ్లిన నారా భువనేశ్వరి
  • రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్‌ రద్దు పిటిషన్‌
  • ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్‌ 17ఏ కేసు
  • క్వాష్‌ పిటిషన్‌పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు
  • ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు స్వాగతం పలికిన కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామకృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు తదితరులు
     

3:45PM, Nov 27, 2023

లోకేష్‌పై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్‌
విజయవాడ:

  • లోకేష్‌ ఎక్కడైనా ఎమ్మెల్యేగా చేశాడా?
  • చంద్రబాబు ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదంటే లోకేష్‌ మాట్లాడలేదు
  • అంబేద్కర్‌ విగ్రహం ముళ్లపొదల్లో పెట్టాలని బాబు చూశాడు
  • చంద్రబాబు దళితులను అవమానించాడు.. దాడులు చేయించాడు
  • బాబు, జగన్‌కు నక్కకు నాక లోకానికి ఉ‍న్నంత తేడా ఉంది
  • అంబేద్కర్‌ పేరు ఉచ్చరించడానికి లోకేష్‌కు, చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదు
  • ఐదేళ్ల పాలనలో దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
  • మాకు సమవుజ్జీకాని వ్యక్తి,రాజకీయాల్లో లేని లోకేష్‌కు మేం సమాధానం చెప్పనవసరం లేదు

2:50PM, Nov 27, 2023

ఎల్లోమీడియా టీడీపీ కరపత్రం స్టేజ్‌ దాటిపోయింది: సజ్జల

  • 2014-18 మధ్య చంద్రబాబు ప్రజలకు ఏం చేశారు?
  •  ఇప్పుడు టీడీపీ పెట్టిన వంద పథకాలు ఆపారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు
  • నాడు కనీసం ఒక పథకాన్ని అయినా బాబు పూర్తిగా అమలు చేశారని చెప్పగలరా?
  • టీడీపీ నేతలు బరితెంగించారు. గతంలో ఉచితంగా ఇసుక అని చెప్పారు. 
  • ఇసుక ఉచితమైతే దెందలూరు ఎమ్మెల్యే ఎమ్మార్వోతో ఎందుకు అలా ప్రవర్తించారు
  • ఇసుక ఉచితమైతే.. జేసీబీలు ఎవరు పెట్టారు. ఎన్‌జీటీ వంద కోట్ల పెనాల్టీ ఎందుకు వేసింది. 
  • చంద్రబాబు పెట్టిన పథకాలు ఉంటే కదా జగన్‌ వచ్చి తీసివేయడానికి. ఇసుక అక్రమ దందాలో అందినకాడికి టీడీపీ నేతలు దోచుకున్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతీచోటా ఇసుక దందా చేసింది టీడీపీనే
  • మా ప్రభుత్వ హయాంలో అవినీతికి తావు లేకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి
  • ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి అమలు చేసిన నాయకుడు సీఎం జగన్‌ 
  • అర్హత ఉన్న వారికి ఎక్కడైనా పథకం ఆగిందా చెప్పాలంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు సవాల్‌
  •  ఎల్లోమీడియా టీడీపీ కరపత్రం స్టేజ్‌ దాటిపోయింది
     

2:47 PM, Nov 27, 2023
క్షమించడానికైనా ఓ లెక్క ఉండాలప్ప.!

  • క్షమించాలి... ప్లీజ్‌.. నన్ను క్షమించాలి : లోకేష్‌
  • యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చినందుకు క్షమించాలి
  • నిజాలు ఎప్పుడు చెబుతావు లోకేష్‌ ? : YSRCP
  • తండ్రి జైలుకు వెళ్లగానే అరెస్ట్‌ చేస్తారన్న భయంతో ఢిల్లీ పారిపోయావు
  • అరెస్ట్‌ చేయబోమని కోర్టులో CID చెప్పిన తర్వాతైనా పాదయాత్ర ప్రారంభించలేదు.!
  • పాదయాత్ర చేయకపోతే పరువు పోతుందని పార్టీ సీనియర్లు చెప్పినా వినలేదు.!
  • నేను నడవను గాక.. నడవనంటూ హైదరాబాద్‌కు పరిమితమయ్యావు
  • శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు నడవమని చంద్రబాబు చెబితే వినలేదు.!
  • విశాఖతో సరిపెడతానంటూ పేచి పెట్టిన విషయం ప్రజలకెందుకు చెప్పలేదు?
  • పార్టీకి ఏం ప్రయోజనం ఉంటే నాకెందుకు? నేనేందుకు నడవాలని గొడవ పెట్టుకున్న విషయం ఎందుకు చెప్పలేదు?
  • చేసిందంతా చేసి.. ఇప్పుడు జనం మధ్యలోకొచ్చి క్షమించమని అడుగుతున్నావా?

2:27 PM, Nov 27, 2023

మద్యం కేసు .. తీర్పు రిజర్వ్‌

  • ఏపీ హైకోర్టు: గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం
  • బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లు
  • పూర్తయిన ఇరుపక్షాల వాదనలు
  • తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

2:15 PM, Nov 27, 2023
నిజాలు చెప్పవా.. నారా లోకేష్.?

  • లోకేష్‌
  • చంద్రబాబును జైలుకు పంపితే నా పాదయాత్ర ఆగుతుందని అనుకున్నారు
  • స్కిల్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా?
  • వ్యవస్ధలను మేనేజ్ చేసి చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టారు
  • నాపై కూడా సిఐడి కేసులు పెట్టారు.. ఒక్క ఆధారం లేదు
  • ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా  
  • లోకేష్‌ వ్యాఖ్యలపై YSRCP సూటి ప్రశ్నలు
  • చంద్రబాబు, లోకేష్‌ తప్పు చేయలేదని కోర్టుకు ఎందుకు చెప్పలేదు?
  • 17a సెక్షన్‌ కింద మినహాయింపు ఎందుకు అడుగుతున్నారు?
  • గవర్నర్‌ ముందస్తు అనుమతి అంటున్నారు తప్ప.. మా తప్పేమీ లేదని ఎందుకు చెప్పరు?
  • మీ వాదనలో పస ఉంటే.. సుప్రీంకోర్టు దాకా ఎందుకు?
  • ప్రజల ముందు అబద్దాలు ఇంకెన్నాళ్లు చెబుతారు?
  • CID కోర్టుకు ఇచ్చిన ఆధారాల గురించి ప్రజలకు చెప్పరా?

2:04 PM, Nov 27, 2023
మద్యం కేసు @ హైకోర్టు

  • మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పై విచారణ
  • లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు

1:30 PM, Nov 27, 2023
బీటెక్‌ రవి రిమాండ్‌ పొడిగింపు

  • బీటెక్ రవికి మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు
  • వచ్చే నెల 11 వరకు రిమాండ్ పొడిగించిన కడప మెజిస్ట్రేట్ 
  • బీటెక్ రవిని కడప కోర్టు నుంచి జైలుకు తరలింపు
  • నారా లోకేష్‌ పర్యటనలో పోలీసులపై దౌర్జన్యం చేసిన బీటెక్‌ రవి
  • బీటెక్‌ రవి దాడిలో ఓ పోలీసు కాలుకు గాయం, ఫ్యాక్చర్‌
  • క్రికెట్‌ బెట్టింగ్‌ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్‌ రవి
  • ఎమ్మెల్సీగా గెలిచిన సమయంలో సింహాద్రిపురంలో బీటెక్‌ రవి వివాదస్పద వ్యాఖ్యలు
  • "జూదం మా బ్లడ్‌లోనే ఉంది" అంటూ నాడు బీటెక్‌ రవి వ్యాఖ్యలు
  • టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీటెక్‌ రవి దందాలు, దౌర్జన్యాలు

12:48 PM, Nov 27, 2023
సంగం డెయిరీ పేరిట టిడిపి మోసం

  • ఏలూరు జిల్లా : సంగం డెయిరీ చైర్మన్,టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్రపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతుల డిమాండ్‌
  • ఏలూరు స్పందన లో ఫిర్యాదు చేసిన రైతులు
  • బోనస్‌ 14% ఇస్తామని ఆశ చూపి తమని మోసం చేశారని ఫిర్యాదు
  • అడిగితే.. దాడులు చేశారని చెప్పిన చింతలపూడి, దెందులూరు కు చెందిన రైతులు
  • పాడి రైతులకు  పార్టీలు ఆపాదిస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
  • కోపరేటివ్ సొసైటీ నీ కంపెనీ యాక్ట్ లోకి తెచ్చి రైతులను మోసం చేస్తున్నారనీ స్పష్టం చేసిన రైతులు
  • సంగం డెయిరీ యాజమాన్యం నుండి తమకు రావలసిన 14% బోనస్ ఇప్పించాలని కోరుతున్న రైతులు
  • భవిష్యత్తులో పాడి రైతులు నష్టపోకుండా సంగం డెయిరీ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు

12:28 PM, Nov 27, 2023
సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!

  • మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు
  • నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు
  • అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు
  • ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం  వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు
  • ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం
  • కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ
  • టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్
  • ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్
     

10:04 AM, Nov 27, 2023
రేపు సుప్రీంకోర్టు ముందుకు స్కిల్‌ స్కాం కేసు

  • స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
  • టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
  • నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
  • జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
  • సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
  • ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
  • అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
  • షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
  • విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
  • పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
  • ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
  • విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
  • స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
  • నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
  • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
  • రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
  • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
  • చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
  • 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
  • సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
  • ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
  • రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
  • కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • నవంబర్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు
  • హైకోర్టు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసిన CID
  • రేపు విచారణకు రానున్న CID పిటిషన్‌

9:43 AM, Nov 27, 2023
ఇసుక కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?

  • టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇసుక కుంభకోణం
  • ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
  • చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ
  • 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్‌ల వారీగా వేలం పాటలు
  • చంద్రబాబు వచ్చాక పలు మార్పులు
  • తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్‌లు అప్పగిస్తున్నామని ప్రకటన
  • మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై పూర్తి నియంత్రణ టీడీపీ నేతలదే
  • మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు
  • ఎమ్మెల్యేలు, మంత్రులు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతల ఇష్టారాజ్యం
  • చంద్రబాబు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు
  • ఏపీలో 2014-19 మధ్య జరిగిన ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్‌
  • చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
  • ఇప్పుడు టీడీపీకి మద్దతు ఇస్తున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆ రోజుల్లో టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు
  • కేవలం ఇసుకలోనే పదివేల కోట్ల దోపిడీ జరిగిందని ఎన్.జి.టి.కి ఫిర్యాదు
  • CID నమోదు చేసిన కేసులో చంద్రబాబు మధ్యంతర, ముందస్తు బెయిల్ పై విచారణ
  • ఇసుక అక్రమాల కేసులో ఏ2గా ఉన్న చంద్రబాబు
  • APMDC ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ
  • ఇసుక స్కాం కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్లు
  • విచారణకు చంద్రబాబు సహకరిస్తారు, ముందస్తు బెయిల్‌ ఇవ్వండి
  • 2016లో కేబినెట్‌ ఆమోదంతోనే అప్పటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తెచ్చింది
  • 2019లో సీఎంగా చంద్రబాబు పదవీకాలం ముగిసింది
  • 2023లో APMDC  ఫిర్యాదు చేసింది : చంద్రబాబు లాయర్లు

9:30 AM, Nov 27, 2023
చంద్రబాబు కేసుల స్టేటస్‌ ఏంటీ?

  • కేసు : స్కిల్ కుంభకోణం
  • స్టేటస్‌ : నవంబర్‌ 20న బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు
  • వివరణ :  నవంబర్‌ 28వరకు చంద్రబాబుపై ఆంక్షలు, చికిత్స చేయించుకున్న వివరాలు సమర్పించాలని ఆదేశం
     
  • కేసు : స్కిల్ స్కాం
  • అంశం : క్వాష్‌ పిటిషన్‌
  • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
  • వివరణ : ఈ నెలాఖరుకు తీర్పు వచ్చే అవకాశం
     
  • కేసు : ఇసుక కుంభకోణం
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
  • వివరణ : నవంబర్‌ 30కి తదుపరి విచారణ వాయిదా
     
  • కేసు : ఫైబర్‌ నెట్‌ పేరిట నిధుల దోపిడి
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : సుప్రీంకోర్టులో పెండింగ్‌
  • వివరణ : నవంబర్‌ 30కి తదుపరి విచారణ వాయిదా
     
  • కేసు : అంగళ్లులో అల్లర్లు రెచ్చగొట్టిన కేసు
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : మంజూరు చేసిన హైకోర్టు
  • వివరణ : ఏ1గా ఉన్న చంద్రబాబు, మరో 170 మంది ఇతర నిందితులు
     
  • కేసు : ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాల కేసు
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
  • వివరణ : నవంబర్‌ 29కి వాయిదా పడ్డ కేసు
  • కేసు : మద్యం విధానాల్లో అక్రమాలకు పాల్పడి నిధులు కొట్టేసిన కేసు
  • అంశం : ముందస్తు బెయిల్‌  పిటిషన్‌
  • స్టేటస్‌ : హైకోర్టులో జరుగుతున్న విచారణ
  • వివరణ : నవంబర్‌ 30కి వాయిదా పడ్డ విచారణ
     

8:45 AM, Nov 27, 2023
యువగళం.. హస్యగళం.?

  • లోకేష్‌ యాత్రపై అంబటి చురకలు
  • ఎవరి కోసం? ఎందు కోసం?
  • ప్రజలు నవ్వుకోడానికి తప్ప యువగళం ఇంకెందుకు?

8:45 AM, Nov 27, 2023
యువగళం.. ఎంతవరకు?

  • రాజమండ్రి వచ్చిన లోకేష్
  • చాలా రోజుల తర్వాత ప్రజల ముందుకు వస్తోన్న లోకేష్‌
  • వాయిదాల పర్వం తర్వాత మొదలైన యువగళం
  • అప్పుడు విరామం ప్రకటించిన పొదలాడు నుంచే యాత్ర ప్రారంభం
  • ఉదయం 10:19 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం
  • ప్రజల దృష్టి ఏమార్చేందుకు పార్టీ శ్రేణులను భారీగా రప్పించిన తెలుగుదేశం
  • ఘనస్వాగతం పలికి లోకేష్‌లో జోష్‌ తీసుకురావాలని సూచించిన చంద్రబాబు
  • పాదయాత్రలో కచ్చితంగా పాల్గొనాలని అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జ్‌లకు ఆదేశం
  • పాశర్లపూడి, అప్పనపల్లి మీదుగా అమలాపురంలోకి పాదయాత్ర
  • ఇప్పటివరకు 209 రోజుల్లో 2,852 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర
  • రాజోలు, పి.  గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో యాత్ర
  • జనసేన కార్యకర్తలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు కచ్చితంగా కనిపించాలని పవన్‌కళ్యాణ్‌కు ఆదేశాలు
  • లోకేష్‌ యాత్ర విజయవంతమయిందన్న పేరు వస్తేనే కూటమికి మనుగడ అంటోన్న చంద్రబాబు


 

8:42 AM, Nov 27, 2023
ఢిల్లీకి చంద్రబాబు, క్వాష్‌పై కింకర్తవ్యం?

ఢిల్లీకి టిడిపి అధినేత చంద్రబాబు
తమ లాయర్‌ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కు వెళ్లనున్న చంద్రబాబు
చంద్రబాబుతో పాటు వెళ్లనున్న నారా భువనేశ్వరి
రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్‌ రద్దు పిటిషన్‌
ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్‌ 17ఏ కేసు
క్వాష్‌ పిటిషన్‌పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు
 

8:24 AM, Nov 27, 2023
నోరు జారి.. కడుపుమంట బయటపెట్టి..!

నేడు బండారు అరెస్ట్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ
మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యల కేసులో బండారు అరెస్ట్ పై పిటిషన్

8:04 AM, Nov 27, 2023
మద్యం కేసు @ హైకోర్టు

అమరావతి: మద్యంకేసుపై నేడు హైకోర్టులో విచారణ
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
ఇష్టానుసారంగా తన వాళ్ల మద్యం కంపెనీలకు అనుమతులిచ్చిన చంద్రబాబు
చంద్రబాబు నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం

7:41 AM, Nov 27, 2023
టీడీపీ నిర్వాకం.. లండన్‌లో ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా

  • ఇళ్లలోకి చొరబడి వివరాలు సేకరిస్తున్న టీడీపీ కార్యకర్తలు
  • టీడీపీ మేనిఫెస్టో వెబ్‌సైట్‌కి ఆ వివరాలు అనుసంధానం
  • ఆ సమాచారం అంతా లండన్‌లోని సర్వర్‌లో నిక్షిప్తం
  • ఇందుకోసం ప్రజల ఫోన్‌ నంబర్లు, వారి ఓటీపీ నంబర్ల కోసం ఒత్తిడి
  • రాజకీయ అవసరాల కోసం ప్రజల భద్రతను పణంగా పెట్టిన చంద్రబాబు
     

7:00 AM, Nov 27, 2023
నేటి నుంచే లోకేష్ యువగళం పాదయాత్ర

  • యువగళం పాదయాత్ర ఆగిన చోటు నుంచే తిరిగి ప్రారంభం
  • కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ రిలీజ్
  • ఈరోజు ఉదయం 10.19 గంటలకు యువగళం పాదయాత్ర ప్రారంభం
  • మొదటి రోజు తాటిపాకలో నారా లోకేష్ బహిరంగ సభ
  • ఇచ్చాపురం వరకు చేయాలన్న చంద్రబాబు, విశాఖతో సరిపెడతానన్న చిన్నబాబు
     

6:50 AM, Nov 27, 2023
నేడు ఢిల్లీకి చంద్రబాబు

  • సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు హాజరుకానున్న చంద్రబాబు
  • రేపటి వరకు ఢిల్లీలోనే చంద్రబాబు బస
     

6:45 AM, Nov 27, 2023
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ 

  • జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ
  • స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ
  • బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్
  • మంగళవారం చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

పిటిషన్‌లో  కీలక అంశాలు:

  • బెయిల్‌ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం
  • పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది
  • హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది
  • కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే వ్యాఖ్యానించింది
  • దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు
  • ఇలాంటి సమయంలో బెయిల్‌ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది
  • సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు
  • కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్‌ కోర్టు అధికారాలను హరించడమే
  • ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్‌ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది
  • బెయిల్‌ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్‌ ఎలాంటి వాదనలు చేయలేదు
  • దర్యాప్తు సమయంలో బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది


6:40 AM, Nov 27, 2023
స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
  • నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
  • జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
  • సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రచారం
  • ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
  • అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
  • షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
  • విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
  • పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
  • ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
  • విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
  • స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
  • నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
  • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
  • రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
  • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
  • చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
  • 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
  • సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
  • ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
  • రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
  • కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • నవంబర్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

6:30 AM, Nov 27, 2023
నవంబర్‌ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు

  • నవంబర్‌ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్‌ 30తో తెలంగాణ ఎన్నికలు
  • సైకిల్‌ రిపేర్‌కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు
  • ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి?
  • ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్‌ వినడాయే?
  • రెగ్యులర్‌గా ఏపీలో ఉండి వారాహి  యాత్ర చేయమంటే పవన్‌ వినడాయే?
  • నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే?
  • కనీసం సింగిల్‌గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే?
  • పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా?
  • ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు?
  • ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది?
  • కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి?
  • జనసేనకు కేటాయించే సీట్లపై టీడీపీ క్యాడర్‌కు ఏమని చెప్పాలి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement